Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా.. కొద్ది గ్యాప్‌లో అసలేం జరిగింది ?
Ahmedabad Plane Crash : ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ 11 సంవత్సరాల పురాతన విమానం కాగా, అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఈ విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 230 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. జూన్ 12 మధ్యాహ్నం టేకాఫ్ అయిన ఈ విమానం ఆరే నిమిషాల్లో నియంత్రణ కోల్పోయి నేలకు ఢీకొట్టింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే 825 అడుగుల ఎత్తులో ఫ్లైయింగ్ లిఫ్ట్‌ను కోల్పోయి నేల మీదకు జారిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది.
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా.. కొద్ది గ్యాప్‌లో అసలేం జరిగింది ?
విమాన ప్రమాదం ఎలా జరిగింది? విమానం ఎందుకు కుప్పకూలింది? అసలేం జరిగింది? ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.విమాన ప్రమాదానికి కారణాలకు సంబంధించి మాజీ ఐఏఎఫ్ కెప్టెన్ సురేష్ రెడ్డి షాకింగ్ విషయాలు తెలిపారు. విమాన ప్రమాదానికి మానవ పొరపాట్లు, సాంకేతిక లోపాలు, వాతావరణం, ఏటీసీ సమస్యలు ప్రధాన కారణాలుగా ఆయన చెప్పారు. పైలెట్లు లేదా సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపాలు, నావిగేషన్ సమస్యల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చన్నారు
ఘటనకు కాస్త ముందు “మేడే” అనే అత్యవసర సంకేతాన్ని పైలట్లు పంపినట్టు అధికారికంగా ప్రకటించారు. విమానయాన రంగంలో “మేడే” అనేది అత్యవసర పరిస్థితులలో మాత్రమే వినిపించే కోడ్. ఇది ఫ్రెంచ్ పదం “మైడర్” నుంచి ఉద్భవించింది.. దీని అర్థం “నాకు సహాయం చేయండి”. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు రేడియో ద్వారా పంపబడుతుంది. అయినా అత్యవసర సహాయం అందేలోపే విమానం కూలిపోయింది.ఈ విమానం గతంలో పలుమార్లు మొరాయించిందట.గత డిసెంబర్‌లో ఇదే విమానంలో పొగలు రాగా, ఏడాదిలో రెండు సార్లు సాంకేతిక సమస్యలు వచ్చేవట. గతంలో ప్రమాదం నుండి తప్పించుకోగా, జూన్‌లో పెద్ద ప్రమాదం బారిన పడ్డారు.
నిర్వహణ లోపం వల్ల విమానంలోని యంత్రాలు మొరాయించడమూ ప్రమాదానికి ఓ కారణం అని చెబుతున్నారు. ఇక పక్షులు ఢీకొనడం, విమానం భాగాలు విరిగిపోవడం కూడా ఈ దుర్ఘటనకు కారణం కావొచ్చన్నారు. పైలెట్ ఎర్రర్ వల్ల కూడా ప్రమాదం జరగొచ్చన్నారు. ఇంజిన్ లో ఫైర్ అని పైలెట్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయన్న సురేశ్ రెడ్డి.. బ్లాక్ బాక్స్ దొరికితేనే విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలుస్తుందన్నారు.ల్యాండింగ్ గేర్ సరిగ్గా మూసివేయబడలేదట. ఎందుకంటే ఒక చక్రం భవనంలో ఇరుక్కుపోయినట్లు కనిపిస్తుంది. అంటే విమానంలో బ్యాలెన్స్ సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండాలి. మరోవైపు గతంలో కూడా ఈ విమానం పలుమార్లు మొరాయించిందని అంటున్నారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.