Ahmedabad Plane Crash : అహ్మ‌దాబాద్‌లో ఘోర విమాన ప్ర‌మాదానికి కార‌ణాలు ఇవేనా.. కొద్ది గ్యాప్‌లో అసలేం జరిగింది ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ahmedabad Plane Crash : అహ్మ‌దాబాద్‌లో ఘోర విమాన ప్ర‌మాదానికి కార‌ణాలు ఇవేనా.. కొద్ది గ్యాప్‌లో అసలేం జరిగింది ?

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2025,12:10 pm

ప్రధానాంశాలు:

  •  Ahmedabad Plane Crash : అహ్మ‌దాబాద్‌లో ఘోర విమాన ప్ర‌మాదానికి కార‌ణాలు ఇవేనా.. కొద్ది గ్యాప్‌లో అసలేం జరిగింది ?

Ahmedabad Plane Crash : ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ 11 సంవత్సరాల పురాతన విమానం కాగా, అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఈ విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 230 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. జూన్‌ 12 మధ్యాహ్నం టేకాఫ్‌ అయిన ఈ విమానం ఆరే నిమిషాల్లో నియంత్రణ కోల్పోయి నేలకు ఢీకొట్టింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే 825 అడుగుల ఎత్తులో ఫ్లైయింగ్‌ లిఫ్ట్‌ను కోల్పోయి నేల మీదకు జారిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది.

Ahmedabad Plane Crash అహ్మ‌దాబాద్‌లో ఘోర విమాన ప్ర‌మాదానికి కార‌ణాలు ఇవేనా కొద్ది గ్యాప్‌లో అసలేం జరిగింది

Ahmedabad Plane Crash : అహ్మ‌దాబాద్‌లో ఘోర విమాన ప్ర‌మాదానికి కార‌ణాలు ఇవేనా.. కొద్ది గ్యాప్‌లో అసలేం జరిగింది ?

Ahmedabad Plane Crash : కార‌ణాలు ఇవేనా ?

విమాన ప్రమాదం ఎలా జరిగింది? విమానం ఎందుకు కుప్పకూలింది? అసలేం జరిగింది? ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.విమాన ప్రమాదానికి కారణాలకు సంబంధించి మాజీ ఐఏఎఫ్ కెప్టెన్ సురేష్ రెడ్డి షాకింగ్ విషయాలు తెలిపారు. విమాన ప్రమాదానికి మానవ పొరపాట్లు, సాంకేతిక లోపాలు, వాతావరణం, ఏటీసీ సమస్యలు ప్రధాన కారణాలుగా ఆయన చెప్పారు. పైలెట్లు లేదా సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపాలు, నావిగేషన్ సమస్యల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చన్నారు

ఘటనకు కాస్త ముందు “మేడే” అనే అత్యవసర సంకేతాన్ని పైలట్లు పంపినట్టు అధికారికంగా ప్రకటించారు. విమానయాన రంగంలో “మేడే” అనేది అత్యవసర పరిస్థితులలో మాత్రమే వినిపించే కోడ్‌. ఇది ఫ్రెంచ్ పదం “మైడర్” నుంచి ఉద్భవించింది.. దీని అర్థం “నాకు సహాయం చేయండి”. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు రేడియో ద్వారా పంపబడుతుంది. అయినా అత్యవసర సహాయం అందేలోపే విమానం కూలిపోయింది.ఈ విమానం గ‌తంలో ప‌లుమార్లు మొరాయించింద‌ట‌.గ‌త డిసెంబ‌ర్‌లో ఇదే విమానంలో పొగ‌లు రాగా, ఏడాదిలో రెండు సార్లు సాంకేతిక స‌మ‌స్య‌లు వ‌చ్చేవ‌ట‌. గ‌తంలో ప్ర‌మాదం నుండి త‌ప్పించుకోగా, జూన్‌లో పెద్ద ప్ర‌మాదం బారిన ప‌డ్డారు.

నిర్వహణ లోపం వల్ల విమానంలోని యంత్రాలు మొరాయించడమూ ప్రమాదానికి ఓ కారణం అని చెబుతున్నారు. ఇక పక్షులు ఢీకొనడం, విమానం భాగాలు విరిగిపోవడం కూడా ఈ దుర్ఘటనకు కారణం కావొచ్చన్నారు. పైలెట్ ఎర్రర్ వల్ల కూడా ప్రమాదం జరగొచ్చన్నారు. ఇంజిన్ లో ఫైర్ అని పైలెట్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయన్న సురేశ్ రెడ్డి.. బ్లాక్ బాక్స్ దొరికితేనే విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలుస్తుందన్నారు.ల్యాండింగ్ గేర్ సరిగ్గా మూసివేయబడలేదట‌. ఎందుకంటే ఒక చక్రం భవనంలో ఇరుక్కుపోయినట్లు కనిపిస్తుంది. అంటే విమానంలో బ్యాలెన్స్ సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండాలి. మ‌రోవైపు గ‌తంలో కూడా ఈ విమానం ప‌లుమార్లు మొరాయించింద‌ని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది