YS Jagan : ఇంత లేట్ అయితే.. జగన్ తో చంద్రబాబు పోటీ కష్టమే..!
YS Jagan: అసలు చంద్రబాబు ప్లాన్ ఏంటి. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. ఇప్పటికే కాపీ కొట్టిన వైసీపీ ప్రభుత్వ పథకాలను తమ మేనిఫెస్టోగా ప్రకటించారు. అదంతా పక్కన పెడితే చంద్రబాబు కొన్ని విషయాల్లో చేసే నాన్చివేత ధోరణి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది. అవును.. మరీ ఇంత నాన్చివేత ధోరణి వల్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు విసిగిపోతున్నారు.
కొందరు అభ్యర్థుల విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలకు తీవ్ర సమస్యలు తీసుకొస్తోంది. అసలు.. తమకు సీటు వస్తుందా రాదా అన్నట్టుగా ఉంది పరిస్థితి. చంద్రబాబు తమ నియోజకవర్గాలకు సభకు వస్తే.. అక్కడ కష్టపడి డబ్బులు ఇచ్చి మరీ జనాలను సేకరించి.. అన్ని ఏర్పాట్లు సొంత ఖర్చులతో చేసి చివరకు తమకే టికెట్ ప్రకటిస్తారని భావించిన నేపథ్యంలో ఇప్పటి వరకు చంద్రబాబు కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ ప్రకటించలేదు. ఇంతలా కాలయాపన చేయడం వల్ల చాలా నష్టం వాటిల్లుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
YS Jagan : సత్తెనపల్లిలో టీడీపీ ఇన్ చార్జ్ గా కన్నాను ఎంపిక చేయడంపై కోడెల ఆగ్రహం
పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి టీడీపీ ఇన్ చార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు ఎంపిక చేశారు. దీంతో కోడెల శివరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా.. అన్ని చోట్ల పార్టీలో అసంతృప్తులే. ఇలాంటి పరిస్థితులు అన్ని నియోజకవర్గాల్లో ఉంటే అది టీడీపీకే నష్టం అని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ జగన్ తో పోటీ పడాలని.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేతలను పట్టించుకోకుండా.. పొత్తుల కోసం వేరే పార్టీల వెంట పడుతూ.. అక్కడే కాలయాపన చేస్తూ టీడీపీకి తీవ్ర నష్టాన్ని చంద్రబాబు తీసుకొస్తున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.