
Warangal Airport : వరంగల్ ఎయిర్ పోర్టు క్రిడెట్ ఏ పార్టీకి దక్కుతుంది..?
Warangal Airport : వరంగల్‌లో మామనూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ గేమ్ మొదలైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఈ ఎయిర్ పోర్టును కొచ్చి ఎయిర్ పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీని ద్వారా తెలంగాణలో విమానయాన సేవలు మరింత విస్తరించనున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎవరి కృషి ఎక్కువ? ఎవరికి ఘనత దక్కాలి? అనే విషయంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో మాటల యుద్ధం మొదలుపెట్టాయి.
Warangal Airport : వరంగల్ ఎయిర్ పోర్టు క్రిడెట్ ఏ పార్టీకి దక్కుతుంది..?
కేంద్రం అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు మామనూరు ఎయిర్ స్ట్రిప్ వద్ద సంబరాలు చేసుకున్నారు. దీంతో ఒకరిదంటే ఒకరికి ఘనత తీసిపోకుండా పోటీ పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తానే ఎంతో కష్టపడి కేంద్రమంత్రులను ఒప్పించి, భూసేకరణ నిధులు కేటాయించి, ఎయిర్ పోర్టును తెచ్చానని ప్రకటించారు. అయితే బీజేపీ నేత కిషన్ రెడ్డి దీనిని తిప్పికొడుతూ, ఈ ప్రాజెక్ట్ పూర్తిగా తమ కృషి వల్లే సాధ్యమైందని ప్రచారం మొదలుపెట్టారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేతలు “ఏదైనా అభివృద్ధి జరిగితే అది కిషన్ రెడ్డి కృషి, లేదంటే రేవంత్ వైఫల్యమే” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక బీఆర్‌ఎస్ నేతలు మరో వాదనను ముందుకు తెస్తున్నారు. తామే మొదట వరంగల్ ఎయిర్ పోర్టు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చామని, అనుమతుల కోసం ఎంతగానో కృషి చేశామని చెప్పుకొస్తున్నారు. అయితే గతంలోనే కేంద్రం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూసేకరణలో సహకరించలేదని మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వాదనలతో బీఆర్‌ఎస్ మౌనం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం స్థానిక ప్రజల చిరకాల స్వప్నం. రాజకీయ పార్టీలు ఎవరి కృషి ఎక్కువ అనే విషయంపై వాదనలు చేయడం కంటే, ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికార, విపక్ష పార్టీలు పరస్పర విమర్శలకు కాకుండా, నిర్మాణ పనుల కోసం కలిసి పనిచేయడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.