Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ పట్టబద్రుల స్థానంకు సంబంధించిన ఎన్నికలకు సర్వ సిద్దం అయ్యింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం లో టీఆర్‌ఎస్ మరియు బీజేపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. బీజేపీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ఏకంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవిని రంగంలోకి దించడం జరిగింది. ఆమె ఎంపికతో బీజేపీ పై టీఆర్‌ఎస్ సగం గెలిచినట్లయ్యింది. కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ శాతం మంది ఆమెకు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. ఇక హరీష్ రావును రంగంలోకి దించడం వల్ల ఆ ఎమ్మెల్సీ స్థానంను టీఆర్‌ఎస్ ఈజీగానే గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. హరీష్ రావుపై సానుభూతితో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ సురభి కి ఓట్లు వేసే అవకాశం ఉందంటున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యుడిగా హరీష్ రావు వ్యవహరించిన విషయం తెల్సిందే. ఆ ఉప ఎన్నికల్లో ఓటమి కారణంగా పార్టీలో హరీష్ రావు ప్రభావం తగ్గినట్లుగా ఉంది. అందుకే ఆయన ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు చాలా గట్టిగా ఆదేశాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థి గెలుపు కోసం పాటు పడాలని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోతే తన రాజకీయ భవితవ్యం ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని ఈ సందర్బంగా పార్టీ నాయకులతో ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావపై కాస్త సానుభూతి అయితే పెరిగింది.
గ్రాడ్యుయేట్లు ఎక్కువగా నిరుద్యోగులు ఉన్నారు. కనుక వారి నుండి టీఆర్‌ఎస్ కు ఎంత వరకు ఓట్లు వస్తాయి అంటే అనుమానమే అన్నట్లుగా స్వయంగా ఆపార్టీ నాయకులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇప్పుడు హరీష్ రావు వైపు చూస్తున్నారు. హరీష్ రావు మొహం చూసి గ్రాడ్యుయేట్స్ ఈ ఒక్కసారికి ఓట్లు వేసే అవకాశం ఉందని ఆయన వైపే వారు ఉంటారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా హరీష్ రావు చేస్తున్న పనులు మరియు ఆయన ప్రచారంతో టీఆర్‌ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒక వేళ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోతే హరీష్ రావు పార్టీకి మరింత దూరం అవ్వడం ఖాయం, దాంతో కేటీఆర్ కు పోటీ పూర్తిగా తగ్గే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నాడట.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.