Revanth Reddy : రేవంత్ ఖాతాలో మరో విజయం.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కీలక నేత? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : రేవంత్ ఖాతాలో మరో విజయం.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కీలక నేత?

 Authored By kranthi | The Telugu News | Updated on :6 October 2023,6:00 pm

Revanth Reddy : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలలే సమయం ఉంది. ఈనేపథ్యంతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఒక మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీల్లో జంపింగ్స్ అయితే కామన్ అయిపోయాయి. ఏం చేసినా ఎన్నికల ముందే అన్నట్టుగా పలువురు కీలక నేతలు ఆ పార్టీలో ఏమాత్రం తేడా కొట్టినా వేరే పార్టీలోకి జంప్ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఏమాత్రం ఆలోచించకుండా వేరే పార్టీలోకి జంప్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు, ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయని ఒక అంచనా వేసుకొని మరీ వేరే పార్టీల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి కూడా ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కు బలం పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలిచే చాన్స్ కూడా పెరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు నూతనోత్సాహంతో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.

ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యారో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కీలక నేతలను కాంగ్రెస్ లో చేరేలా చేయడంలో రేవంత్ రెడ్డి సఫలం అయ్యారు. తాజాగా మరో కీలక నేత కూడా బీఆర్ఎస్ ను వీడి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ ను వీడి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. కానీ.. కాంగ్రెస్ నుంచి ఆయనకు కాంగ్రెస్ టికెట్ హామీ లభించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన పైలెట్ రోహిత్ రెడ్డి.. బీఆర్ఎస్ లో చేరారు. ఈసారి కూడా తాండూరు నుంచి పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే.. ఈసారి టికెట్ దక్కుతుందనే భరోసాతో ఉన్న బుయ్యని మనోహర్ రెడ్డికి మొండి చేయి చూపడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

will buyyani manohar reddy to join in congress

#image_title

Revanth Reddy : తాండూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రేసులో ఎవరు ఉన్నారు?

కాంగ్రెస్ నుంచి తాండూరు ఎమ్మెల్యే టికెట్ హామీని రేవంత్ రెడ్డి ఇవ్వడంతోనే బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత చూపించినట్టు తెలుస్తోంది. కానీ.. తాండూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాల్వ సుజాత రేసులో ఉంది. ఇంకా వేరే నేతలు కూడా చాలామంది లైనులో ఉన్నారు. ఈనేపథ్యంలో మరి బుయ్యనికి తాండూరు నుంచి కాంగ్రెస్ టికెట్ లభిస్తుందా? లేదా? వేచి చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది