Chandrababu : ప్రజల సంక్షేమం కోసం తన చివరి రక్తపు బొట్టు వరకు శ్రమిస్తా : చంద్రబాబు
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం తన చివరి రక్తపు బొట్టు వరకు శ్రమించడానికి సిద్ధమని వెల్లడించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛంద్ర లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే తన ప్రధాన కర్తవ్యమని, ప్రజల కోసం నిత్యం కష్టపడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu : ప్రజల సంక్షేమం కోసం తన చివరి రక్తపు బొట్టు వరకు శ్రమిస్తా : చంద్రబాబు
అలాగే తన రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావిస్తూ 47 ఏళ్ల క్రితం ఇదే రోజు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యంగా మారిందని చెప్పారు. దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా, అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న రాజకీయ యోధుడిగా చంద్రబాబు తన అనుభవాన్ని వినిపించారు. ప్రజలు మళ్లీ తామీ అధికారంలోకి రావాలని అవకాశం ఇచ్చారని, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచ నవశకంపై నిలబెట్టాలనే సంకల్పంతో అన్ని రంగాల్లో పురోగతి సాధించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానాలు, పేదరిక నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికలు, యువతకు ఉద్యోగావకాశాలు, వ్యవసాయ రంగానికి మరింత తోడ్పాటు లాంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళతానని, మరోసారి ప్రపంచం అబ్బురపడేలా ఆంధ్రప్రదేశ్‌ను రూపుదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.
Good News : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుండడం మనం చూస్తున్నాం.…
Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో…
Chiranjeevi : జనసేన పార్టీ 12వ అవిర్భావ సభ ఉత్సాహభరితంగా పిఠాపురంలో జరిగింది. ఈ సభకు పెద్ద ఎత్తున జనసైనికులు,…
Amaravati : ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో…
Anasuya : యాంకర్ అనసూయ Anchor Anasuya గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. అందంతో పాటు అభినయంతో కూడా…
RC16 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram CHaran , జాన్వీ కపూర్ janhvi kapoor జంటగా బుచ్చి బాబు…
TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల జరిగిన జనసేన ప్లీనరీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని…
Sunitha : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి…
This website uses cookies.