YS Jagan : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు. పంచాయితీ ఎన్నికల తీరు తెన్నుల గురించి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు నాయుడు కాస్త ఓపిక పట్టి పార్టీని కాపాడుకుంటే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నాడు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏండేది కేవలం రెండేళ్లు మాత్రమే అని, ఆతర్వాత జగన్ గద్దె దిగడంతో పాటు తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేయడం కూడా ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశాడు. రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ ప్రతి గ్రామం కు కూడా రూ.5 కోట్ల నిధులు విడుదల చేయబోతుంది. ఆ నిధులతో మీరే గ్రామాల్లో అభివృద్ది పనులు చేయాలంటూ ఈ సందర్బంగా ఆయన అన్నాడు.
ఏపీలో అభివృద్ది జరగాలంటే కేవలం తెలుగు దేశం పార్టీతోనే సాధ్యం అంటూ ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు అన్నాడు. ప్రతి గ్రామంలో కూడా అయిదు సంవత్సరాకలు అయిదు కోట్ల చొప్పున విడుదల చేస్తూ అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు అన్నాడు. అభివృద్ది కార్యక్రమాలను వదిలేసి వైకాపా కేవలం వారు దోచుకోవడమే సరిపోతుందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంచాయితీ ఎన్నికల్లో బాగా పని చేసి తెలుగు దేశం పార్టీతోనే అభివృద్ది సాధ్యం అంటూ వారికి చెప్పాలని అప్పుడే ప్రజల్లో పార్టీ గురించి తెలుస్తుందని బాబు అన్నాడు.
ఏపీకి నిధులు తీసుకు రావడం మొదలుకుని రాష్ట్రంలో ప్రజల బాగోగులు చూసుకోవడం వరకు అన్ని విషయాల్లో కూడా వైఎస్ జగన్ విషలం అయ్యాడు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటూ చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సూచించాడు. పంచాయితీ ఎన్నికలను అస్సలు లైట్ తీసుకోవదంటూ ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా వర్క్ చేసి ఎక్కువ పంచాయితీలను గెలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో వారే గ్రామాల్లో తెలుగు దేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తారంటూ చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.