YS Jagan : ఏంటి నిజమా ? 2 సంవత్సరాల్లో వైఎస్‌ జగన్ కుర్చీ దిగిపోతాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : ఏంటి నిజమా ? 2 సంవత్సరాల్లో వైఎస్‌ జగన్ కుర్చీ దిగిపోతాడా?

YS Jagan : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు. పంచాయితీ ఎన్నికల తీరు తెన్నుల గురించి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు నాయుడు కాస్త ఓపిక పట్టి పార్టీని కాపాడుకుంటే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నాడు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఏండేది కేవలం రెండేళ్లు మాత్రమే […]

 Authored By himanshi | The Telugu News | Updated on :3 February 2021,11:10 am

YS Jagan : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు. పంచాయితీ ఎన్నికల తీరు తెన్నుల గురించి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు నాయుడు కాస్త ఓపిక పట్టి పార్టీని కాపాడుకుంటే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నాడు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఏండేది కేవలం రెండేళ్లు మాత్రమే అని, ఆతర్వాత జగన్ గద్దె దిగడంతో పాటు తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేయడం కూడా ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశాడు. రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ ప్రతి గ్రామం కు కూడా రూ.5 కోట్ల నిధులు విడుదల చేయబోతుంది. ఆ నిధులతో మీరే గ్రామాల్లో అభివృద్ది పనులు చేయాలంటూ ఈ సందర్బంగా ఆయన అన్నాడు.

టీడీపీతోనే అభివృద్ది సాధ్యం…

YS Jagan going to power less with in 2 years says tdp chandra babu naidu

YS Jagan going to power less with in 2 years says tdp chandra babu naidu,

ఏపీలో అభివృద్ది జరగాలంటే కేవలం తెలుగు దేశం పార్టీతోనే సాధ్యం అంటూ ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు అన్నాడు. ప్రతి గ్రామంలో కూడా అయిదు సంవత్సరాకలు అయిదు కోట్ల చొప్పున విడుదల చేస్తూ అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు అన్నాడు. అభివృద్ది కార్యక్రమాలను వదిలేసి వైకాపా కేవలం వారు దోచుకోవడమే సరిపోతుందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంచాయితీ ఎన్నికల్లో బాగా పని చేసి తెలుగు దేశం పార్టీతోనే అభివృద్ది సాధ్యం అంటూ వారికి చెప్పాలని అప్పుడే ప్రజల్లో పార్టీ గురించి తెలుస్తుందని బాబు అన్నాడు.

సీఎంగా వైఎస్‌ జగన్ విఫలం… YS Jagan

ఏపీకి నిధులు తీసుకు రావడం మొదలుకుని రాష్ట్రంలో ప్రజల బాగోగులు చూసుకోవడం వరకు అన్ని విషయాల్లో కూడా వైఎస్‌ జగన్‌ విషలం అయ్యాడు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటూ చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సూచించాడు. పంచాయితీ ఎన్నికలను అస్సలు లైట్‌ తీసుకోవదంటూ ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా వర్క్‌ చేసి ఎక్కువ పంచాయితీలను గెలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో వారే గ్రామాల్లో తెలుగు దేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తారంటూ చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది