YS Jagan : ఫుల్ పవర్స్ , గ్రీన్ సిగ్నల్ .. జగన్ విషయంలో కేంద్రం బిగ్ నిర్ణయం !
YS Jagan : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల వేళ కేంద్రం దిగి వచ్చి మరీ ఏపీ అభివృద్ధి కోసం తనవంతు సాయం అందిస్తోంది. నిజానికి.. అదంతా ఊరికే జరిగింది కాదు. కేంద్ర ఊరికే ఏపీకి సాయం చేయడం లేదు. దాని వెనుక సీఎం జగన్ కృషి ఉంది. అవును.. రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఢిల్లీలో పోరాటం చేస్తూనే ఉంది. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అవును.. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ లోటు నిధులను తాజాగా కేంద్రం.. ఏపీకి విడుదల చేసింది. అంతే కాదు.. మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
నిజానికి.. పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్ట్. దాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రమే నిర్మించాలి కానీ.. గతంలో టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రం పట్టించుకోలేదు. నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండటంతో జగన్ ప్రభుత్వం రాగానే పోలవరం ప్రాజెక్ట్ నిధులు, నిర్మాణం విషయంపై సీఎం జగన్.. కేంద్రంతో గత నాలుగేళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నారు. దానికి ఫలితంగానే తాజాగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం ఏకంగా రూ.12 వేల కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.
YS Jagan : రూ.12911 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్రం ఆమోదం
ప్రస్తుతం ఉన్న నిధులు కాకుండా.. అదనంగా మరో రూ.12,911 కోట్ల నిధులను విడుదల చేసేందుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదంతా సీఎం జగన్ కృషి. చాలా ఏళ్ల నుంచి పోలవరం ప్రాజెక్ట్ విషయమై కేంద్రంతో పోరాడుతున్నారు. ఎంతో కష్టపడి కేంద్రంతో పోరాడి చివరకు సాధించగలిగారు. ఈ పని చంద్రబాబు చేయలేకపోయారు. అందుకే ఆయన ఒక ఫెయిల్యూర్ సీఎంగా మిగిలిపోయారు.