YS Sharmila : వైఎస్ షర్మిల.. ఇప్పుడు తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఎందుకంటే ఓవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలు.. మరోవైపు వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు. ఏపీలో అన్న ముఖ్యమంత్రి అయితే.. తెలంగాణలో చెల్లె పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. తెలంగాణలో ఎన్నికల ముందు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినంత పని చేసింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని.. తాను కూడా పాలేరులో పోటీ చేయడం లేదని.. పాలేరులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎలా నువ్వు మద్దతు ఇస్తావు. నీ అన్నను జైలులో వేసిన కాంగ్రెస్ పార్టీతో నువ్వు చేయి కలుపుతావా అంటూ వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ షర్మిలపై ఫైర్ అయ్యారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల ఈ విషయంపై స్పందించి వైఎస్ షర్మిలపై విమర్శలు చేయడంపై తాజాగా షర్మిల కూడా స్పందించారు.
నేను తెలంగాణ రాజకీయాలకు వచ్చినప్పుడు మాకు సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు. తిరిగి సంబంధం పెట్టుకోవాలనా? నేను తెలంగాణలో, తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదు అనే వాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు. మేమైతే సంబంధం లేదనే అనుకుంటున్నాం. మీరు మాట్లాడుతున్నారంటే.. మళ్లీ సంబంధం కలుపుకుంటున్నారా? సంబంధం ఉందనా? ఏమనుకోవాలి మేము. సజ్జల గారు సమాధానం చెప్పాలి. అసలు కేసీఆర్ గారు బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అని చెబుతున్నారు. మరి దానికి ఏం సమాధానం చెబుతారు సజ్జల. ముందు మీ కథ మీరు చూసుకోండి అంటూ షర్మిల మండిపడ్డారు.
సజ్జల మాట్లాడితే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడినట్టే కదా అని మీడియా వాళ్లు మళ్లీ షర్మిలను అడగడంతో ఎవరికైనా ఇదే సమాధానం అంటూ షర్మిల ఇన్ డైరెక్ట్ గా సజ్జల అయినా నాకు ఒక్కటే.. జగన్ అయినా నాకు ఒక్కటే అని తన సొంత అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్ కే కౌంటర్ ఇచ్చింది వైఎస్ షర్మిల. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.