
Ys Sharmila : షర్మిలకు కేంద్రమంత్రి పదవా.. సాధ్యమేనా..?
Ys Sharmila : ఏమీ లేని చోట ఏదో ఉందని ప్రజలు అనుకోవాంటే ఇప్పుడు ఎవరికి వారే డబ్బా కొట్టుకోవాలన్నది అందరూ ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు పని చేస్తేనే ఆ అభ్యర్థి మీద అంచనాలు పెరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం తప్పుడు ప్రచారాలతోనే హైప్ పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో షర్మిల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏపీలో కాంగ్రెస్ కు అసలు అతీ గతీ లేదనే చెప్పుకోవాలి. అందులోనూ కడప రాజకీయాల్లో కాంగ్రెస్ కు అడ్రస్ లేదు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ సారి మాత్రం అంతకన్నా ఓ రెండు శాతం ఓట్లు ఎక్కువ రావొచ్చని అంటున్నారు.
కడప అంటేనే వైసీపీకి కంచుకోట. అక్కడ వైసీపీని కాదని వేరే పార్టీ గెలవలేదు. అలాంటి చోట కాంగ్రెస్ నుంచి షర్మిల గెలుస్తుందా అంటే కలే అనే చెప్పుకోవాలి. కాగా ఇప్పుడు షర్మిల మీద హైప్ తేవడానికి ఆమెకు కేంద్రమంత్రి పదవి అని ప్రచారం చేస్తున్నారు. ఇది విన్న వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే కడపలో అసలు ఆమె గెలవాలి కదా. ఇక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏడింటిలో వైసీపీ హవానే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ వారే. కాబట్టి షర్మిల గెలవాలంటే ఏడింటిలో నాలుగు సీట్టలో మెజార్టీ ఓట్లు సాధించాల్సి ఉంటుంది. కడపలో నాలుగు చోట్ట వైసీపీ ఓడిపోవడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అధికారం కోల్పోయేలా సీట్లు కోల్పోవడమే అని అర్థం చేసుకోవాలి. మరి వైసీపీ మరీ అంత దిగజారిపోయే స్థితిలో ఉందా అంటే అదీ కాదు. ఇక్కడ గత ఐదేండ్లుగా షర్మిల పత్తా లేకుండా పోయింది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో ఆమె వచ్చి ఓట్లు అడిగితే ఏ మాత్రం వేస్తారనేది పెద్ద ప్రశ్ననే.
Ys Sharmila : షర్మిలకు కేంద్రమంత్రి పదవా.. సాధ్యమేనా..?
అందులోనూ కాంగ్రెస్ అంటేనే కడప ప్రజలు తీవ్ర కోపంలో ఉన్నారు. అందుకే ఇప్పుడు కడప ప్రజలు షర్మిలను ఏ మేరకు ఓట్లేసి గెలిపిస్తారో అనేది అది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఆమె కడప ఎంపీగా గెలిచినా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలి. వచ్చినా ఆమెను కేంద్రమంత్రిగా చేయాలంటే చాలా లెక్కలు ఉంటాయి. అసలు ఇండియా కూటమి ఏర్పడ్డాక.. ఇతర లోకల్ పార్టీలకే ఎక్కువ మంత్రుల పదవులు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇవన్నీ జరిగి ఆమె కేంద్రమంత్రి అవ్వాలంటే పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.