
YS Sharmila : జగన్,షర్మిళ మధ్య రాజీ కుదిరేలా లేదుగా.. సిగ్గులేదా అంటూ షర్మిళ ఆగ్రహం
YS Sharmila : గత కొద్ది రోజులుగా అన్న, చెల్లెళ్ల మధ్య వైరం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయింది. జగన్ తన చెల్లి షర్మిళకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు షర్మిళ మాత్రం జగన్‌పై విమర్శలు సంధిస్తూనే ఉంది. వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నా ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నా గురించి.. ఏపీలోని మరో పొలిటికల్ పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. వినుకొండ హత్య గురించి కూడా వైఎస్ షర్మిల రియాక్టయ్యారు. వినుకొండ రషీద్ హత్యను వ్యక్తిగత హత్యగా పేర్కొన్న షర్మిల.. రాజకీయ హత్యకాదని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ హత్యా రాజకీయాలు చేశారన్న వైఎస్ షర్మిల.. సొంత చెల్లెళ్లకు కూడా జగన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వినుకొండ హత్య మీద ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్న వైఎస్ జగన్.. సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య మీద ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులతో జగన్ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇక ఢిల్లీ వేదికగా జగన్ చేపట్టిన దీక్షపై స్పందించారు. తాను చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలోదో సమాధానం చెప్పాలని జగన్ అంటున్నారని… అసలు వైసీపీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ప్రశ్నించారు. “పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లుగా బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం.
YS Sharmila : ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా.. మద్దతుపై వైఎస్ షర్మిళ స్టన్నింగ్ కామెంట్స్..!
క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా?” అని జగన్ ను షర్మిల గట్టిగా నిలదీసింది.. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.. “మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్దం అన్న వాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు..?” అంటూ వైఎస్ షర్మిల .. జగన్‌ని ఓ రేంజ్‌లో ఏసుకుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.