Ys Vijayamma : జ‌గ‌న్ ప్లాన్‌ని అనుస‌రిస్తున్న ష‌ర్మిళ‌.. అమెరికా నుండి విజ‌య‌మ్మ‌తో వీడియో ప్ర‌చార చేయిస్తుందా..?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 18 April 2024, 8:00 pm
  •  Ys Vijayamma : జ‌గ‌న్ ప్లాన్‌ని అనుస‌రిస్తున్న ష‌ర్మిళ‌.. అమెరికా నుండి విజ‌య‌మ్మ‌తో వీడియో ప్ర‌చార చేయిస్తుందా..?

Ys Vijayamma : ఏపీ ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ముఖ్యంగా జ‌గ‌న్, ష‌ర్మిళ మధ్య పోరు హాట్ టాపిక్ అవుతుంది. సీఎం జగన్ ఒకవైపు.. షర్మిల మరోవైపు చేరి.. ఎన్నికల్లో పోటీకి సై అంటే సై అంటున్నారు. షర్మిలపై జగన్ ప్రత్యక్షంగా విమర్శలు చేయకపోయినా.. ఆ పార్టీనేతలు మాత్రం ఈమెని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ఇక షర్మిల, సునీత కలిసి జగన్ ని ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పీక్స్‌లో ఉన్నటైమ్‌లో విజ‌య‌మ్మ అమెరికాకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కుమారుడు, మరోవైపు కుమార్తె ఇద్దరూ చెరో దారిలో వెళ్తున్న టైంలో తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి ఉంటుందనే ఆసక్తి అందరిలో కనిపించింది.

Ys Vijayamma : జ‌గ‌న్ ప్లాన్‌ని అనుస‌రిస్తున్న ష‌ర్మిళ‌.. అమెరికా నుండి విజ‌య‌మ్మ‌తో వీడియో ప్ర‌చార చేయిస్తుందా..?

Ys Vijayamma : జ‌గ‌న్ ప్లాన్‌ని అనుస‌రిస్తున్న ష‌ర్మిళ‌.. అమెరికా నుండి విజ‌య‌మ్మ‌తో వీడియో ప్ర‌చార చేయిస్తుందా..?

Ys Vijayamma : ఏం జ‌రుగుతుంది..

తెలంగాణ రాజకీయాల్లో ఉన్నప్పుడు షర్మిలకు తల్లిగా విజయమ్మ‌ సపోర్ట్‌ చేశారు. ఏపీ రాజకీయాల్లో ఆమె వచ్చిన తర్వాత విజయమ్మ‌ సైలెంట్ అయిపోయారు. ఇక‌ గత ఎన్నికల్లో కుమారుడు జగన్ విజయం కోసం తెగ తాప‌త్ర‌య ప‌డిన విజ‌య‌మ్మ ఈ సారి మాత్రం మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధంగా లేన‌ట్టే క‌నిపిస్తుంది. ఈ సారి ఎక్క‌డ కూడా జ‌గ‌న్‌కి పాజిటివ్‌గా మాట్లాడింది లేదు. దీనిని బ‌ట్టి చూస్తుంటే విజ‌య‌మ్మ మ‌ద్ద‌తు ష‌ర్మిళ‌కే గ‌ట్టిగా ఉంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఆమె త‌ల్లి విజ‌య‌మ్మ అమెరికాకి వెళ్ల‌గా అక్క‌డి నుండి వీడియో ప్ర‌చారం చేయించాల‌ని షర్మిళ భావిస్తుంద‌ట‌. ఈ విష‌యంలో జ‌గ‌న్‌ని ఫాలో అవుతుంది ష‌ర్మిళ‌.

Ys Vijayamma : జ‌గ‌న్ ప్లాన్‌ని అనుస‌రిస్తున్న ష‌ర్మిళ‌.. అమెరికా నుండి విజ‌య‌మ్మ‌తో వీడియో ప్ర‌చార చేయిస్తుందా..?

Ys Vijayamma : జ‌గ‌న్ ప్లాన్‌ని అనుస‌రిస్తున్న ష‌ర్మిళ‌.. అమెరికా నుండి విజ‌య‌మ్మ‌తో వీడియో ప్ర‌చార చేయిస్తుందా..?

వైఎస్ రాజ‌శేఖరెడ్డి న‌లుగురు అన్న‌ద‌మ్ముల‌కు ఒకే ఒక్క ఆడ‌ప‌డుచు విమ‌ల‌మ్మ‌. ఆమె మొద‌టి నుండి జ‌గ‌న్ కు, అవినాష్ కు స‌పోర్ట్ చేస్తూ వ‌స్తుంది. నేను మీ మేన‌త్త‌ను… వైఎస్ కుటుంబానికి ఆడ‌ప‌డుచును. వివేకం అన్న‌, రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎంతో ప్రేమించే సోద‌రిని. పులివెందుల, క‌డ‌ప ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్, అవినాష్ కు అండ‌గా ఉండాల‌ని కోరింది. ఈ ఎపిసోడ్ లో విజ‌య‌మ్మ‌ను ఇన్వాల్స్ చేయించాల‌ని జ‌గ‌న్ అండ్ కో కోరినా… ష‌ర్మిల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌లేక అలాగ‌ని జ‌గ‌న్ విజ్ఞ‌ప్తిని కాద‌న‌లేకే విజ‌య‌మ్మ అమెరికాకి వెళ్లి పోయింద‌నే ప్ర‌చారం ఉంది. అయితే జ‌గ‌న్ ఎలా అయితే విమ‌ల‌మ్మతో వీడియోలు చేయించి వ‌దులుతున్నాడో ష‌ర్మిళ కూడా త‌న త‌ల్లితో అమెరికా నుండి వీడియోలు చేయించి ప్ర‌చారానికి వాడుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు టాక్.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి