Gurumurthi తిరుపతి ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. సిట్టింగ్ ఎంపీ స్థానంను దక్కించుకునేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ టీమ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీలు ఆ స్థానంలో జెండా పాతేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ఆలోచించి ఆ సీటును డాక్టర్ గురుమూర్తికి ఇవ్వడం జరిగింది. ఒక సాదారణ డాక్టర్ అయిన గురు మూర్తి మొదటి నుండి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చాడు.
ఆ కారణంగా సీటు ఇవ్వడం జరిగిందని అంతా అంటున్నారు. గురుమూర్తి విజయం ఖాయం కాని మెజార్టీ భారీగా ఉండాలని వైకాపా నాయకులను ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించాడు.మెజార్టీతో వైకాపా బలంను ప్రతిపక్షాలకు తెలియజేయడంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా తమ బలంను నిరూపించుకోవాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైకాపా సిద్దం అయ్యారు. గురుమూర్తి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేందుకు గాను నామినేషన్ ను తాజాగా దాఖలు చేశారు.
ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల అనుసారంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలిందా అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. ఏడుగురు మంత్రులు 15 మంది ఎమ్మెల్యేలు ముఖ్య వైకాపా నాయకులు ఇంకా వేలాది మంది కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు గురుమూర్తి సన్నిహితులు బంధువులు నామినేషన్ కార్యక్రమం ముందు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.ఇక గురుమూర్తి నామినేషన్ వేసిన గడియ చాలా బలమైనదిగా పురోహితులు చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో పౌర్ణమి పూర్తి అయిన తర్వాత ఉదయం 11 గంటల సమయంలో సరిగ్గా రిటర్నింగ్ అధికారికి గురుమూర్తి నామినేషన్ ఇవ్వడం జరిగింది.
చాలా సెంటిమెంట్ తో అనేక రకాల అనుమానాలు మరియు అనేక రకాల సలహాలు సూచనలతో వైకాపా అధికారులు మూడు రోజుల క్రితం వేయాల్సిన నామినేషన్ ను తాజాగా వేయించారు. ఇంత బ్రహ్మ ముహూర్తంలో వేయడం వల్ల రికార్డు బ్రేకింగ్ మెజార్టీ రావాల్సిందే అంటూ వైకాపా నాయకులు ధీమాగా ఉన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.