Gurumurthi : శుభ ముహూర్తంలో వైకాపా గురుమూర్తి నామినేషన్‌.. ఆల్ ఇండియా రికార్డ్‌ ఖాయం అంటున్నారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gurumurthi : శుభ ముహూర్తంలో వైకాపా గురుమూర్తి నామినేషన్‌.. ఆల్ ఇండియా రికార్డ్‌ ఖాయం అంటున్నారు

Gurumurthi  తిరుపతి ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. సిట్టింగ్ ఎంపీ స్థానంను దక్కించుకునేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అండ్ టీమ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీలు ఆ స్థానంలో జెండా పాతేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ఆలోచించి ఆ సీటును డాక్టర్ గురుమూర్తికి ఇవ్వడం జరిగింది. ఒక సాదారణ డాక్టర్ అయిన […]

 Authored By himanshi | The Telugu News | Updated on :30 March 2021,4:59 pm

Gurumurthi  తిరుపతి ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. సిట్టింగ్ ఎంపీ స్థానంను దక్కించుకునేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అండ్ టీమ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీలు ఆ స్థానంలో జెండా పాతేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ఆలోచించి ఆ సీటును డాక్టర్ గురుమూర్తికి ఇవ్వడం జరిగింది. ఒక సాదారణ డాక్టర్ అయిన గురు మూర్తి మొదటి నుండి కూడా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చాడు.

ఆ కారణంగా సీటు ఇవ్వడం జరిగిందని అంతా అంటున్నారు. గురుమూర్తి విజయం ఖాయం కాని మెజార్టీ భారీగా ఉండాలని వైకాపా నాయకులను ఇప్పటికే వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించాడు.మెజార్టీతో వైకాపా బలంను ప్రతిపక్షాలకు తెలియజేయడంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా తమ బలంను నిరూపించుకోవాలంటూ వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైకాపా సిద్దం అయ్యారు. గురుమూర్తి పార్లమెంట్‌ సభ్యుడిగా పోటీ చేసేందుకు గాను నామినేషన్‌ ను తాజాగా దాఖలు చేశారు.

ysrcp tirupati mp candidate gurumurthi cost nomination

ysrcp tirupati mp candidate gurumurthi cost nomination

ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ఆదేశాల అనుసారంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలిందా అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. ఏడుగురు మంత్రులు 15 మంది ఎమ్మెల్యేలు ముఖ్య వైకాపా నాయకులు ఇంకా వేలాది మంది కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు గురుమూర్తి సన్నిహితులు బంధువులు నామినేషన్‌ కార్యక్రమం ముందు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.ఇక గురుమూర్తి నామినేషన్‌ వేసిన గడియ చాలా బలమైనదిగా పురోహితులు చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో పౌర్ణమి పూర్తి అయిన తర్వాత ఉదయం 11 గంటల సమయంలో సరిగ్గా రిటర్నింగ్‌ అధికారికి గురుమూర్తి నామినేషన్‌ ఇవ్వడం జరిగింది.

చాలా సెంటిమెంట్‌ తో అనేక రకాల అనుమానాలు మరియు అనేక రకాల సలహాలు సూచనలతో వైకాపా అధికారులు మూడు రోజుల క్రితం వేయాల్సిన నామినేషన్ ను తాజాగా వేయించారు. ఇంత బ్రహ్మ ముహూర్తంలో వేయడం వల్ల రికార్డు బ్రేకింగ్‌ మెజార్టీ రావాల్సిందే అంటూ వైకాపా నాయకులు ధీమాగా ఉన్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది