Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రివ్యూ & రేటింగ్…!
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review : రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 16, 2022
నటినటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగర్, కళ్యాణి నటరాజన్ తదితరులు.
డైరెక్టర్: ఇంద్రగంటి మోహన కృష్ణ
నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి
మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: పి. జి విందా
శుక్రవారం వస్తే థియేటర్స్‌లో సినిమా సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. సుధీర్ బాబు, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు సుధీర్ బాబు. మంచి సినిమాలే చేస్తున్నా.. కమర్షియల్ హిట్ మాత్రం ఇంత వరకూ రావడంలేదు. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు సుధీర్ . ఈ మూవీ డైరెక్టర్ ఇంద్రగంటితో సుధీర్ బాబు ముచ్చటగా చేసిన మూడో్ సినిమా ఇది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ: సుధీర్ బాబు ఇందులో నవీన్ పాత్రలో కనిపించాడు. హిట్ డైరెక్ట్‌గా పేరు తెచ్చుకున్న నవీన్.. కళ్యాణి పాత్రలో నటించిన కృతి శెట్టిని తన సినిమా కోసం హీరోయిన్‌గా తీసుకుంటాడు. అయితే సినిమాలలో నటించడం కళ్యాణి తల్లిదండ్రులకు అస్సలు నచ్చదు.చివరికి కొన్ని కండిషన్ల మీద ఒప్పుకుంటారు. ఓ సంఘటన వలన వారిద్దరి మధ్య దూరం పెరగడం, ఆ తర్వాత కలుసుకోవడం, ఇద్దరి మధ్య జరిగిన ఆ సంఘటన ఏంటనేది ఆసక్తికరంగా సాగడం వంటిది జరిగింది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ ను ఇంద్రగంటి గట్టిగానే ప్లాన్ చేశాడు. ఈ ఇద్దరు స్టార్స్ కూడా ఆ సీన్స్ నుఅంతే అద్భుతంగా పండించారు. ఇంద్రగంటి మోహన కృష్ణ నుంచి ఈ సారి సరికొత్త సినిమా చూశామన్న ఫిలింగ్ కలిగించారు. మరో వైపు సాగదీత వలన కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్త పడితే బాగుండేది అనే ఫిలింగ్ కలుగుతుంది. సినిమా కాస్త స్పీడ్ గా కదిలితే బాగుండు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ : సినిమా కథ,
సుధీర్ బాబు నటన
కామెడీ,
ఇంటర్వెల్ ట్విస్ట్.
మైనస్ పాయింట్స్ : బోరింగ్ సీన్స్
సాగదీత సన్నివేశాలు
విశ్లేషణ : గత సినిమాల మాదిరిగా కాకుండా ఇంద్రగంటి ఈ సారి చిత్రాన్ని కొత్త పంథాలో నడిపించాడు. కథ చాలా డిఫరెంట్ గా కనిపించింది.ముఖ్యంగా కామెడీ మాత్రం అదిరిపోయింది. రొమాంటిక్ సన్నివేశాలు కూడా అదుర్స్ అనే చెప్పాలి. మొత్తానికి ఈ సినిమాని థియేటర్స్‌లో తప్పకుండా చూడవచ్చు.
రేటింగ్: 2.75/ 5