నటీనటులు : నందిత శ్వేత, షకలక శంకర్, శ్రీతేజ, మధు, సత్య, సంజయ్ స్వరూప్
దర్శకుడు : చిన్ని కృష్ణ
నిర్మాత : సురేశ్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
మ్యూజిక్ డైరెక్టర్ : సురేశ్ బొబ్బిలి
రిలీజ్ డేట్ : 26 ఫిబ్రవరి 2021
Akshara Movie Review: ఒకప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అంటేనే మనకు గుర్తొచ్చే హీరోయిన్స్ సౌందర్య, మీనా, రమ్యకృష్ణ.. ఇలా ఉండేవారు. ఇటీవలి కాలంలో అంటే అనుష్క తర్వాతనే ఎవ్వరైనా. కానీ.. అనుష్క కూడా ఈ మధ్య ఏ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. ప్రస్తుత కాలంలో మాత్రం హీరోయిన్ నందిత శ్వేత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. అందులోనూ తను ఎక్కువగా హార్రర్ జానర్ సినిమాల్లో కనిపిస్తోంది.
Movie | Akshara Movie Review |
Star Cast | Nanditasweta, Shakalaka Shankar, Satya, Madhu |
Director | B. Chinni Krishna |
Producer | Ahiteja Bellamkonda – Suresh Varma Alluri |
Music | Suresh Bobbili |
Run Time | 2 hrs 15mins |
Release | 26th February, 2021 |
తాజాగా నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటించిన సినిమా అక్షర. ఈ సినిమా క్రైమ్ కథాంశంతో నడుస్తుంది. ఈ సినిమాకు చిన్ని కృష్ణ దర్శకత్వం వహించగా… షకలక శంకర్, సత్య, మధు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా ట్రైలర్ చాలామంది ప్రముఖుల ప్రశంసలను అందుకుంది.
మరి.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
సంజయ్ భార్గవ్(సంజయ్ స్వరూప్ ) కు విద్యా విధాన్ అనే విద్యాసంస్థలు ఉంటాయి. విద్యార్థులంతా ఎక్కువగా తన సంస్థలోనే చదవాలని ఆశ పడుతుంటాడు. ఎవరైనా సరే.. చదువు అంటే.. తన విద్యాసంస్థలోనే చదవాలి అనుకుంటాడు. దానికోసం ఏదైనా చేస్తాడు. విద్యార్థులతో ర్యాంకులు తెప్పించడం కోసం.. విద్యార్థుల మీద చాలా ప్రెజర్ పెడుతుంటాడు. ఈ టార్చర్ ను భరించలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు.
ఇంతలో.. అదే కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా అక్షర చేరుతుంది. అక్షర అంటే మన హీరోయిన్ నందిత శ్వేత. కాలేజీ బోర్డు మెంబర్ శ్రీతేజ.. అక్షర ను చూసి ఇష్టపడుతాడు.
అలాగే.. అక్షర ఉండే కాలనీలో ఉండే వాల్తేర్ కింగ్స్(షకలక శంకర్, మధు, సత్య)… ఈ ముగ్గురు కూడా అక్షరను ప్రేమిస్తుంటారు.
కట్ చేస్తే… ఒక రోజు అక్షరకు శ్రీతేజ ప్రపోజ్ చేస్తాడు. అదే సమయంలో.. శ్రీతేజను అక్షర కాల్చి చంపేస్తుంది. ఆ ఘటనను కళ్లారా చూసిన వాల్తేరు కింగ్స్ అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత అసలు.. అక్షర ఎవరు అనే నిజం ప్రేక్షకులకు తెలుస్తుంది? అసలు.. అక్షర.. శ్రీతేజను ఎందుకు చంపింది? అక్షర నిజంగానే ప్రొఫెసరా? కాదా? ఎందుకు విద్య విధాన్ కాలేజీలో అక్షర చేరింది? ఆ తర్వాత వాల్తేరు కింగ్స్ ఏమయ్యారు? అక్షర ఏం చేసింది? అనేదే మిగితా స్టోరీ.
ఈసినిమా ప్రధాన ఉద్దేశం.. ప్రస్తుత విద్యా విధానంలో ఉన్న లొసుగులు, లోపాలు, అక్రమాలను ఎత్తి చూపడం. ఒక విద్యా సంస్థ డబ్బుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులను ఎలా పీడిస్తుంది, దాని వల్ల ఎంతమంది విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు? అనే ప్రస్తుతం పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు. అలాగే.. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువు పేరుతో ఏం చేస్తున్నారు? ఎలా చదువు కోసం ఒత్తిడి తెస్తున్నారు.. అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా కాబట్టి… అటువంటి జానర్ వాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అందులోనూ ఇది ఒక సోషల్ మెసేజ్ ను జనాలకు ఇవ్వడం కోసం వచ్చిన సినిమా.
ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే.. హీరోయిన్ నందిత శ్వేత. తనే ఈ సినిమాకు బలం. తను లేకపోతే ఈ సినిమానే లేదు. తన ట్రెడిషనల్ లుక్ తో అదరగొట్టేసింది. ఈ సినిమాలో తను రెండు రకాల షేడ్స్ ను ప్రదర్శించింది. ఇక.. మిగితా నటులు షకలక శంకర్, సత్య, మధు.. ఈ ముగ్గురి కామెడీ కూడా ఓకే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయింది.
ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అసలు.. స్టోరీ ఒక లైన్ మీద అనుకొని రాసుకున్నా.. ఆ లైన్ ను తప్పి ఎక్కడికో వెళ్లిపోయింది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా బోరింగ్ గా ఉండటం, క్లయిమాక్స్ అంతగా తీర్చిదిద్దకపోవడంతో… కథనంలో ఏమాత్రం కూడా ఆసక్తి లేకుండా పోయింది.
చివరకు చెప్పొచ్చేదేంటంటే.. దర్శకుడు మంచి కాన్సెప్ట్ నే ఎంచుకొని సినిమా తీసినా.. ఫార్మాట్ అనేది మాత్రం పాతదే. విద్యా విధానం మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఎన్నో సినిమాలు వచ్చినా.. అదే కాన్సెప్ట్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. అందరికీ టచ్ అయ్యే పాయింట్ ను పట్టుకున్నా.. దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ కాస్త బెనికారు. దాని వల్ల సినిమా ఔట్ పుట్ మొత్తం మారిపోయింది.
ఏది ఏమైనా.. ప్రస్తుత విద్యా విధానంలో ఎలాంటి లొసుగులు ఉన్నాయి. ఎలా విద్యార్థులను ర్యాంకుల పేరుతో టార్చర్ పెడుతున్నారు. విద్యార్థులకు ర్యాంకులు ముఖ్యమా? లేక మంచి భవిష్యత్తు ముఖ్యమా? అనే విషయాల గురించి తెలియాలంటే మాత్రం ఈ సినిమాను చూడొచ్చు. అది కూడా క్రైమ్ ఇష్టపడే వాళ్లు ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 2/5
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.