allu arjun pushpa movie first review
Pushpa Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజులుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప. కరోనా లాక్ డౌన్ అనంతరం వస్తున్న భారీ చిత్రం ఇదే కావడం… అల్లు అర్జున్ కు తెలుగు తో పాటు సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో క్రేజ్ ఉండటం సినిమాకి హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు టీజర్ లల్లో సినిమా కథల బయట పడకుండా దర్శకుడు సుకుమార్ ఎంతగానో ట్రై చేశాడు. కానీ ఆయన ప్రయత్నాలను వమ్ము చేస్తూ.. సినిమా రిలీజ్ కు ఓ రోజు ముందే కథ అంతా బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీ లైన్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రముఖ సినీ విశ్లేషకుడు, దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు.. సినిమా చూసిన వెంటనే సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. పుష్ప ఫస్టాఫ్ రేసీ అండ్ టెర్రిఫిక్‌గా ఉంటుందని.. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్‌తో అల్లు అర్జున్ అదరగొట్టేశాడని అంటున్నాడు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఊరమాస్‌గా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారని.. నేషనల్ అవార్డ్ ఖాయం అనేశారు. హీరోయిన్ రష్మిక అద్భుతంగా నటించిందన్న ఉమైర్… సామ్ పాట ఓ రేంజ్ లో ఉందంటూ ఆకాశానికి ఎత్తేశారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సుకుమార్ దర్శకత్వం ఓ రేంజ్‌లో ఉందని ప్రశంసలు కురిపించారు. చిత్రానికి 4స్టార్లు రేటింగ్ ఇచ్చారు.
allu arjun pushpa movie first review
అయితే ఉమర్ సంధు తరచూ సినిమా విడుదలకు ముందే రివ్యూలను పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటాడు. గతంలో అజ్ఞాతవాసి, కాటమరాయుడు, సాహో, స్పైడర్, సినిమాలకు కూడా రిలీజ్ కు ముందే బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రివ్యూలు ఇచ్చాడు. అయితే ఆయా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కా బోర్లా పడ్డాయి. మరి ఇతగాడు పుష్ఫ సినిమాకి ఏకంగా నాలుగు స్టార్లు వేసేశాడు.. కనీసం ఇదైనా నిజం అవుతుందా లేక ఆ మూవీలా జాబితాలో చేరుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం రేపు ఏడు భాషల్లో రిలీజ్ అవుతోంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.