Home » Devotional » Chanakya Follow There Chankya Words You Will Become Rich Easily
Devotional

Chanakya Niti : చాణక్య నీతి ఈ మాటలు ఫాలో అయితే మీకు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం..

Authored By
mallesh
The Telugu News | Published on: December 16, 2021, 10:20 am
Advertisement

Chanakya Niti : ఆచార్య చాణక్యుడిగా గురంచి దాదాపుగా అందరికీ తెలిసి ఉంటుంది. భారతీయ గొప్ప అధ్యాపకుడిగా ఆయన్ను ప్రతీ ఒక్కరు గుర్తుపెట్టుకోవడమే కాదు ఆయన చెప్పిన విషయాలను పాటించాల్సి ఉంటుంది. రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థిక నిపుణుడిగా, జీవిత తత్వశాస్త్రవేత్తగా చాణక్యుడికి మంచి పేరుంది. తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేసిన చాణక్యుడు రాసిన గ్రంథాల్లో ప్రసిద్ధమైనది ‘చాణక్య నీతి’ గ్రంథం. ఈ గ్రంథం ప్రకారం.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటే..ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రానికి సంబంధించిన విషయాలనే కాదు..మానవ జీవితానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని స్పృశించాడు.

Advertisement

చాణక్య నీతి గ్రంథం ఒకసారి చదివితే ఆ విషయాలన్నీ అవగతమవుతాయని పెద్దలు చెప్తున్నారు కూడా. ఇకపోతే చాణక్య నీతి ప్రకారం.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటే ఈ విషయాలు కంపల్సరీగా పాటించాలి. ప్రతీ ఒక్కరు తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీ దేవిని ఆహ్వానించాలనుకునేవారు అయితే కంపల్సరీగా శుభ్రతకు ప్రయారిటీ ఇవ్వాలి. అయితే, ఇల్లుతో పాటు మనుషులూ శుభ్రంగా ఉండాలి. ఇకపోతే ఎవరికైనా హాని తలపెట్టాలనుకునుపుడు అందుకు డబ్బును అస్సలు ఉపయోగించొద్దు. తన ఇన్ కమ్ నుంచి కొంత పేదలకు దానం చేయాలి. అంతే తప్ప ఇతరులకు హాని చేయొద్దు. మీరు మీ డబ్బులతో ఇతరులకు ఇబ్బందులు పెట్టేందుకు ప్లాన్ చేసినట్లయితే మీ వద్దకు లక్ష్మీదేవి రాదు.

chanakya follow there chankya words you will become rich easily

Advertisement

Chanakya Niti : జీవితంలోని అన్ని అంశాలనూ ప్రస్తావించిన చాణక్యుడు..

చాలా మంది ఏదేని తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, అలా చేయడం చాలా తప్పు. అలా మోసం, తప్పుడు పనులు చేసి సంపాదించిన డబ్బు మీతో అస్సలు ఉండబోదు. ఆ డబ్బు వచ్చిన తర్వాత మీ ఇల్లు ఇంకా నాశనమవుతుంది కూడా. అందుకే కష్టపడి మాత్రమే డబ్బు సంపాదించాలి. ఇతరులకు మేలు చేసేందుకు డబ్బును ఉపయోగించాలి తప్ప కీడు చేసేందుకు కాదు. ఇక డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా అస్సలు ఖర్చు పెట్టొద్దు. మీ దగ్గర డబ్బు ఎంత ఉన్నా వృథాగా అస్సలు ఖర్చు చేయకూడదు. అలా చేస్తే మీ వద్ద లక్ష్మీదేవి అస్సలు ఉండబోదు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి