Anchor Pradeep 30 Rojjulo Preminchatam Ela Movie Review : 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? రివ్యూ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Pradeep 30 Rojjulo Preminchatam Ela Movie Review : 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? రివ్యూ

 Authored By jagadesh | The Telugu News | Updated on :29 January 2021,5:30 pm

30 Rojjulo Preminchatam Ela Movie Review

సినిమా పేరు : 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ?

నటీనటులు : ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, పోసాని కృష్ణమురళి, హర్ష, భద్రమ్

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : మున్నా

ప్రొడ్యూసర్ : ఎస్వీ బాబు

రిలీజ్ డేట్ : 29 జనవరి, 2021

దితెలుగున్యూస్ రేటింగ్ : రివ్యూ చివర్లో చూడండి..

ప్రదీప్ మాచిరాజు.. అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ.. యాంకర్ ప్రదీప్ అనగానే మాత్రం టక్కున గుర్తొస్తాడు ప్రదీప్. తెలుగు బుల్లితెర మీద టాప్ మోస్ట్ యాంకర్. బుల్లితెర మీద ఎంతో బిజీగా ఉండే యాంకర్ ప్రదీప్.. తొలిసారిగా హీరోగా చేసిన ప్రయత్నమే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? నిజానికి ఈ సినిమా గత సంవత్సరమే రిలీజ్ కావాల్సింది కానీ.. కరోనా వల్ల ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఇవాళ విడుదలైంది.

Anchor pradeep 30 rojullo preminchadam ela movie review

Anchor pradeep 30 rojullo preminchadam ela movie review

యాంకర్ ప్రదీప్ తొలిసారి హీరోగా నటిస్తున్నాడు అంటే ఏదో మామూలు.. గీమూలు కథను ఎంచుకోలేదు. రావడం రావడమే యాంకర్ ప్రదీప్ ఇచ్చిపడేశాడు. బీభత్సమైన కథతో వెండి తెర మీదికి ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్. మొదటిసారే రొమాంటిక్ జానర్ ఎంచుకొని.. తమిళ్ హీరోయిన్ అమృత అయ్యర్ తో కలిసి ఆడిపాడాడు ప్రదీప్. ఇక… ఈసినిమాకు యాంకర్ ప్రదీప్ వల్ల కంటే కూడా.. నీలి నీలి ఆకాశం అనే పాట వల్లనే ఎక్కువ క్రేజ్ వచ్చింది. యాంకర్ ప్రదీప్ కన్నా.. నీలి నీలి ఆకాశం పాట ప్రేక్షకులను థియేటర్ వరకు తీసుకెళ్తుంది. మరి.. ఆ తర్వాత ఓ రెండున్నర గంటలు ప్రదీప్ థియేటర్ లో ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలిగాడా? అంటే మనం ముందు ఈ సినిమా కథ గురించి తెలుసుకోవాల్సిందే.

30 Rojullo Preminchatam Ela కథ ఇదే

ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. కథ ప్రారంభమే 1947 లో ఉంటుంది. 1947 లో ప్రేమించుకున్న ఓ జంట.. కొన్ని కారణాల వల్ల విడిపోయి చనిపోతారు. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ ఈ కాలంలో పుడతారు. వాళ్లే అర్జున్, అక్షర. అర్జున్ అంటే మన హీరో ప్రదీప్.. అక్షర అంటే మన హీరోయిన్ అమృత అయ్యర్. కానీ.. వీళ్లకు ముందే తెలియదు.. వీళ్లిద్దరు గత జన్మలో ప్రేమికులని. వీళ్లిద్దరూ అనుకోకుండా ఒకే కాలేజీలో చేరడం.. తర్వాత ఇద్దరి మధ్య వైరం పెరగడం… చివరకు ఇద్దరూ వెళ్లిన ఓ టెంపుల్ దగ్గర ఇద్దరూ గత జన్మలో ప్రేమికులని తెలుస్తుంది?

Anchor pradeep 30 rojullo preminchadam ela movie review

Anchor pradeep 30 rojullo preminchadam ela movie review

గత జన్మలో కూడా అదే గుడి దగ్గరికి వీళ్లు వెళ్లడంతో.. ఇప్పుడు అక్కడికి వెళ్లగానే గత జన్మ మెమోరీస్ వాళ్లకు గుర్తొస్తాయి. ఆ తర్వాత ఇద్దరి జీవితాలు తారుమారవుతాయి? ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇద్దరూ మళ్లీ ప్రేమించుకుంటారా? ఇద్దరి ప్రేమ బలపడుతుందా? గత జన్మకు సంబంధించిన మెమోరీస్ తో ఒక్కటవుతారా? లేదా? అనేదే ఈ సినిమా మిగితా కథ.

ప్లస్ పాయింట్స్

సినిమాకు ప్లస్ పాయింట్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా పాటలు. సినిమాలో నీలి నీలి ఆకాశంతో పాటు మరో పాట కూడా బాగానే ఉంటుంది. మ్యూజిక్ అంటే ఇష్టమున్నవాళ్లు, పాటలు నచ్చేవాళ్లకు ఈ సినిమా సూపర్ డూపర్ గా నచ్చుతుంది.

ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టే సినిమాకు హైలెట్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఎమోషన్స్ అద్భుతం. అవే సినిమాకు బలంగా నిలిచాయి. మొదటి సారే తన స్టామినాకు మించిన సబ్జెక్ట్ ను తన భుజాల మీదేసుకున్నాడు ప్రదీప్. తన నటన సూపర్బ్. ఇప్పటికే పలు సినిమాల్లో నటించడం, బుల్లితెర మీద యాంకర్ గా చేయడం వల్ల.. మొదటి సినిమా అయినప్పటికీ.. ప్రదీప్ బాగానే నటించాడు. హీరోయిన్ గా అమృత అయ్యర్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది.

మైనస్ పాయింట్స్

సినిమాలో ప్లస్ పాయింట్స్ తో పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఫుల్లు బోర్. ఫస్ట్ హాఫ్ లో కాస్తో కూస్తో వినోదం ఉన్నా.. సెకండ్ హాఫ్ లో మాత్రం బోరింగ్ సీన్సే ఎక్కువ. సినిమా లెంత్ కూడా ఎక్కువయింది.

anchor pradeep 30 rojullo preminchadam ela telugu movie review

anchor pradeep 30 rojullo preminchadam ela telugu movie review

ఎడిటర్ ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఇక.. ఈ సినిమాకు అందరూ ఊహించిన రొటీన్ కథతో దర్శకుడు సినిమాను తీయడంతో ప్రేక్షకులు పెద్దగా థ్రిల్ ఫీలయ్యే అంశాలైతే ఏమీ లేవు.

కన్ క్లూజన్

చివరగా సినిమా కన్ క్లూజన్ ఏంటంటే? పాటలంటే మాకు ప్రాణం అంటారా? అయితే ఈ సినిమాకు మీలాంటి వాళ్లు ఖచ్చితంగా వెళ్లొచ్చు. మాకు పునర్జన్మల మీద నమ్మకం ఉంది. అలాంటి లవ్ స్టోరీలు అంటే మాకు ప్రాణం అంటారా? అటువంటి వాళ్లు కూడా నిర్మొహమాటంగా సినిమాకు వెళ్లొచ్చు. కాలేజీ కుర్రాళ్లు, యూత్ కు కూడా సినిమా కనెక్ట్ అవుతుంది. అంతకు మించి ఇక చెప్పడానికి ఏం లేదు.

దితెలుగున్యూస్ రేటింగ్ : 2.5/5

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది