Avatar 2 Movie Review : అవతార్ 2 సినిమా, Avatar 2 Movie, ప్రపంచ వ్యాప్తంగా ఈనెల అంటే డిసెంబర్ 16 న గ్రాండ్ గా విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలై సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అవతార్ కు సీక్వెల్ గా వచ్చింది. అవతార్ సినిమా రిలీజ్ అయి ఎన్నో సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సినిమాను మించి అవతార్ 2,Avatar 2, ను తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో బుక్కయ్యాయి. దాదాపు 4500 థియేటర్లలో ఈ సినిమా విడుదల ఇవాళ విడుదలయింది.
ఇప్పటికే దాదాపు 12 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగానే కాదు.. భారత్ లోనూ ఈ సినిమా రికార్డులు సృష్టించింది. హైదరాబాద్ లో ఈ సినిమా 3.1 కోట్ల వసూలు చేసింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై,Bangalore, Mumbai, Delhi, Chennai, లాంటి సిటీలలో అడ్వాన్స్ బుకింగ్స్ లో అవతార్ రికార్డు సాధించింది. దేశం మొత్తం మీద సుమారు 12 కోట్ల రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ మీదనే వచ్చాయి. అవతార్.. ది వే ఆఫ్ వాటర్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాను ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు.
ప్రపంచ వ్యాప్తంగా లండన్, న్యూయార్క్ లాంటి నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. బాలీవుడ్,Bollywood, సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను తిలకించారు. బాలీవుడ్ ప్రముఖులు అయితే అవతార్ 2 సినిమా గురించి ప్రశంసలు కురిపించారు. సినిమా పేరు : అవతార్ 2 నటీనటులు : సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగుర్ని వీవర్, కేట్ విన్సెలెట్, స్టెఫాన్ లాంగ్, క్లిఫ్ కర్టీస్, జో డేవిడ్ మూర్ తదితరులు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టోరీ : జేమ్స్ కామెరూన్, James Cameron, కో ప్రొడ్యూసర్ : జాన్ లాడవు, మ్యూజిక్ డైరెక్టర్ : సైమాన్ ఫ్రాగ్లెన్,
బ్యానర్ : టీఎస్జీ ఎంటర్ టైన్ మెంట్, లైఫ్ స్ట్రామ్ ఎంటర్ టైన్ మెంట్, రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2022, ఈ సినిమాను 3డీ గ్లాసెస్ లో చూడొచ్చు. అత్యంత సోఫిస్టికేటెడ్ సాంకేతికతను ఉపయోగించి ఈ సినిమాను రూపొందించారు. ప్రత్యేకంగా బార్కోలేజర్ 3డీ గ్లాసెస్ ను ఉపయోగించి ప్రసాద్ ఐమాక్స్ లో చూడొచ్చు. ప్రపంచలోనే అతి పొడవైన, పెద్ద ఐమాక్స్ తెరపై బార్కోలేజర్ 3డీ గ్లాసెస్ ఉపయోగించి చూడొచ్చు. మొత్తానికి సినీ లవర్స్ ను ఒక ఊహా లోకానికి అవతార్ 2 సినిమా తీసుకెళ్లిందని అంటున్నారు.మరి.. ఈ సినిమా నిజంగానే ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
అవతార్ 2 సినిమా చూడాలనుకునే వారు ముందు అవతార్ 1 సినిమాను చూడాలి. లేదంటే కొంచెం కన్ప్యూజ్ అవుతారు. అది ఒక విజువల్ వండర్ మూవీ. పండోరా గ్రహానికి వెళ్లిన జేక్ సల్లీ అనే వ్యక్తి మనుషులు ఆ గ్రహం వ్యక్తులకు చేస్తున్న అన్యాయాన్ని చూస్తాడు. వాళ్లు తన సొంత మనుషులు అయినప్పటికీ వాళ్లపై ఎదురు తిరుగుతాడు. అలాగే.. పండోరా గ్రహంలో ఉన్న ఓ తెగకు నాయకుడి కూతురు నేతిరిని చూసి జేక్ ఇష్టపడతాడు. ఆ తర్వాత జేక్ ను తన ప్రాంతమంతా తిప్పి చూపిస్తుంది నేతిరి. తన సంప్రదాయలు, అక్కడి వాసుల గురించి చెబుతుంది. దీంతో అవతార్ వన్ సినిమా మొదటి పార్ట్ పూర్తవుతుంది.
ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి తెగకు నాయకుడు అవుతాడు జేక్. వాళ్లకు పిల్లలు కూడా పుడతారు. వాళ్లతో కలిసి కొందరు పిల్లలు జీవిస్తూ ఉంటారు. అయితే.. పండోరాను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు మైల్స్ క్వారిచ్. అతడి కొడుకు స్పైడర్.. జేక్ దగ్గరే ఉంటాడు. అతడిని భూలోకానికి పంపించేందుకు జేక్ తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ.. అది సాధ్యం కాదు. మరోవైపు పండోరాను నాశనం చేయడానికి భూలోకం నుంచి మరికొందరు వస్తారు. దీంతో జేక్ వాళ్లతో పోరాడుతాడు. క్వారిచ్ పండోరా గ్రహం మీద అడుగుపెట్టి అందరినీ నాశనం చేయాలని చూస్తాడు. జేక్ దగ్గర పెరుగుతున్న స్పైడర్ ను ఎత్తుకెళ్లాలని అనుకుంటాడు. కానీ.. తర్వాత ఆ స్పైడరే తన కొడుకు అనే నిజం క్వారిచ్ కు తెలుస్తుంది. ఆ తర్వాత క్వారిచ్ ను జేక్ అంతమొందిస్తాడా? స్పైడర్ ఏం చేస్తాడు? చివరకు ఏం జరుగుతుంది? అనేదే మిగితా కథ.
ఈ సినిమా నిడివి కాస్త పెద్దగానే ఉంటుంది. దాదాపు 3 గంటల 12 నిమిషాలు ఉంటుంది ఈ సినిమా నిడివి. కానీ.. అదో వింత లోకం కావడంతో మూడు గంటలు కూడా మూడు క్షణాల్లా అనిపిస్తాయి. అందరూ ఆ వింత లోకంలో విహరిస్తారు. విజువల్ వండర్ కు మంత్రముగ్దులవుతారు. మొత్తానికి సినిమా రిచ్ లుక్ తో అద్భుతమైన వీఎఫ్ఎక్స్ తో అందరినీ అలరిస్తుంది. పిల్లలకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. గ్రాఫిక్స్, కొత్త గ్రహం పేరుతో రూపొందించిన వీఎఫ్ఎక్స్ అన్నీ బాగుంటాయి. పోరాట సన్నివేశాలు కూడా అదరగొట్టేశాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదుర్స్ అని చెప్పుకోవచ్చు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 3.25/5
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.