Chaavu kaburu challaga Review : కార్తికేయ చావు కబురు చల్లగా సినిమా రివ్యూ
Chaavu kaburu challaga Review : ఆర్ ఎక్స్ 100 సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎన్నడూ మరిచిపోరు. అలాగే సినిమాలో నటించిన హీరో హీరోయిన్లను కూడా మరిచిపోరు. ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే రికార్డులను బద్దలు కొట్టింది. కొత్త రకం కథతో ట్రెండ్ సృష్టించింది. ముఖ్యంగా ఆ సినిమాలో నటించిన హీరో కార్తికేయకు నూటికి నూరు మార్కులు పడ్డాయి. అంతకుముందు ఒకటి రెండు సినిమాల్లో నటించినా.. రాని గుర్తింపు.. కార్తికేయకు ఆర్ఎక్స్ 100 సినిమాతో ఫుల్ గా వచ్చేసింది. దీంతో వెంటనే స్టార్ హీరో అయిపోయాడు కార్తికేయ. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు తీశాడు.
తాజాగా.. చావు కబురు చల్లగా అనే కొత్త టైటిల్ తో మన ముందుకు వచ్చాడు కార్తికేయ. మరి.. ఆర్ ఎక్స్ 100 తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కార్తికేయ ఈ సినిమాతో మెప్పించాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
Chaavu kaburu challaga Review : కథ
ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా ఎంచుకోని కథ ఇది. చనిపోయిన వాళ్లను స్మశానానికి తీసుకెళ్లే వాహనం డ్రైవరే మన హీరో కార్తికేయ. ఆయన పేరు బస్తీ బాలరాజు. అలా చనిపోయిన వందల మంది మృతదేహాలను తన వాహనంలో తరలిస్తూ.. అలా జాలీగా తన జీవితాన్ని గడిపేస్తుంటాడు బాలరాజు. తన డ్యూటీలో భాగంగా ఓరోజు చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లడానికి ఓ ఇంటికి వెళ్తాడు. అక్కడ చనిపోయింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి(మల్లిక) భర్త పీటర్. అక్కడే మల్లికను చూసి మనసు పారేసుకుంటాడు బాలరాజు. అప్పటి నుంచి.. ఇక తన వెంట పడుతూ.. ప్రేమించమంటూ బతిమాలుతుంటాడు. తను ఓ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుంటుంది.
అయితే.. తనకు పెళ్లయి భర్త చనిపోయాక కూడా తన వెంట పడుతూ వేధిస్తుండటంతో.. తట్టుకోలేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది మల్లిక.
కట్ చేస్తే.. బాలరాజు తల్లి ఆమని పాత్రలో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా బాలరాజు జీవితం మారిపోతుంది. ముందు ఛీ కొట్టినా.. బాలరాజులో వచ్చిన మార్పును చూసి.. మల్లిక కూడా ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత కథలో మరో ట్విస్ట్. అసలు ఆమని ఎవరు? మల్లికకు తర్వాత ఏమైంది? మల్లికను పెళ్లి చేసుకోవడానికి.. బాలరాజు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి.. అనేదే మిగితా కథ.
Chaavu kaburu challaga Review : విశ్లేషణ
ఇక.. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే.. ముందు కార్తికేయ గురించి మాట్లాడాలి. చాలా ఈజ్ తో బాలరాజు క్యారెక్టర్ లో దూరిపోయాడు కార్తికేయ. మాస్ పాత్రలో నటించి.. తన యాసతో అదరగొట్టేశాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా అంతే. తన పాత్రలో ఒదిగిపోయింది. కానీ.. ఈ సారి తను గ్లామర్ పాత్రలో కనిపించలేదు. డీ గ్లామర్ లుక్ తో కనిపించినా.. అదుర్స్ అనిపించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే.. ఇద్దరూ అదరగొట్టేశారు. హీరో, హీరోయిన్ తర్వాత చెప్పుకోవాల్సిన పాత్ర సీనియర్ నటి ఆమనిది. తను లేకపోతే ఈ సినిమానే లేదు. తన వల్లే ఈ కథకు ప్రాణం వస్తుంది. అలాగే.. మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి వాళ్ల పాత్రలు కూడా బాగానే మెప్పించాయి.
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ : ప్లస్ పాయింట్స్
ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే హీరో, హీరోయిన్ అనే చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం వీళ్లే ఎక్కువగా ఉండటమే కాదు.. ఇద్దరూ సినిమాను సమానంగా భుజాల మీద మోశారు. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా సాగుతుంది. సినిమాలో డైలాగ్స్ కూడా అదిరిపోయాయి.
Chaavu kaburu challaga : మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ… సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది. కామెడీ కూడా సినిమాలో అంతగా లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అంతగా ఎమోషన్ అయ్యేంత కనెక్టివిటీ లేదు. నెరేషన్ కూడా స్లోగా ఉంది.
Chaavu kaburu challaga : కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే.. ప్రస్తుతం థియేటర్లలో రెండు మూడు సినిమాలు ఉన్నప్పటికీ.. కార్తికేయ కోసం.. లావణ్య కోసం సినిమా చూడాలనుకుంటే చూడొచ్చు. సరికొత్త కథ కాబట్టి.. కొత్తదనం కోరుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. మాస్ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు. కానీ.. సెకండాఫ్ వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే చాన్సెస్ ఉన్నాయి. ఏదో టైమ్ పాస్ కు సినిమాను చూడాలి అనుకుంటే మాత్రం వెళ్లి ఓసారి చూసి రావచ్చు. అది కూడా ఫస్ట్ హాఫ్ ఓకే కానీ.. సెకండాఫ్ కు కాస్త ఇబ్బంది పడాల్సిందే.
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.5 /5