Anasuya : లంగా ఓణిలో మాస్ లుక్కుతో అదరగొట్టిన అనసూయ.. కార్తికేయ మూవీలో మాస్ డ్యాన్స్
Anasuya : సూయ.. సూయ.. సూయ.. సూయ.. సూయ.. ఇంతందగా ఎట్టా పుట్టేశావే అనసూయ.. అంటూ పాటపాడినా.. అనసూయ అందాన్ని ఎంత వర్ణించినా తక్కువే. చీర కట్టినా.. లంగా ఓణీ కట్టినా.. డ్రెస్ వేసుకున్నా… అనసూయ అందం ముందు అందరూ దిగదుడుపే.

Anchor anasuya to perform mass dance in kartikeya movie chaavu kaburu challaga
అనసూయ జబర్దస్త్ లోనే కాదు.. సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో నటించి కూడా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ.. సినిమాల్లోనూ ఐటెమ్ సాంగ్స్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పటికే పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు వేసి అదరగొట్టిన అను పాప.. మరోసారి మాస్ లుక్కులో లంగా ఓణీలో డ్యాన్స్ వేసేందుకు సిద్ధమవుతోంది.
Anasuya : కార్తికేయ చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ మాస్ డ్యాన్స్
ఆర్ ఎక్స్ 100 సినిమాతో తన సత్తా ఏంటో చాటిన హీరో కార్తికేయ. కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం చావు కబురు చల్లగా. ఈ సినిమాలో కార్తికేయతో కలిసి అనసూయ ఆడిపాడనుంది. డప్పు పట్టుకొని దరువేస్తూ.. లంగాఓణీలో మాస్ లుక్కుతో ఐటెమ్ సాంగ్ లో డ్యాన్స్ చేసేందుకు అనసూయ సిద్ధమైపోయింది.
అనసూయ.. ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ లో నటిస్తోందంటూ.. అనసూయకు చెందిన రెండు ఫోటోలను షేర్ చేసి మరీ.. చిత్రబృందం కన్ఫమ్ చేసింది.
పెళ్లిలో జరిగే సంగీత్ తరహాలో ఉండే ఓ ఐటెమ్ సాంగ్ లో అనసూయ నటించనుందట. ఫోటోలో మాత్రం మాస్ లుక్ ఇచ్చి.. డప్పు పట్టుకొని అను దరువేస్తూ కనిపించింది.
కార్తికేయ చావు కబురు చల్లగా సినిమాను కౌశిక్ డైరెక్ట్ చేస్తుండగా… కార్తికేయ సరసన.. లావణ్య త్రిపాఠీ నటిస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తుండగా… జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.