Gandeevadhari Arjuna Movie Review : గాండీవధారి అర్జున మూవీ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gandeevadhari Arjuna Movie Review : గాండీవధారి అర్జున మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Gandeevadhari Arjuna Movie Review : సినిమా పేరే విచిత్రంగా ఉంది కదా. గాండీవధారి అర్జున అనే పేరు అర్థం చాలామందికి తెలియదు కానీ.. ఆ సినిమా చూస్తేనే అసలు ఆ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం అవుతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో ఎంతో కొంత సోషల్ మెసేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ తీసిన సినిమాలు చూస్తే అదే అనిపిస్తుంది. గాండీవధారి అర్జున […]

 Authored By gatla | The Telugu News | Updated on :24 August 2023,10:30 pm

Gandeevadhari Arjuna Movie Review : సినిమా పేరే విచిత్రంగా ఉంది కదా. గాండీవధారి అర్జున అనే పేరు అర్థం చాలామందికి తెలియదు కానీ.. ఆ సినిమా చూస్తేనే అసలు ఆ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం అవుతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో ఎంతో కొంత సోషల్ మెసేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ తీసిన సినిమాలు చూస్తే అదే అనిపిస్తుంది. గాండీవధారి అర్జున సినిమా కూడా అదే తరహాలో రూపొందిన మూవీ. ఇది ఒక యాక్షన్, త్రిల్లర్ అండ్ ఎంటర్ టైనర్ మూవీ. ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. మన చుట్టూ ఇంత జరుగుతున్నా ఈ చిన్న విషయాన్ని మనం ఎందుకు మరిచిపోయాం. మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం అని ఈ సినిమా చూశాక అనుకుంటాం. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా సోషల్ ఎక్స్‌పరిమెంట్ అనే చెప్పుకోవాలి.

ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా.. బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. సాక్షీ వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. పీఎస్వీ గరుడవేగ, ఘోస్ట్ సినిమాల తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న మరో యాక్షన్ త్రిల్లర్ ఇది. ఇక.. ఏజెంట్ మూవీలో హీరోయిన్ గా నటించిన సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్స్ అదిరిపోయాయి. సినిమా టీజర్, ట్రైలర్ చూస్తేనే యాక్షన్ సీక్వెన్స్ లతో నిండి ఉండటంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ కూడా మొత్తం విదేశాల్లో జరగడం గమనార్హం. ఎక్కువగా లండన్ లో జరిగింది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ మూవీ. ఈ సినిమా బడ్జెట్ రూ.70 కోట్లు.

Gaandeevadhari Arjuna Movie first review rating in telugu

Gaandeevadhari Arjuna Movie first review rating in telugu

Gandeevadhari Arjuna Movie Review సినిమా పేరు: గాండీవధారి అర్జున

నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షి వైద్య

దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

నిర్మాత : బీవీఎన్ఎస్ ప్రసాద్

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జే మేయర్

సినిమా నిడివి : 2 గంటల 16 నిమిషాలు

విడుదల తేదీ : 25 ఆగస్టు 2023

Gandeevadhari Arjuna Movie Review : సినిమా కథ

ఈ సినిమాలో వరుణ్ తేజ్.. అర్జున్ వర్మ అనే పాత్రలో నటించారు. ఈ సినిమా ఒక మెడికల్ మాఫియాకు సంబంధించింది. మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ట్రీట్ మెంట్ పేరుతో మాఫియాకు ఎలా తెర లేపారు. లక్ష కోట్ల వ్యాపారంగా ఎలా మారింది. మన చుట్టు ఆసుపత్రుల్లో ఇంత పెద్ద మాఫియా జరుగుతున్నా మనం తెలుసుకోలేకపోయాం అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా వస్తోంది. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి అయిన ఆచార్య(నాజర్) ను కొంతమంది చంపాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్లు చేసే మెడికల్ స్కాం వల్ల మనుషులకే కాదు.. పర్యావరణం కూడా దెబ్బ తింటుందని ఆయన తెలుసుకుంటారు. దీంతో వాళ్లను ఆపడం కోసం రా ఏజెంట్ అర్జున్ ను ఈ పని చేయాలని అప్పగిస్తాడు.ఈ మెడికల్ మాఫియాను విదేశాల్లో ఉంటూ నడిపిస్తున్న వాళ్లను వరుణ్ తేజ్.. ఎలా ఆటకట్టించాడు. అసలు ఆ మెడికల్ మాఫియాకు, పర్యావరణానికి ఏంటి సంబంధం అనేదే ఈ సినిమా కథ.

Gaandeevadhari Arjuna Movie Review : విశ్లేషణ

ఇది ఒక స్పై అండ్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవాలి. సినిమా స్టార్టింగే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో సినిమా అంతా ఆసక్తిగా సాగుతుంది. సినిమాల్లో ట్విస్టులు చాలా ఉంటాయి. ఆ ట్విస్టులతోనే సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సినిమా మొత్తాన్ని వరుణ్ తేజ్ తన భుజాల మీద మోశాడు అనే చెప్పుకోవాలి. అర్జున్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాలో నటించిన అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్

యాక్షన్

ట్విస్టులు

స్టోరీ

వరుణ్ తేజ్ నటన

మైనస్ పాయింట్స్

నో ఎమోషన్స్

నో ఎంగేజ్

దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75/5

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది