Game Changer Review : గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Game Changer Review : గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Game Changer Review : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ Shankar కాంబోలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాను Dil raju దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందించారు. కియరా అద్వాని Kiara Advani హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. గేమ్ ఛేంజర్ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ ఈమధ్య అసలేమాత్రం సక్సెస్ ట్రాక్ లో లేడు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఇండియన్ 2 కూడా ఫ్లాప్ అయ్యింది. ఐతే గేమ్ ఛేంజర్ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు శంకర్. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ప్లస్ అయ్యేలా ఉంది. సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కాగా బిజిఎం కూడా అదిరిపోతుందని అంటున్నారు.
Game Changer Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ
RRR తో పాన్ ఇండియా హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆచార్య అంటూ మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. ఇక లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ తో సోలోగా వస్తున్నాడు. ఈ సినిమా లో చరణ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ ఎనర్జీ అదిరిపోతుందని అంటున్నారు.సినిమా బడ్జెట్ విషయంలో దిల్ రాజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కేవలం సాంగ్స్ కోసమే ఏకంగా 75 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ కియరా అద్వానిల రొమాన్స్ కూడా సినీమకు ప్లస్ అవుతుందని అంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా భారీ ఇంపాక్ట్ కలిగించేలా ఉంది.
నటీనటులు : రామ్ చరణ్, కియరా అద్వాని, ఎస్ జె సూర్య, శీకాంత్, సునీల్, అంజలి తదితరులు
సంగీతం : ఎస్.థమన్
సినిమాటోగ్రఫీ : ఎస్ తిరు
కథ : కార్తీక్ సుబ్బరాజ్
డైరెక్షన్ : ఎస్ శంకర్
నిర్మాత : దిల్ రాజు
రిలీజ్ డేట్ : జనారి 10, 2025
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా పై మెగా ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. సినిమాలో అన్ని యాస్పెక్ట్స్ అదిరిపోతాయని అంటున్నారు. శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ తో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అదిరిపోతుందని అంటున్నారు.సంక్రాంతికి వస్తున్న మొదటి సినిమాగా గేమ్ ఛేంజర్ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఐతే మరోపక్క సక్సెస్ ఫాం లో లేని శంకర్ ఈ సినిమా ఎలా తీశాడో అన్న టెన్షన్ కూడా ఉంది. సినిమాకు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా భారీ హైప్ ఏర్పడగా అందుకు తగినట్టుగా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. మరి సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ ఉంటుంది కాబట్టి గేమ్ ఛేంజర్ ఎలా ఉందో పూర్తి గేమ్ ఛేంజర్ రివ్యూ..
Game Changer Review గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందించారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
Game Changer Review : కథ :
ఐ.ఏ.ఎస్ ఆఫీస్ అయిన రామ్ నందన్ (రామ్ చరణ్) నిజాయితీగా తన పనిచేసుకుంటూ వెళ్తుంటాడు. ఐతే సీఎం బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) ఏడాదిలో ఎన్నికలు కావడంతో ఈ ఏడాది ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఆదేశిస్తాడు. ఐతే అది సత్యమూర్తి పెంపుడు కొడుకు మోపీదేవి (ఎస్.జె సూర్య) కి నచ్చదు. అందుకే అతని చావు కోసం ఎదురుచూస్తాడు. సత్యమూర్తికి తెలియకుండా అవినీతి, అక్రమాల్ చేస్తుంతడు. ఐతే మోపీదేవి అక్రమాలకు రాం నందన్ అడ్డు తగులుతాడు. ఐతే ఈ క్రమంలో తండ్రి చివరి కోరికకు సంబందించిన వీడియొ మోపీదేవికి షాక్ ఇస్తుంది. అతని వల్ల రామ్ నందన్ సస్పెండ్ ఔతాడు. ఇంతకీ రాం నందన్ సతమూర్తి రిలేషన్ ఏంటి.? రామ్ నందన్ కి తండ్రి అప్పన్న ఎలాంటి లక్ష్యం పెట్టాడు..? పార్వతి పాత్ర గతం ఏంటి..? రామ్ నందన్ మోపీదేవి ని ఎలా అడ్డుకున్నాడు..? అన్నది గేమ్ ఛేంజర్ కథ.
Game Changer Review : కథనం :
శంకర్ సినిమాలు ఎంత కమర్షియల్ గా ఉంటాయో అంతే సోషల్ కాజ్ కూడా ఉంటుంది. ఒక నిజాయితీ కథతో తన సినిమాలో హీరో పాత్ర ని డిజైన్ చేస్తాడు శంకర్. ఐతే కొన్నాళ్లుగా అసలేమాత్రం ఫాం లో లేని శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాతో తిరిగి ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. సినిమా ఓపెనింగ్ నుంచి శంకర్ ఆన్ డ్యూటీ ఎక్కేశాడు.
ఐతే గేమ్ ఛేంజర్ కథ కొత్త కథేమి కాదు.. కానీ స్క్రీన్ ప్లే శంకర్ మార్క్ గ్రాండియర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్ గానే సాగుతుంది. ఐతే సెకండ్ హాఫ్ మీద డిపెండ్ అవగా సెకండ్ హాఫ్ పూర్తిగా సాటిస్ఫై చేస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన అప్పన్న రోల్ అయితే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు.
ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న, పార్వతి పాత్రలు చాలా నిజాయితీగా ప్రేక్షకులను ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. పాత్రలో చరణ్ కూడా అదరగొట్టాడు. విజువల్స్ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు కూడా హైలెట్ గా ఉన్నాయి. సినిమా కన్నుల విందుగా ఉంటుంది. ఐతే సినిమాలో టెక్నికల్ ఇష్యూస్ వల్ల నానా హైరానా సాంగ్ ని కట్ చేశారు. ఆ పాట కూడా ఉంటే బాగుండేది.
ఓవరాల్ గా శంకర్ మార్క్ సినిమా కోరే ఆడియన్స్ కు చాలా కాలం తర్వాత ఆయన సినిమా ఎలాంటి విజువల్ గ్రాండియర్ గా ఉంటుందో చూపించారు. శంకర్, రామ్ చరణ్ కాంబో పై ఉన్న అంచనాలను ఈ సినిమా అందుకుంది. సంక్రాంతికి పర్ఫెక్ట్ మాస్ బొమ్మగా గేమ్ ఛేంజర్ అదరగొట్టేసింది. మెగా ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా ఫీస్ట్ అందిస్తుంది.
Game Changer Review : నటన & సాంకేతిక వర్గం :
రామ్ నందన్, అప్పన్న రెండు పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టాడు. అప్పన్న పాత్ర అయితే మరోసారి రంగస్థలం చిట్టి బాబుని గుర్తు చేస్తుంది. రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు. కియరా అద్వాని కేవలం గ్లామర్ కే వాడుకున్నారు. అంజలి పాత్ర ఇంప్రెస్ చేస్తుంది. ఆమె కూడా బాగా చేసింది. ఎస్ జె సూర్య విలనిజం బాగుంది. శ్రీకాంత్ యాక్టింగ్ ఆకట్టుకుంది. సునీల్ కామెడీ వర్క్ అవుట్ కాలేదు. మిగతా పాత్రలన్నీ బాగానే అలరించాయి.
టెక్నికల్ టీం విషయానికి వస్తే తిరు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. థమన్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. శంకర్ డైరెక్షన్ లో మరోసారి తన స్ట్రాంగ్ నెస్ చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి.
ప్లస్ పాయింట్స్ :
రామ్ చరణ్
థమన్ మ్యూజిక్
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
కామెడీ సరిగా లేకపోవడం
ఫస్ట్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా రాసుకుంటే బాగుండేది
బాటం లైన్ : గేమ్ సంక్రాంతికి పర్ఫెక్ట్ మాస్ బొమ్మ..!
రేటింగ్ : 3/5