Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బిజినెస్ లెక్కలివే.. ఎంత తెస్తే హిట్టు అవుతుందో తెలుసా..?
ప్రధానాంశాలు:
Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బిజినెస్ లెక్కలివే.. ఎంత తెస్తే హిట్టు అవుతుందో తెలుసా..?
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan Game Changer శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్ . ఈ సినిమాను దిల్ రాజు 300 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచగా శుక్రవారం సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయిందని తెలుస్తుంది . సినిమా వరల్డ్ వైడ్ గా 220 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే సినిమా 100 కోట్ల పైగా బిజినెస్ జరిగింది. నైజాం లో దిల్ రాజు ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నారు .
Game Changer మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు..
గేమ్ ఛేంజర్ సినిమా శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ విత్ పొలిటికల్ యాక్షన్ సినిమాగా వస్తుంది. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంచినట్టు తెలుస్తుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇలా ఉంటే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో బజ్ కూడా బాగానే ఉంది. RRR తర్వాత రామ్ చరణ్ నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేస్తున్న సినిమాగా గేం ఛేంజర్ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.
శంకర్ కూడా ఇండియన్ 2 ఫ్లాప్ తో డీలా పడగా మరోసారి ఆయన డైరెక్షన్ స్టామినా ఏంటన్నది చూపించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సినిమా అంచనాలకు తగినట్టు ఉంటే మాత్రం తప్పకుండా పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. సినిమాలో రామ్ చరణ్ డ్యుయల్ రోల్ లో నటించాడు. అంజలి కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆన్ లైన్ కన్నా గేమ్ చేంజర్ సినిమాకు ఆఫ్ లైన్ మెగా ఫ్యాన్స్ బజ్ బాగుంది. సినిమా ఫస్ట్ డే నుంచే రికార్డుల వేట మొదలు పెడుతుందని తెలుస్తుంది. Ram Charan, Game Changer, Game Changer Business, Game Changer Worldwide Business, Shankar, Dil Raju