God Father Movie Review : మెగాస్టార్ చిరంజీవి, Chiranjeevi, నయనతార, Nayanthara, సల్మాన్ ఖాన్, Salman Khan, సత్యదేవ్, Satya dev, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్, నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ పాధర్. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. సైరా నరసింహారెడ్డి, ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. నిజానికి ఆచార్య సినిమా డిజాస్టర్ అవడంతో మెగా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే.. గాడ్ ఫాదర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి భారీ అంచనాలతో ఈసారి మెగా ఫ్యాన్స్ కు మంచి బహుమతి ఇవ్వనున్నారని అంతా భావిస్తున్నారు.
గాడ్ ఫాదర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కూడా ప్రదర్శితం అయ్యాయి. అయితే.. సెన్సార్ బోర్డు వాళ్ల ప్రకారం రివ్యూ ఇదే నంటూ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూపై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మలయాళం హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు ఇది రిమేక్ మూవీ. మలయాళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ.. గాడ్ ఫాదర్ మూవీ మాత్రం కేవలం యావరేజ్ మూవీ అని, ఇది బీ, సీ ఆడియెన్స్ కు మాత్రమే నచ్చుతుందని క్రిటిక్ ఉమైర్ సంధు తెలిపాడు. ఇది కొత్త సీసాలో పాత సారా అంటూ ట్వీట్ చేశాడు. మెగా ఫ్యాన్స్ ఎవ్వరూ ఉమైర్ సంధు ట్వీట్ ను పట్టించుకోలేదు.
సినిమా పేరు : గాడ్ ఫాదర్
నటీనటులు : చిరంజీవి, నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్
డైరెక్టర్ : మోహన్ రాజా
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
సినిమా విడుదల తేదీ : అక్టోబర్ 5, 2022
మలయాళంలో లూసిఫర్ సినిమాలో హీరోగా మోహన్ లాల్ నటించిన విషయం తెలిసిందే. తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో నిర్మించారు. ఈ సినిమాకు ఎన్వీ ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. తెలుగుతో పాటు ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. ఇక.. సత్యదేవ్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. నయనతార ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించింది.
ఈ సినిమా 157 నిమిషాల నిడివితో ఉంటుంది. అంటే రెండు గంటలా 37 నిమిషాలు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా నటించాడు. ఆయన పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి బ్రహ్మ అనే పాత్రలో నటించాడు. సెకండాఫ్ నుంచి సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఉంటుంది. ఒక పొలిటికల్ గాడ్ ఫాదర్(పీకేఆర్) మరణం తర్వాత ఆయన స్థానాన్ని దక్కించుకోవాలని చాలామంది చూస్తుంటారు. పన్నాగాలు పన్నుతుంటారు. అయితే.. ఆ గాడ్ ఫాదర్ వారసత్వం గురించి ప్రశ్న వచ్చినప్పుడు ఆయనకు ఇష్టమైన బ్రహ్మ, మరికొన్ని పేర్లు బయటికి వస్తాయి. గాడ్ ఫాదర్ కూతురు సత్యప్రియ(నయనతార).. బ్రహ్మ పట్ల అసంతృప్తితో ఉంటుంది. దానికి కారణం.. బ్రహ్మను పొలిటికల్ వారసుడిగా ప్రకటించడం. సత్యప్రియ బ్రహ్మను ఎందుకు ద్వేషిస్తోంది? సత్యప్రియకు వారసత్వాన్ని ఇచ్చాడా? ఆమె కుటుంబంలో ఉన్న సమస్యలను బ్రహ్మ ఎలా తీర్చాడు? జైదేవ్ ఎవరు? జైదేవ్ కు, సత్యప్రియకు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ విషయానికి వస్తే.. గాడ్ ఫాదర్ మూవీ ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా. ఇక.. చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నటన గురించి ఇప్పుడు మాట్లాడుకునేది ఏం ఉండదు. ఆయన అద్భుతంగా నటించారు. అయితే.. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా కథలో కొన్ని మార్పులు చేశారు. ఇక.. సినిమాలో చిరంజీవి చెప్పే కొన్ని డైలాగ్స్ అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను ప్రతిబింబిస్తాయి. సినిమా దర్శకత్వం, టేకింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అదిరిపోయాయి. చిరంజీవితో కలిసి యాక్షన్ సీన్స్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ అద్భుతంగా చేశాడు.
దసరా పండుగ సందర్భంగా చిరంజీవి తన అభిమానులకు మంచి విందు భోజనం అందించారు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆచార్య డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ ఈ సినిమా చేసి మంచి పనే చేశారు. మళ్లీ ఫామ్ లోకి వచ్చి తనేంటో నిరూపించుకున్నారు.
రాజకీయ సన్నివేశాలు
చిరంజీవి యాక్టింగ్
నయనతార యాక్టింగ్
సత్యదేవ్ యాక్టింగ్
సినిమాటోగ్రఫీ
డైరెక్షన్
సెకండ్ హాఫ్ లో కొన్ని డల్ సన్నివేశాలు
ఇక చివరగా చెప్పొచ్చేదేంటంటే గాడ్ ఫాదర్ మూవీని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అందరూ ఇంటిల్లి పాది దసరా రోజున వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసి రావచ్చు. మెగాస్టార్ ఈసారి ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 3/5
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.