
KotaBommali PS Movie Review : శ్రీకాంత్ కోట బొమ్మాళి పీఎస్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
KotaBommali PS Movie Review : కోట బొమ్మాళి పీఎస్ మూవీ హీరో శ్రీకాంత్ Srikanth కు తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. గత రెండు మూడు దశాబ్దాల నుంచి శ్రీకాంత్ తెలుగు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటి వరకు హీరోగా కొన్ని వందల సినిమాల్లో నటించారు. ఇప్పటికీ ఆయనకు తెలుగు ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఆయనకు ఫ్యామిలీ హీరో అనే గుర్తింపు ఉంది. తన సినిమా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఆయన జోరు ఏమాత్రం తగ్గలేదు. కథల ఎంపికలో హీరో శ్రీకాంత్ చాలా వైవిధ్యంగా ఉంటారు. అందుకే ఆయన ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. ఆయన తాజాగా హీరోగా నటించిన మూవీ కోట బొమ్మాళి పీఎస్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 24న అంటే ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకు తేజ మార్ని డైరెక్టర్. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. ఇక.. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ Shivani Rajashekar ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈనేపథ్యంలో అసలు సినిమా కథ ఏంటి.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఈ సినిమాలో శ్రీకాంత్ Srikanth పేరు రామకృష్ణ. ఆయన ఒక హెడ్ కానిస్టేబుల్. పొలిటికల్ లీడర్స్.. పోలీసులను ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేదే ఈ సినిమా కథ అని చెప్పుకోవచ్చు. అలాగే.. పోలీసులే ఈ సినిమాలో మరికొందరు పోలీసులకు విలన్లు అవుతారు. అంటే.. పోలీస్ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఈ సినిమా స్పష్టంగా చూపిస్తుందని అని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ సినిమా కథను మలయాళం సినిమా నయట్టు నుంచి తీసి రాసుకున్నారు. కాకపోతే కొన్ని మార్పులు చేశారు. ఈ సినిమాలో పోలీసులే పోలీసులను చేజ్ చేస్తుంటారు. అంటే ఈ సినిమాలో పోలీసులే హీరో.. పోలీసులే విలన్. ప్రత్యేకంగా హీరో.. ప్రత్యేకంగా విలన్.. ప్రత్యేకంగా హీరోయిన్ అంటూ ఎవ్వరూ ఉండరు. ఒకరకంగా చెప్పలంటే.. కథే హీరో అని చెప్పుకోవచ్చు.
ఈ సినిమాలో కానిస్టేబుళ్లుగా నటించిన శ్రీకాంత్(రామకృష్ణ), రాహుల్ విజయ్ Rahul VIjay (రవి).. ఇద్దరూ కొందరు రాజకీయ నాయకుల చేతుల్లో ఎలా కీలుబొమ్మలుగా మారారు అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో శివానీ Sivani పాత్ర కూడా చాలా కీలకం. తను ఈ సినిమాలో కుమారి పాత్రలో నటించింది. అలాగే… వరలక్ష్మీ శరత్ కుమార్ Varalaxmi Sarathkumar, మురళీ శర్మ పాత్రలు కూడా చాలా ముఖ్యమైనవి. కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ చుట్టూనే ఈ సినిమా కథ నడుస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ లో ఉండే పోలీసులు రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో ఉండాల్సి వస్తుంది. వాళ్ల చేతుల్లో అణచివేయబడతారు. అంతే కాదు.. వాళ్లు చేయని తప్పుకు బలైపోతారు. వాళ్లు చేయని తప్పుకు వేరే పోలీసుల కంట పడకుండా వెళ్లి అండర్ గ్రౌండ్ లో దాక్కోవాల్సి వస్తుంది. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఈ ముగ్గురు పోలీసులు.. ఇతర పోలీసుల నుంచి తప్పించుకొని అండర్ గ్రౌండ్ కు వెళ్తారు. ఇతర పోలీసుల నుంచి వీళ్లు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ల నుంచి తప్పించుకోవడం కోసం ఏం చేశారు? అనేదే ఈ సినిమా కథ. అయితే.. ఈ ముగ్గురినీ పట్టుకోవడం కోసం మరో పోలీస్ ఆఫీసర్ వరలక్ష్మీ శరత్ కుమార్ రంగంలోకి దిగుతుంది. వాళ్లను ఛేజ్ చేస్తుంటుంది. ఇలా.. సినిమా మొత్తం పోలీసులే పోలీసులను ఛేజ్ చేస్తూ ఉంటారు.
ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం అదుర్స్ అని చెప్పుకోవాలి. సరిగ్గా ఎన్నికలకు వారం ముందు ఈ సినిమాను కావాలని మూవీ యూనిట్ విడుదల చేస్తోంది. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఓటు వేసే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఓటు వేయాలని మూవీ డైరెక్టర్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అంటేనే చాలామందికి చులకన. కానీ.. ఈ సమాజం కోసం వాళ్లు ఎంతో కష్టపడతారు. ప్రాణాలను ఫణంగా పెడతారు. కానీ.. కొందరు రాజకీయ నాయకుల వల్ల పోలీసుల మీద ఉండే మంచి అభిప్రాయం కూడా పోతోంది. అందుకే.. అసలు పోలీసులు నిజాయితీగా ఉన్నా.. ఉండాలని అనుకున్నా వాళ్లను కొందరు పొలిటిషియన్స్ తమ చేతుల్లో కీలుబొమ్మల్లా చేసుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ప్రాణం. ఇక.. కానిస్టేబుళ్లుగా నటించిన శ్రీకాంత్, రాహుల్, శివానీ మాత్రం అదరగొట్టేశారు. వీళ్లను పట్టుకునే పోలీసుగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అద్భుతంగా నటించింది.
సినిమాకు మ్యూజిక్ ప్రాణం. రంజన్ రాజ్ మ్యూజిక్ అదరగొట్టేసింది. బీజీఎం కూడా చాలా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అదుర్స్ అనిపించాయి. కొన్ని సీన్లు బోర్ కొడతాయి తప్పితే సినిమా ఆద్యంతం ఆసక్తితో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్భుతం అని చెప్పుకోవాలి.
ప్లస్ పాయింట్స్
లింగి లింగి లింగిడి సాంగ్
శ్రీకాంత్, రాహుల్, శివానీ యాక్టింగ్
స్టోరీ
మైనస్ పాయింట్స్
బోరింగ్ సీన్స్
కొన్ని లాజిక్ కు అందని సీన్స్
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.