Lawrence Jigarthanda 2 Movie Review : జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lawrence Jigarthanda 2 Movie Review : జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Lawrence Jigarthanda 2 Movie Review : జిగర్తాండా డబుల్ ఎక్స్ అనే మూవీ గురించి మాట్లాడుకోవడానికి ముందు మనం కార్తీక్ సుబ్బరాజు గురించి మాట్లాడుకోవాలి. ఇంతకీ ఎవరు ఈయన అంటారా? ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఈయనే. కార్తీక్ ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవాలి. ఒక పిజ్జా, ఒక జిగర్తాండా సినిమాలు అయితే తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగులోనే జిగర్తాండా పార్ట్ […]

 Authored By gatla | The Telugu News | Updated on :10 November 2023,11:15 am

ప్రధానాంశాలు:

  •  రాఘవ లారెన్స్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా?

  •  జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీ ఎలా ఉంది?

  •  కార్తీక్ సుబ్బరాజు మరోసారి హిట్ కొట్టాడా?

Cast & Crew

  • Hero : రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య
  • Heroine : నిమిషా సజయన్
  • Cast : షైన్ టామ్ చాకో, నవీన్ చంద్ర
  • Director : కార్తీక్ సుబ్బరాజ్
  • Producer : కార్తికేయన్
  • Music : సంతోష్ నారాయణన్
  • Cinematography :

Lawrence Jigarthanda 2 Movie Review : జిగర్తాండా డబుల్ ఎక్స్ అనే మూవీ గురించి మాట్లాడుకోవడానికి ముందు మనం కార్తీక్ సుబ్బరాజు గురించి మాట్లాడుకోవాలి. ఇంతకీ ఎవరు ఈయన అంటారా? ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఈయనే. కార్తీక్ ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవాలి. ఒక పిజ్జా, ఒక జిగర్తాండా సినిమాలు అయితే తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగులోనే జిగర్తాండా పార్ట్ వన్ సినిమాను గద్దలకొండ గణేష్ పేరుతో హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. తాజాగా జిగర్తాండా సినిమాకు సీక్వెల్ గా జిగర్తాండా డబుల్ ఎక్స్ పేరుతో కార్తీక్ సుబ్బరాజు మరో సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య హీరోలుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 10న తమిళం, తెలుగులో విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోలు కూడా వేశారు. ఈ సినిమాకు చివరి 40 నిమిషాలు హైలెట్ అంటూ ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ ట్వీట్ చేయడం విశేషం. హీరో ధనుష్ మెచ్చుకున్నాడు అంటే ఇక ఈ సినిమా సూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. ఇక.. ఈ సినిమాలో నటించిన రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ఇరగదీశారనే చెప్పుకోవాలి. పేరుకు తగ్గట్టుగా ఈ సినిమా డబుల్ ఎక్స్ అయిందా? జిగర్తాండాకు సీక్వెల్ గా ఈ సినిమాను ఎందుకు తీశారు. ఈ సినిమా కథ ఏంటి? అసలు ఈ సినిమాలో ఇద్దరు హీరోలను ఎందుకు పెట్టారు.. అనేది తెలియాలంటే ఈ సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Lawrence Jigarthanda 2 Movie Review : సినిమా కథ

ఎస్సై కావాలని అనుకుంటాడు. కానీ.. తనకు ఉన్న భయంతో ఓ హత్యా నేరంలో ఇరుక్కుంటాడు. జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటాడు ఎస్‌జే సూర్య(కృప). ఇక.. అలియాస్ సీజర్(రాఘవ లారెన్స్).. కర్నూలు నగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అక్కడి రాజకీయ నాయకుల అండదండలు అతడికి ఉంటాయి. ఓ హీరో వల్ల అసలు గొడవ మొదలు అవుతుంది. రాజకీయాలు, సినిమాలు రెండు రంగాల్లో రాణించిన హీరో జయకృష్ణ. అయితే.. సినిమా థియేటర్ల విషయమై మరో నేతతో గొడవ పడతాడు. దీంతో ఆ నేతకు చెందిన కీలక రౌడీలను చంపేందుకు జయకృష్ణ.. తన తమ్ముడిని రంగంలోకి దించుతాడు. అందులో నలుగురిని సెలెక్ట్ చేస్తారు. ఆ నలుగురిలో కృప పేరు కూడా వస్తుంది. సీజర్ ను చంపాలని కృపకు చెబుతారు. దీంతో సీజర్ దగ్గరికి వెళ్తాడు కృప. అసలు కృప ఎందుకు వచ్చాడు. సీజర్ ను చంపడానికే అనే విషయం కృపకు తెలిసిందా? అసలు ఏం జరిగింది.. చివరకు సీజర్ సినిమా తీయాలని ఎందుకు అనుకుంటాడు. దానికి కృప దర్శకత్వం వహిస్తాడా? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగితా కథ.

Lawrence Jigarthanda 2 Movie Review : విశ్లేషణ

ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే సినిమా సూపర్ హిట్ అని ధనుష్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రాఘవ లారెన్స్ నటన. ఆయన జీవించేశాడు. స్క్రీన్ ప్లే కూడా అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక.. ఈ సినిమాలో చివరి 40 నిమిషాలు పిచ్చెక్కిస్తుంది అని అంటున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని అంటున్నారు. లారెన్స్ ఇంట్రడక్షన్ ఫైట్ చాలా భారీగా ఉంది. తన క్యారెక్టర్ ఎంట్రీ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ కూడా బాగుంటుంది. ఫస్టాఫ్ అదిరిపోతుంది. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇక సెకండాఫ్ లో సీజర్ అడవికి వెళ్తాడు. అక్కడ విలన్ తో ఫైట్ చేయడం బాగుంటుంది. ఆ తర్వాత వాళ్ల సమస్యల గురించి తెలుసుకోవడం ఇవన్నీ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

ప్లస్ పాయింట్స్

సెకండ్ హాఫ్

లాస్ట్ 40 నిమిషాలు

స్క్రీన్ ప్లే

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

దారి తప్పిన కథనం

Rating :

2.5/5

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది