Liger Movie Review : లైగ‌ర్ మూవీ ఫస్ట్ రివ్యూ… !

Advertisement
Advertisement

Liger Movie Review : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే ప్రధాన పాత్ర‌ల‌లో పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిచిన చిత్రం లైగ‌ర్. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త పంథాలో సినిమాల‌ను తెర‌కెక్కించే విజ‌య్ దేవ‌రకొండ ఇప్పుడు అదే ట్రాక్ లో లైగర్ అంటూ మరో ప్రయోగాత్మక సినిమాను రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలే సమయం ఉండగా.. ఈ మూవీ గురించి టాక్ న‌డుస్తూనే ఉంది.ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ఎప్పటిలాగే లైగర్ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, నటీనటులు, విజయ్ దేవరకొండ యాక్టింగ్ తదితర అంశాలపై సింపుల్ గా ఓ నాలుగు లైన్లతో రివ్యూ ఇచ్చారు.

Advertisement

Liger Movie Review : లైగ‌ర్ పీక్స్..

ఈ సినిమా విజయ్ దేవరకొండ వన్ మెన్ షో అని చెప్పి జనానికి మరింత కిక్కిచ్చాడు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ సర్‌ప్రైజ్ ప్యాకేజీ చూస్తామని చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే కళ్ళు చెదిరే యాక్షన్ స్టంట్స్, అదిరిపోయే డైరెక్షన్ చూస్తామని అన్నారు. ఇక కథ, స్క్రీన్ ప్లే యావరేజ్‌గా అయితే యావరేజ్ అంటూ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫస్ట్ రివ్యూ చూసి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. దీంతో తమ హీరో వన్ మెన్ షో చూడాలనే ఆతృత ఇంకాస్త పెరిగింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాటు చేశాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు లైగర్ టీమ్.

Advertisement

Liger Movie Review And Live Updates

ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు. ‘గాడ్ ఫాదర్’సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కూడా కలిశారు లైగర్ టీమ్. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి లైగర్ టీమ్ కు విషెస్‌ తెలుపుతూ.. మీలాగే ఇండస్ట్రీ కూడా దీన్ని ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది! నాకౌట్ పంచ్ ఇవ్వండి! అంటూ ట్వీట్ చేశారు. మెగాస్టార్ విషెస్ తెలుపడంతో చిత్రయూనిట్ ఆనందం లో తేలిపోతున్నారు. ముంబైలో ఓ విలేఖ‌రి.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కాస్త ఇరుకున పెడ‌దామ‌ని అనుకున్నాడో ఏమో కానీ లైగ‌ర్ సినిమా ప్లాప్ అయితే మీ పరిస్థితేంటి? అని ప్ర‌శ్నించాడు.

దాంతో చుట్టు ఉన్న‌వారంద‌రూ కాస్త టెన్ష‌న్ ప‌డ్డారు. విజ‌య్ ఎలాంటి రియాక్ట్ అవుతాడోన‌ని భావించారు. కానీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ రియాక్ట్ అయిన తీరు అక్క‌డున్న వారిని షాక్ అయ్యేలా చేసింది. ప్ర‌శ్న విన్న రౌడీ బాయ్ కూల్‌గా స‌మాధానం ఇచ్చాడు. ‘‘మీరు వేసిన ప్రశ్న నాకు కోపం తెప్పించటం లేదు. ఒక‌ప్పుడు ఇదే ప్ర‌శ్న వేసుంటే కోపం వ‌చ్చుండేదేమో. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం దేశం మొత్తం తిరిగాను. అభిమానుల‌ను క‌లుసుకున్నాను. వారు చూపించిన ప్రేమాభిమానాల‌ను మ‌ర‌చిపోలేను. నాకు ప్రేక్ష‌కులు, అభిమానులు ముఖ్యం. వారి కోసం సినిమాలు చేస్తూనే ఉంటాను. వారి అభిమానాన్ని గెలుచుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాను’’ అన్నారు.

 

లైగర్ రివ్యూ.. మ‌ళ్లీ దెబ్బ‌కొట్టిందిగా…!

విజయ్‌ దేవరకొండ, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం `లైగర్‌`. పూరీ మార్క్ హీరో క్యారెక్టరైజేషన్‌కి, విజయ్‌ దేవరకొండ పర్‌ఫెక్ట్ సూట్ అయ్యే నేప‌థ్యంలో కాంబినేష‌న్ ప‌ట్టాలెక్కింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించడంతో మరింత స్పెషల్‌గా మారింది. పాన్‌ ఇండియా తరహాలో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాగా, క‌థ ఎలా ఉందో తెలుసుకుందాం.

క‌థ‌:

బాలామణి (రమ్య కృష్ణ) మరియు ఆమె కుమారుడు లైగర్ (విజయ్ దేవరకొండ) కరీంనగర్‌కు చెందినవారు . బ‌తుకు తెరువు కోసం ముంబైకి వ‌చ్చి చాయ్ వ్యాపారం చేస్తారు. అయితే త‌న కొడుకుని బాక్సింగ్ ఛాంపియన్ చేయాల‌ని బాలామ‌ణి అనుకుంటుంది. కాని డ‌బ్బులు చాలా అవ‌స‌ర‌ప‌డ‌తాయి. అయితే దాని గురించి స్ట్ర‌గుల్ అవుతున్న స‌మ‌యంలో లైగర్ తండ్రి గురించి ఒక నిజాన్ని బైటపెడుతుంది బాలామ‌ణి. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది, చివరికి లైగర్ ఫాదర్ ఎవరు? బాలామణి వెనుక కథ ఏమిటి? లిగర్ బాక్సర్ అవుతాడా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

తెలుగులో బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి, అయితే శ్రీహరి యొక్క భద్రాచలం, పవన్ కళ్యాణ్ యొక్క తమ్ముడు వంటి అద్భుతమైన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే లైగ‌ర్ కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. చిత్ర‌ కథ రెగ్యులర్ పూరి జగన్నాధ్ హీరోగా ప్రారంభమవుతుంది, ఒక యాక్షన్ సీక్వెన్స్, తరువాత కథ ముంబైకి మారుతుంది, అక్కడ బాలమణి మరియు లైగర్ మధ్య కొంత డ్రామాను చూస్తాము,

విజయ్‌ దేవరకొండ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్‌ బాగుంది, నటుడిగా తన బెస్ట్ ఇచ్చాడు, సినిమాలో అతను నత్తితో ఇబ్బంది పడటం అందరిని బాధిస్తుంది. అదే సమయంలో హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ చాలా దారుణంగా ఉంది. మొదటి భాగంలో కొన్ని ఎలివేషన్‌ సన్నివేశాలు బాగున్నాయి. అంతే త‌ప్ప పెద్ద‌గా మాట్లడుకోవ‌డానికి ఏమి లేదు.

బాలమణిగా రమ్యకృష్ణ చాలా అద్భుతంగా చేసింది, ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని అద్భుతంగా కుదిరాయి, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను తమ పాత్రల మేరకు బాగా చేసారు.ఇక ఈ సినిమాలో పూరి మార్క్ చూడవచ్చు కానీ అతని పాత సినిమాల మాదిరిగా అయితే ఉండదు .

సాంకేతికంగా లైగర్‌ అద్భుతంగా ఉంది ,ప్రతి ఫ్రేమ్‌లో నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగుంది మరియు సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను బాలీవుడ్‌కు చెందిన విభిన్న సంగీత దర్శకులు చేసారు మరియు అజీమ్ దయాని పర్యవేక్షించారు, పాటలు అంత గొప్పగా లేవు , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది మరియు మిగిలిన సాంకేతిక విభాగాలు తమ వంతు కృషి చేసారు.

చివ‌రిగా..: సినిమా కాస్త రొటీన్‌గానే సాగుతుంది. చెప్పుకోద‌గ్గ స‌న్నివేశాలు అయితే ఉండ‌వు. పాన్ ఇండియా సినిమా ఇలా అయితే ఉండ‌కూడ‌దు. విజ‌య్- పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా యాక్షన్ స్టంట్స్ ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

 

 

Advertisement

Recent Posts

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

58 mins ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

2 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

3 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

4 hours ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

4 hours ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

5 hours ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

6 hours ago

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

7 hours ago

This website uses cookies.