
Liger Movie Review and Rating in Telugu
Liger Movie Review : రిలీజ్ డేట్: 2021 ఆగస్టు 25… !
నటినటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, ఆలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను, అబ్దుల్ ఖదీర్ అమిన్, విష్ణు రెడ్డి తదితరులు.
డైరెక్టర్: పూరి జగన్నాథ్
నిర్మాతలు: కరణ్ జోహార్, ఛార్మి కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్, పూరి జగన్నాథ్
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ, తనిష్క్ బాఘ్చి
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా యూత్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న యువ కెరటం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా.. మాస్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైగర్’. ఛార్మి, హిందీ నిర్మాతలు కరణ్ జోహార్ .. అజయ్ మెహతాలతో కలిసి లైగర్ సినిమాను నిర్మించారు. కరణ్ జోహార్ ప్రొడక్షన్‌లోకి ఎంటర్ కావటంతో సినిమా రేంజ్ పెరిగింది.. మైక్ టైసన్ కీలక పాత్రలో నటించటం.. అనన్య పాండే హీరోయిన్‌గా కనిపించటం సినిమాపై భారీ అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం.
Liger Movie Review and Rating in Telugu
కరీంనగర్‌కి చెందిన ఓ కుర్రాడు.. అతని తల్లి చాయ్ బండిపై ఊరూరు తిరుగుతూ చాయ్ అమ్ముకుంటూ ఉంటారు. ఆ కుర్రాడు ఎలా ఎం.ఎం.ఎ ఫైట్‌లో పాల్గొన్నాడు. మన దేశ త్రివర్ణ పతాకాన్ని ఎలా ఎగరవేశాడు? అనేది సినిమా కథాంశం..తల్లి పాత్ర పోషించిన రమ్య కృష్ణ లైగర్ తండ్రి గురించి సీక్రెట్ బయటపెట్టగా, అక్కడ కథలో అస్సలు ట్విస్ట్ మొదలవుతుంది. మరి మైక్ టైసన్ , విజయ్ దేవరకొండకి ఉన్న సంబంధం ఏమిటి? విజయ్ తన డ్రీమ్ నెరవేర్చుకున్నాడా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్
విజయ్ దేవరకొండ నటన
మైనస్ పాయింట్స్ :
స్క్నీన్ ప్లే
బోరింగ్ సీన్స్
నిదానంగా సాగే సన్నివేశాలు
లైగర్‌గా విజయ్ చాలా అద్భుతంగా నటించాడు. అతని మేక్ ఓవర్ మనం అభినందించాలి, అనన్య పాండేకి నటనకు స్కోప్ లేదు, బాలమణిగా రమ్యకృష్ణ చాలా అద్భుతంగా చేసింది .మైక్ టైసన్‌ని పెద్దగా వాడుకోలేకపోయారు. రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను తమ పాత్రల మేరకు బాగా చేసారు.
దర్శకుడు రొటీన్ కథ అందించడంతో మూవీ తేలిపోయింది. మణిశర్మ అందించిన సంగీతం బాగా హైలైట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. మిగిలిన టెక్నీషియన్ విభాగాలు బాగా పని చేశాయి.నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
చివరిగా : పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదు. సినిమా చూసిన వారందరు థియేటర్ నుండి నిరాశతో బయటకు వస్తున్నారు. ఇంత టైం దొరికన కూడా పూరీ కథపై ప్రత్యేక దృష్టి పెట్టలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ మరొక ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నట్టే.
రేటింగ్ 2/5
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.