
Macherla Niyojakavargam Movie Review And Live Updates
Macherla Niyojakavargam Movie Review : యువ హీరో నితిన్ కొన్నాళ్లుగా మంచి సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో మాచర్ల నియోజకవర్గం సినిమాపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కృతి శెట్టి, కేథరిన్ కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుండగా, మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో రూ. 6 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) – రూ. 3 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ -రూ. 10 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 19 కోట్లు.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 1.20 కోట్లు.. ఓవర్సీస్ రూ. 1.20 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 21.20 కోట్లు జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 22కోట్లు రాబట్టాలి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే కలెక్టర్ రోల్‌లో నితిన్ నటించారు. ఈ సినిమా నైజాంలో 235 థియేటర్స్‌లో విడుదల కానుంది.
Macherla Niyojakavargam Movie Review And Live Updates
రాయలసీమలో 125, ఆంధ్రప్రదేశ్ -300, ఏపీ + తెలంగాణ 660, కర్ణాటకల + రెస్టాఫ్ భారత్ 80 థియేటర్స్+ ఓవర్సీస్‌లో 200 స్క్రీన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 940 థియేటర్స్‌లో విడుదలవుతోంది. ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా అంతా రాజకీయం చుట్టూనే తిరుగుతుంది. ఇందులో ఎన్నికల అధికారిగా నితిన్ నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. కృతి శెట్టి ఇందులో హీరోయిన్.
మాచర్ల నియోజకవర్గం రివ్యూ
హీరో నితిన్ హిట్ అందుకుని చాలా కాలమే అయింది. చివరిగా భీష్మ సినిమాతో హిట్టు అందుకున్న నితిన్ ఆ తర్వాత సరైన హిట్టు అందుకోలేదు. ప్రస్తుతం ఆయన మాచర్ల నియోజకవర్గం అనే సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ సిద్ధార్థ రెడ్డి అనే ఒక ఐఏఎస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నితిన్ సోదరి నిఖితారెడ్డి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటించారు. మూవీ కథ ఎలా ఉందో చూద్దాం..
కథ:
రాజకీయ పరిణామాల చుట్టూ చిత్రం తెరకెక్కుతుండగా, ఇందులో నితిన్ జిల్లా కలెక్టర్ పాత్రలో నటించాడు.రాజకీయ పరిణామాల చుట్టూ తిరిగే ఈ కథలో దుర్మార్గులైన రాజకీయ నాయకుల భరతం పట్టేందుకు గుంటూరుకు జిల్లా కలెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడు.అయితే అక్కడ కొన్ని ఏళ్ల పాటు ఎలక్షన్స్ జరగకపోవడంతో ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అక్కడి పరిస్థితులు గమనించి వాటిని చక్క దిద్దించి ఎన్నికలు జరిపిస్తాడు. అయితే అక్కడ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతాడు.ఇక ఆయనకు కృతి శెట్టితో పరిచయం ఎలా ఏర్పడుతుంది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
నితిన్ కలెక్టర్ పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు.తొలిసారి డిఫరెంట్ పాత్రతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక ఆయన సరసన నటించిన కృతి శెట్టి కూడా తన పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది.తన అందాలతో మతి పోగొట్టింది.ఇక వెన్నెల కిషోర్, మురళి శర్మ, రాజేంద్రప్రసాద్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయడమే మంచి కామెడీ తో ఆకట్టుకున్నారు.
ఈ సినిమాకు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి కొత్త డైరెక్టర్ గా పరిచయమైన కూడా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా సినిమాను అద్భుతంగా చూపించాడు.ప్రసాద్ మూరెళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంది.మహతి స్వర సాగర్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది.
విశ్లేషణ: ప్రస్తుత రాజకీయాలని బేస్ చేసుకొని దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించగా, మూవీ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది. నితిన్‌కి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినట్టే అని అంటున్నారు.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.