Mad Square Movie Review : మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Mad Square Movie Review : మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Mad Square Movie Review : మ్యాడ్ కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

Mad Square Movie Review : మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Mad Square Movie Review కథ :
ఇంజినీరింగ్ స్టడీస్ ముగించుకొన్న మనోజ్, అశోక్, దామోదర్ (నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్) తమకు నచ్చిన పని చేసుకొనే పనిలో ఉంటారు. అయితే ఫ్రెండ్ లడ్డూ అలియాస్ గణేష్ (విష్ణు) పెళ్లి చేసుకొంటున్నాడని తెలిసి ఆ పెళ్లికి వెళతారు. అయితే ఆ పెళ్లి ఆగిపోవడంతో అందరు గోవా వెళతారు. గోవాలోని మ్యూజియంలో గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఈ నలుగురు ఎలా ఇరుక్కుపోయారు? గోవాలో లడ్డూ తండ్రి (మురళీధర్ గౌడ్)ను భాయ్ (సునీల్) ఎందుకు కిడ్నాప్ చేశారు? గోవాలో కలిసిన లైలా ఎవరు? లైలా( ప్రియాంక జువాల్కర్) కోసం అందరూ ఎందుకు వెతికారు? అన్నది సినిమా చూస్తే అర్ధమవుతుంది.
నటీనటులు : నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్, విష్ణు ఓఐ తదితరులు
దర్శకుడు : కళ్యాణ్ శంకర్
నిర్మాతలు : హారిక సూర్యదేవర, సాయి సౌజన్య.
సంగీతం : భీమ్స్
సినిమాటోగ్రఫీ : షామ్ దత్,
ఎడిటర్ : నవీన్ నూలి
Mad Square Movie Review పర్‌ఫార్మెన్స్:
మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకొన్న తొలి చిత్ర దర్శకుడు కల్యాణ్ శంకర్.. తన మలిప్రయత్నంలో ఆ సినిమాకే సీక్వెల్ చేసి ప్రేక్షకులని మెప్పించాడు. చిన్న పాయింట్ తీసుకొని దాని చుట్టూ సన్నివేశాలని బాగానే అల్లారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే రెండున్నర గంటల వినోదాన్ని ఆస్వాదించవచ్చనే విషయాన్ని మ్యాడ్ స్క్వేర్ ద్వారా చెప్పడమే కాకుండా మెప్పించే ప్రయత్నం కూడా బాగా చేశారు.టెక్నీకల్ టీం లో భీమ్స్ మ్యూజిక్ బాగుంది. ఆయన మార్క్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక షామ్ దత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్, డైలాగ్స్ కూడా బాగున్నాయి.
ఇక డైలాగ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ముగ్గురితోపాటు లడ్డూ ఇరుగదీశారు. యాక్టర్లు తెర మీద కనిపించకుండా కేవలం క్యారెక్టర్లు బిహేవ్ చేశాయనే విధంగా వారు నటించారని చెప్పవచ్చు. సునీల్, శుభలేఖ సుధాకర్, మోనికా రెబ్బా జాన్ లాంటి క్యారెక్టర్లు స్పెషల్ ఎట్రాక్షన్. ఈ చిత్రంలో నటించిన ప్రతీ చిన్న ఆర్టిస్టు కూడా తమకు తోచిన విధంగా గుర్తుండిపోయేలా నటించారు.
Mad Square Movie Review ప్లస్ పాయింట్స్:
ఫన్ ఎలిమెంట్స్
సంతోష్ శోభన్ డీసెంట్ లుక్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
స్లోగా సాగే సన్నివేశాలు
సిల్లీ కామెడీ
విశ్లేషణ:
ఎక్కడా బోర్ కొట్టకుండా సన్నివేశాలు ఉండటం ఈ సినిమా ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలు లేకుండా.. యూత్ ఫుల్ కామెడీ మూవీని ఎంజాయ్ చేయాలనుకొనే వారికి ఈ వారం థియేటర్‌లో ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటింది. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ కూడా ఆస్వాదించే లాజిక్ లెస్ ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు.
రేటింగ్ 2.5/