Miss Shetty Mr Polishetty Movie Review : మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Miss Shetty Mr Polishetty Movie Review : జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. నవీన్ పొలిశెట్టి హీరో అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? అనుష్క శెట్టి. బాహుబలి తర్వాత అనుష్క నటించిన సినిమా ఇదే. అందులోనూ ఒక స్టార్ హీరోయిన్.. ఒక కుర్ర హీరోతో అది కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించిన హీరోతో నటించడం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అది కూడా వాళ్ల ఇంటి పేర్లతో మూవీ అనే సరికి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పాడ్డాయి. అందులోనూ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నవీన్ పొలిశెట్టి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఇక మామూలు అంచనాలు లేవు. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలై ఇప్పటికే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు కూడా పడ్డాయి.
నవీన్ పొలిశెట్టి ఇప్పటి వరకు నటించిన సినిమాలు రెండే. ఒకటి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఇంకోటి జాతిరత్నాలు. ఈ రెండు సినిమాలకే నవీన్ పొలిశెట్టి టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యాడు. అందుకే ఏకంగా తన మూడో సినిమాను అనుష్క శెట్టి హీరోయిన్ తో తీయడం అనేది మామూలు విషయం కాదు. మరి.. అనుష్క శెట్టి ఈ సినిమా ఒప్పుకుంది అంటే ఈ సినిమాలో సమ్ థింగ్ స్పెషల్ ఏదో ఉండాలి కదా. మరి ఆ సమ్ థింగ్ స్పెషల్ ఏంటో, సినిమా కథ ఏంటో తెలుసుకుందాం పదండి.
Miss Shetty Mr Polishetty Movie Review సినిమా పేరు : మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
నటీనటులు : నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమటం, సోనియా దీప్తి, తులసి తదితరులు
డైరెక్టర్ : పి. మహేష్ బాబు
నిర్మాత : వంశీ, ప్రమోద్
మ్యూజిక్ డైరెక్టర్ : రధన్, గోపీసుందర్
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
Miss Shetty Mr Polishetty Review : సినిమా కథ ఇదే
అన్విత(అనుష్క శెట్టి) చెఫ్ గా పని చేస్తుంటుంది. లండన్ లోనే తను బెస్ట్ చెఫ్. తన కెరీర్ లో సెటిల్ అయింది కానీ.. పెళ్లి మాత్రం చేసుకోలేదు. తన తల్లికి ఒకటే బాధ. తను ఎప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందో అని తెగ టెన్షన్ పడిపోతుంది. అన్విత పెళ్లి చేసుకోకపోవడానికి కారణం పెళ్లిపై తనకు మంచి అభిప్రాయం లేకపోవడం. అలాంటి అన్వితకు సిద్ధు(నవీన్ పొలిశెట్టి) పరిచయం అవుతాడు. సిద్ధు ఒక స్టాండప్ కమెడియన్. ఇక.. అన్విత తల్లి కొన్నాళ్లకు చనిపోతుంది. అయితే.. తను ఒంటరిగా ఫీల్ అవుతుండటంతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఒక తోడు కోసం డోనర్ ద్వారా పిల్లల్ని కనాలని అనుకుంటుంది అన్విత. ఆ డోనర్ ఎవరో తెలియని వాళ్లు ఎందుకు అని సిద్ధును సాయం కోరుతుంది. కానీ.. అప్పటికే సిద్ధు అన్వితను ప్రేమిస్తుంటాడు. కానీ.. ఆమె మాత్రం పెళ్లికి ఒప్పుకోదు. కానీ పిల్లలను కనడానికి మాత్రం ఓకే అని చెబుతుంది. కేవలం స్పెర్మ్ డోనర్ ద్వారానే సిద్ధు ద్వారా పిల్లలను కనాలని అనుకుంటుంది. అందుకే సిద్ధు ఒప్పుకుంటాడా? అన్విత కోరికను తీరుస్తాడా? అనేదే మిగితా కథ.
Miss Shetty Mr Polishetty Review : విశ్లేషణ
ఈ సినిమాకు హీరోహీరోయిన్లే బలం అని చెప్పుకోవాలి. నవీన్ పొలిశెట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. అది జాతిరత్నాలు సినిమాతోనే తెలిసిపోయింది. ఈ సినిమాలో కూడా కామెడీ మాత్రం అదరగొట్టేశాడు పొలిశెట్టి. ఇక.. అనుష్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె నటన మరిచిపోయి చాలా ఏళ్లు అయినా కూడా ఎంతో ఈజ్ తో నటించింది. అనుష్కకు ఈ సినిమా కమ్ బ్యాక్ అనే చెప్పుకోవాలి.
ఇక ఈ మూవీ క్లీన్ కామెడీ మూవీ అని చెప్పుకోవాలి. సినిమా మొత్తాన్ని నవీన్ పొలిశెట్టి తన భుజాల మీద మోశాడు అని చెప్పుకోవాలి. అనుష్క కొంచెం వయసు మీద పడినట్టుగా కనిపించినా స్క్రీన్ మీద అలాంటివి కనిపించకుండా ఉండేందుకు బాగా ట్రై చేశారు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఇది ఒక నార్మల్ ప్రేమ కథలాగానే కనిపిస్తుంది కానీ.. పెళ్లి అనే టాపిక్ వచ్చేసరికి డైవర్షన్ తీసుకొని కొత్త టాపిక్ వైపునకు వెళ్లాడు దర్శకుడు. అదే కథకు టర్నింగ్ పాయింట్ కావడంతో సినిమా మీద భారీగా అంచనాలు కూడా పెరిగాయి. ఇక ఈ సినిమాను ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైనర్ గా భావించవచ్చు.
ప్లస్ పాయింట్స్
కామెడీ
నవీన్ పొలిశెట్టి నటన
అనుష్క శెట్టి నటన
సెకండాఫ్ ఎమోషన్స్
మైనస్ పాయింట్స్
పాటలు
మ్యూజిక్
అనుష్క సీజీ
దితెలుగున్యూస్ రేటింగ్ : 3/5