Lakshya Movie Review : నాగశౌర్య లక్ష్య మూవీ రివ్యూ..!
Lakshya Movie Review టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ నటుడు నాగశౌర్య ఇటీవల వరుడు కావలెను సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడు. సినిమా సినిమాకీ వైవిద్యం కోరుకునే ఈ చాక్లెట్ బాయ్…. జిమ్ లో అహర్నిశలు శ్రమించి ఒక్క సారిగా 8 ప్యాక్ తో తెలుగు సినీ అభిమానులకు సర్ప్రజ్ ఇచ్చాడు. స్పోర్ట్స్ డ్రామ నేపథ్యంలో రొమాంటిక్ సినిమా ఫేం కేతిక శర్మ జంటగా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రల్లో శౌర్య నటించిన సినిమా లక్ష్య థియేటర్స్ లో నేడు విడుదల అయింది. క్రీడ నేపథ్యంలో ఇప్పటివరకు అరుదుగా వచ్చిన విలు విద్యకు సంబంధించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Lakshya Movie Review కథ ఏమిటంటే
హీరో పార్ధు (నాగ శౌర్య) తండ్రి వాసు (రవిప్రకాష్) ఆర్చరీ ప్లేయర్. వరల్డ్ ఛాంపియన్ కావాలనేది అతడి లక్ష్యం. అయితే ఆర్చరీ పోటీలకు వెళ్తుండగా… అనుకోకుండా ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. దీంతో వాసు కుమారుడు పార్ధు క్రీడారంగం లోకి అడుగు పెడతాడు. అక్కడినుంచి సినిమా మొదలవుతుంది. పార్ధు లో ఆట ఆడగలిగే సత్తాను గమనించిన అతని తాతయ్య రఘురామయ్య (సచిన్ ఖేడేకర్) పార్థును సపోర్ట్ చేస్తూ అతనికి అండగా నిలుస్తూ ఉంటారు. చిన్న నాటి నుంచే క్రీడలపై ఎనలేని ఆసక్తి ఉన్న పార్ధు.. అలా తన కలని నిజం చేసుకోవడం కోసం కురుక్షేత్ర అనే ఆర్చరీ అకాడమీలో చేరతాడు. పార్ధు ఎంతో కష్టపడి ఆడ రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అవుతాడు. ఈ క్రమంలోనే అతనికి హీరోయిన్ రితిక (కేతిక శర్మ) దగ్గరవుతుంది.
ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ ట్రయల్స్ కి సన్నద్ధం అయ్యే సమయంలో తాతయ్య మరణిస్తాడు. దానితో పాటు ఆయన లైఫ్ లో ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంటుంది. తెరపై ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు… పార్ధుని మళ్ళీ ఆర్చరీ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తారు. చివరికి పార్ధు కష్టాలను దాటుకొని వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఎలా గెలిచాడు..? అసలు జగపతి బాబు ఎవరు..? పార్ధు జీవితంలో రితికా (కేతికా శర్మ) పాత్ర ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Lakshya Movie Review చిత్రం : లక్ష్య
నటీ నటులు: నాగ శౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు.
సంగీతం : కాళ భైరవ
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
దర్శకత్వం: సంతోష్ జాగర్లమూడి
విడుదల తేది : 10-12-2021
ఎలా ఉందంటే
ఈ స్పోర్ట్ డ్రామా మూవీ అన్ని మూవీస్ కంటే చాలా భిన్నంగా ఉన్నా.. ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. స్పోర్ట్ డ్రామా అయినప్పటికీ కొన్ని మాస్ మసాలా ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు అలరించారు చిత్ర దర్శకుడు. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణంగా చెప్పవచ్చు. క్రీడల నేపథ్యంలో ఇప్పటివరకు క్రికెట్, కబడ్డీ, హాకీ, రబ్బీ వంటి మూవీస్ వచ్చాయి కాబట్టి ఈ మూవీ అభిమానులకు కాస్త కొత్తగా అనిపిస్తుంది.
Lakshya Movie Review ఎవరెలా చేశారంటే
నాగ శౌర్య ఆర్చరీ క్రీడాకారుడిగా చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. 8 ప్యాక్ కోసం ఆయన పడ్డ శ్రమంతా తెరపై మనకు కనిపిస్తుంది. మూవీ కోసం నాగ శౌర్య తనని తాను చాలా ట్రాన్స్‌ఫామ్ చేసుకున్నట్టు లక్ష్య మూవీ చూస్తే అర్థమవుతోంది. సెకండ్ హాఫ్ లో నాగ శౌర్య 8 ప్యాక్ తో అదరగొట్టాడు. జగపతి బాబు కోచ్ పాత్రలో నటించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. రొమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ అందం అభినయంతో మెప్పించింది.
ప్లస్ పాయింట్స్:
– నాగశౌర్య నటన
-ఎమోషనల్ సన్నివేశాలు
– నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
– మాస్ ఆడియన్స్ కు ఎక్కకపోవడం
– సన్నివేశాలు తేలిపోవడం
– ముందే అంచనా వేసే కొన్ని సీన్స్
రేటింగ్: 2.75