Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్..!
ప్రధానాంశాలు:
Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్..!
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇదే వరుసలో రవితేజ, నవీన్ పోలిశెట్టి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవడంతో పండగ సీజన్ మొత్తం సినిమా జాతరగా మారింది. అయితే ఈ పోటీ మధ్యలో ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తున్న సినిమా మాత్రం శర్వానంద్ 37వ చిత్రం ‘ నారీ నారీ నడుమ మురారి Nari Nari Naduma Murari Movie Review .
Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్..!
Nari Nari Naduma Murari Movie టికెట్ ధరలపై అనూహ్య నిర్ణయం
సాధారణంగా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే టికెట్ రేట్లు పెరగడం కామన్. పండగ పేరుతో అదనపు ఛార్జీలు, హై ప్రైస్‌లతో థియేటర్లకు వెళ్లాలంటేనే ప్రేక్షకులు వెనకాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ట్రెండ్‌కు భిన్నంగా శర్వానంద్ టీమ్ ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేవు… కేవలం MRP ధరలకే టికెట్లు అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. కోడిపుంజును పట్టుకున్న మాస్ లుక్‌లో శర్వానంద్ కనిపిస్తున్న ఆ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ నిర్ణయం ముఖ్యంగా మధ్యతరగతి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలకంగా మారుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఇది పక్కా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని స్పష్టమవుతోంది. బీటెక్ చదివి ఆర్కిటెక్ట్‌గా పనిచేసే యువకుడిగా శర్వానంద్ పాత్ర కనిపించగా, అతడి జీవితంలోకి సంయుక్తా మీనన్, సాక్షి వైద్య ఎంట్రీ ఇస్తారు. ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇరుక్కుని మురారి పడే ఇబ్బందులను దర్శకుడు రామ్ అబ్బరాజు ఫుల్ కామెడీతో చూపించారు. ముఖ్యంగా కమెడియన్ సత్య ఆటో డ్రైవర్‌గా చేసే కామెడీ, ప్రెగ్నెన్సీ సీన్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ‘సామజవరగమన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు పవర్‌ఫుల్ గెస్ట్ రోల్‌లో మెరవనున్నాడు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇప్పటికే పాటల ద్వారా మంచి స్పందన తెచ్చుకుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించారు.