Pakka Commercial Movie Review : పక్కా కమర్షియల్ మూవీ ఫస్ట్ రివ్యూ & లైవ్ అప్ డేట్స్.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Pakka Commercial Movie Review : పక్కా కమర్షియల్ మూవీ ఫస్ట్ రివ్యూ & లైవ్ అప్ డేట్స్..

Pakka Commercial Review : సినిమా పేరు : పక్కా కమర్షియల్ నటీనటులు : గోపిచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు డైరెక్టర్ : మారుతి మ్యూజిక్ : జేక్స్ బెజోయ్ నిర్మాత : బన్నీ వాసు విడుదల తేదీ : 1 జులై 2022 పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చేస్తున్నాడు ఆరడుగుల బుల్లెట్ గోపిచంద్. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రిలీజ్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 June 2022,11:58 pm

Pakka Commercial Review : సినిమా పేరు : పక్కా కమర్షియల్
నటీనటులు : గోపిచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు
డైరెక్టర్ : మారుతి
మ్యూజిక్ : జేక్స్ బెజోయ్
నిర్మాత : బన్నీ వాసు
విడుదల తేదీ : 1 జులై 2022

పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చేస్తున్నాడు ఆరడుగుల బుల్లెట్ గోపిచంద్. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రిలీజ్ అయింది. రాశీ ఖన్నా హీరోయిన్. సత్యరాజ్, అనసూయ, రావు రమేశ్ తదితరులు ప్రత్యేక పాత్రలో నటించారు.

యాక్షన్, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు కానీ.. గోపిచంద్ కోసం మాత్రం మంచి కథే రాసుకున్నాడు మారుతి. సాధారణంగా డైరెక్టర్ మారుతి సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఆయన సినిమాల్లో కామెడీ ఎక్కువ శాతం ఉంటుంది. ఫన్ తోనే సినిమా మొత్తం నడుస్తూ ఉంటుది. పక్కా కమర్షియల్ సినిమా ట్రైలర్, టీజర్, పాటలు చూస్తే కూడా అదే అనిపిస్తోంది.

Pakka Commercial Movie first review and live updates

Pakka Commercial Movie first review and live updates

Pakka Commercial Review : అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు సృష్టించిన పక్కా కమర్షియల్
అడ్వాన్స్ బుకింగ్స్ లో పక్కా కమర్షియల్ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా నిడివి 152 నిమిషాల 8 సెకన్లు ఉండనుంది. ఈ సినిమాలో గోపిచంద్ తో పాటు హీరోయిన్ రాశిఖన్నా కూడా లాయర్ గా కనిపించనుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దానితో పాటు తెలుగు ఓటీటీ ఆహా కూడా దక్కించుకుంది. అంటే సినిమా విడుదలైన 5 వారాల తర్వాత సినిమా ఓటీటీలలో రిలీజ్ అవుతుంది.

మరోవైపు సినిమా రేట్లను కూడా ప్రత్యేకంగా తెలంగాణ, ఏపీలో తగ్గించారు. సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే నడిచింది. డైరెక్టర్ మారుతి నుంచి వచ్చిన లాస్ట్ మూవీ ప్రతిరోజు పండగే. ఆ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్. ప్రతి రోజు పండగే సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. తాజాగా పక్కా కమర్షియల్ అంటూ మనముందుకు వస్తూ పక్కాగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు మారుతి. మరోవైపు సీటీమార్ సినిమాతో హిట్ కొట్టి.. మరో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపిచంద్. ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. మరి సినిమా లైవ్ అప్ డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కోర్టులో జడ్జ్ మెంట్ సీన్ తో షో స్టార్ట్ అవుతుంది. జడ్జిగా ఎన్నో కేసులకు తీర్పు చెప్పిన సత్యరాజ్.. తర్వాత జడ్జిగా ఫెయిల్ అవుతూ ఉంటాడు. దానికి కారణం.. తన కొడుకు గోపీచంద్ లాయర్ అవడమే.

ఈ సినిమాలో గోపీచంద్ రామ్ చంద్ గా నటించాడు. ఇక.. హీరోయిన్ రాశీ ఖన్నా ఝాన్సీగా నటించింది. తను ఒక సీరియల్ నటి.

ఒక జడ్జిగా, నిజాయితీ పరుడిగా సత్యరాజ్ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు. కానీ.. తన కొడుకుగా రామ్ చంద్ మాత్రం పక్కా కమర్షియల్ గా మారిపోతాడు. చాలా రోజుల పాటు లాయర్ గా ఉండి కొన్ని రోజులు లాయర్ వృత్తికి గ్యాప్ ఇస్తాడు రామ్ చంద్.

ఆ తర్వాత ఓ మిస్టరీ కేస్ కోసం మళ్లీ నల్ల కోటు వేసుకుంటాడు. మరోవైపు సీరియల్ నటి అయిన ఝాన్సీ.. ఓ సీరియల్ లో లాయర్ క్యారెక్టర్ వేయడం కోసం రామ్ చంద్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతుంది.

ఇద్దరూ కేసులు వాదిస్తున్న క్రమంలో ప్రేమలో పడతారు. మరోవైపు రామ్ చంద్ తన తండ్రితో గొడవ పడతాడు. దానికి కారణం ఓ కేసు. దాని విషయంలో తండ్రితో వాదిస్తాడు రామ్ చంద్.

లక్కీ(గోపీచంద్) వద్ద జూనియర్ లాయర్ గా చేరుతుంది ఝాన్సీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్లతోనే నడుస్తుంది. కోర్టు సీన్లు.. ముఖ్యంగా రాశీ ఖన్నా కోర్టు సీన్లు అయితే కడుపుబ్బా జనాలను నవ్విస్తాయి. జాతి రత్నాలలో హీరోయిన్ కోర్టులో ఫన్నీగా ఎలా వాదిస్తుందో ఈ సినిమాలోనూ రాశీ ఖన్నా అదే తరహాలో వాదించి నవ్వులు పూయిస్తుంది.

ఇక.. సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ గా నడిచినప్పటికీ.. రామ్ చంద్ కామెడీ మళ్లీ ప్రేక్షకులను నవ్విస్తుంది. సెకండ్ హాఫ్ లో రామ్ చంద్ కోర్టు సీన్లు, తండ్రితో విభేదాలు, మిస్టరీ కేసు ఇలా అన్నింటి చుట్టూ తిరుగుతుంది. క్లయిమాక్స్ అయితే అదుర్స్ అని చెప్పుకోవాలి. గోపీచంద్ క్లయిమాక్స్ లో అదరగొట్టేశాడు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది