Pakka Commercial Movie Review : పక్కా కమర్షియల్ మూవీ రివ్యూ & రేటింగ్
Pakka Commercial Movie Review : సీటీమార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులతో సీటీమార్ వేయించాడు గోపీచంద్. ఆ తర్వాత గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్. ఈ సినిమా ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. దానికి కారణం.. డైరెక్టర్ మారుతి. ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇవాళ అంటే జులై 1 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరో గోపీచంద్ సరసన అందాల ముద్దుగుమ్మ.. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. నిజానికి.. గోపీచంద్ చాలా ఏళ్ల నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. సీటీమార్ హిట్ అయినప్పటికీ.. బ్లాక్ బస్టర్ కాదు. అందుకే.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసిలో గోపీచంద్ ఉన్నాడు.
అందుకే.. ఈ సినిమాలో తన లుక్ మొత్తం మారిపోయింది. కేవలం గోపీచంద్ కోసమే డైరెక్టర్ మారుతి.. పక్కా కమర్షియల్ సినిమా కథను రాసుకున్నాడట. తన గత సినిమాలకు భిన్నంగా.. ఈ సినిమాలో గోపీచంద్ కనిపించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి. అంతే కాదు.. సినిమా థియేట్రికల్ బిజినెస్, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా సినిమా ఎలా ఉందో.. దాని కథ ఏందో తెలుసుకుందాం పదండి.
Pakka Commercial Review : సినిమా కథ ఇదే
ఈ సినిమా కథ మొత్తం కోర్టు, లాయర్లు, కేసుల చుట్టూ తిరుగుతుంది. అలా అని చెప్పి ఇదేమీ కామెడీ సినిమా కాదు కావచ్చు అని అనుకోకూడదు. కోర్టు, లాయర్ల చుట్టు సినిమా కథ తిరిగినా.. దానిలోనే కామెడీని జనరేట్ చేశాడు మారుతి. గోపీచంద్ ఈ సినిమాలో లాయర్. హీరోయిన్ రాశీ ఖన్నా లాయర్. గోపీచంద్ తండ్రిగా నటించిన సత్యరాజ్.. జడ్జి. ఎన్నో కేసులు వాదించి.. జడ్జిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు సత్యరాజ్. కానీ.. తన కొడుకు రామ్ చంద్(గోపీచంద్) మాత్రం పక్కా కమర్షియల్. ఇద్దరి అభిప్రాయాలు వేరు. అందుకే.. ఇద్దరి మధ్య చాలా విభేదాలు వస్తుంటాయి. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ లాయర్ వృత్తిలోకి దిగుతాడు రామ్ చంద్. దానికి కారణం ఒక మిస్టరీ కేసు. మరోవైపు సీరియల్ నటి అయిన రాశీ ఖన్నా(ఝాన్సీ)కి ఒక చాలెంజింగ్ రోల్ చేయాల్సి వస్తుంది. అదే లాయర్ రోల్. దాని కోసం.. అసిస్టెంట్ గా గోపీచంద్ దగ్గర జాయిన్ అవుతుంది. ఈ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? గోపీచంద్ కు, తన తండ్రికి ఎందుకు ఇంకా వైరం పెరుగుతుంది. ఆ మిస్టరీ కేసు ఏంటి? దాన్ని రామ్ చంద్ ఎలా సాల్వ్ చేస్తాడు అనేదే మిగితా కథ.
Pakka Commercial Review : Pakka Commercial Review : సినిమా పేరు : పక్కా కమర్షియల్
నటీనటులు : గోపీచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు
డైరెక్టర్ : మారుతి
మ్యూజిక్ : జేక్స్ బెజోయ్
నిర్మాత : బన్నీ వాసు
సినిమాటోగ్రఫీ : కర్మ్ చావ్లా
విడుదల తేదీ : 1 జులై 2022
విశ్లేషణ
ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇద్దరి గురించే మాట్లాడాలి. ఒకరు మారుతి. ఇంకొకరు గోపీచంద్. వీళ్లిద్దరే ఈ సినిమాకు సోల్. అవును.. మారుతి రాసుకున్న కథ.. ఆ కథకు గోపిచంద్ సరిగ్గా సూట్ అయ్యాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. ఇక.. మారుతి సినిమాల్లో ఫన్ ఏమేరకు ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. పేరుకు సినిమా మొత్తం కోర్టుల చుట్టూ తిరిగినా.. అక్కడే మాంచి కామెడీని జనరేట్ చేయడంలో మారుతి సక్సెస్ అయ్యాడు. లౌక్యం సినిమాలో ఎలాగైతే బాడీ లాంగ్వేజ్ ను గోపీచంద్ మెయిన్ టెన్ చేశాడో.. ఇక్కడ కూడా అదే బాడీ లాంగ్వేజ్ కాకపోతే.. తన స్టయిల్, గెటప్ మాత్రం ఈసారి పూర్తిగా మారిపోయాయి.
ఇక.. ముఖ్య పాత్రల్లో నటించిన సత్యరాజ్, రావు రమేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్, సప్తగిరి అదరగొట్టేశారు. హీరోయిన్ గా నటించిన రాశీ ఖన్నా మరోసారి తన సత్తా చాటింది. ప్రతిరోజు పండగే సినిమాలో ఎలాగైతే ఎనర్జీతో నటించిందో ఈ సినిమాలో ఇంకాస్త ఎనర్జీని జోడించి మరీ నటించింది.
ప్లస్ పాయింట్స్
కామెడీ
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
టెక్నికల్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
సాంగ్స్
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే.. గోపీచంద్ నుంచి ప్రేక్షకులు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఫుల్ టు కామెడీ.. ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్. అలాగే యాక్షన్ కూడా అదుర్స్. కాబట్టి.. ఈ సినిమాను ఏం చక్కా ఎంజాయ్ చేయొచ్చు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 3.5/5