Panchathantram Movie Review : బ్రహ్మానందం హీరోగా నటించిన ‘పంచతంత్రం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Authored By Varun G | The Telugu News | Published on: December 9, 2022, 11:00 am

Panchathantram Movie Review : పంచతంత్రం అనే పేరును మన చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఈటీవీలో పంచతంత్ర కథలు అనే సీరియల్ వచ్చేది. అది బొమ్మలతో వేయించే నాటకం లాంటిది. దాన్ని చిన్నప్పుడు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. పంచతంత్ర కథలు అంటేనే కొన్ని డిఫరెంట్ కథలను ఒకేచోట కలపడం. తాజాగా రకరకాల కథలతో ఒకే సినిమాగా రూపొందిన పంచతంత్రం అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా కథ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. ఈ సినిమాలో బ్రహ్మానందం పేరు వేద వ్యాస్ మూర్తి. ఈయన కూతురు పేరు రోషిణి(స్వాతి).

చాలామంది తమ 20 లలో కెరీర్ ను బిల్డ్ చేసుకుంటారు. కానీ.. 60 ఏళ్ల వయసు వచ్చినా కూడా కెరీర్ ను బిల్డ్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉంటాడు వేద వ్యాస్ మూర్తి. అందుకే తను రిటైర్ అయినా కూడా స్టాండప్ స్టోరీ టెల్లింగ్ అనే కాంపిటిషన్ లో పాల్గొంటాడు. అయితే.. ముందు బ్రహ్మానందం కథ ప్రారంభం అయినా ఈ సినిమాలో మొత్తం ఐదు కథలు ఉంటాయి. అందులో ఒకటి నరేష్ అగస్త్యది. ఆయన సాఫ్ట్ వేర్ ఉద్యోగి. రెండో కథ రాహుల్ విజయ్ కి సంబంధించింది. తనకు ఏ అమ్మాయి కూడా నచ్చదు. తనలాంటి అభిరుచి ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. మూడో కథ సముద్రఖనికి సంబంధించింది. ఆయన రిటైర్ అయ్యాక ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏం చేయాలి.. అనేదానిపై ఆ కథ ముడిపడి ఉంటుంది. నాలుగో కథ దివ్య శ్రీపాదకు సంబంధించినది. ఐదో కథ కలర్స్ స్వాతికి సంబంధించింది.

Panchathantram Movie Review And Rating In Telugu

Panchathantram Movie Review And Rating In Telugu

సినిమా పేరు : పంచతంత్రం

నటీనటులు : బ్రహ్మానందం, స్వాతిరెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద, నరేష్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్,  ప్రొడ్యూసర్స్ : సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్, డైరెక్టర్ : హర్ష పులిపాక,  రిలీజ్ డేట్ : 9 డిసెంబర్ 2022

Panchathantram Movie Review : సినిమా ఎలా ఉంది?

ఇది ఒక ఆంథాలజీ మూవీ. ఇందులో ఒక కథ మాత్రమే ఉండదు కాబట్టి.. రకరకాల కథలకు మనం కనెక్ట్ అయిపోవాలి. అంటే పంచేద్రియాలను కనెక్ట్ చేసుకోవాలి. మన చుట్టు జరిగే విషయాలు, సంఘటనలే ఇతివృత్తంగా తీసుకొని డైరెక్టర్ ఈ కథలు రాసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అన్ని కథలకు లింక్ పెట్టి ఆ కథలను ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ హర్ష సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఇక.. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ బ్రహ్మానందంది. ఆయన సాధారణంగా కామెడీ పాత్రలు చేయడంలో దిట్ట. కానీ.. ఇందులో ఆయనది కామెడీ తరహా పాత్ర కాదు. సీరియస్ రోల్. ఆయన సినిమాకు ప్రాణం పోశారనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ క్యారెక్టర్ కు న్యాయం చేశారు.

Panchathantram Movie Review : కన్ క్లూజన్

చివరగా చెప్పొచేద్దంటంటే.. ఈ వీకెండ్ కు సరదాగా ఫీల్ గుడ్ మూవీకి వెళ్లాలనుకుంటే పంచతంత్రం సినిమాకు కళ్లు మూసుకొని వెళ్లొచ్చు.

దితెలుగున్యూస్ రేటింగ్ : 2.5/5

Varun G

No bio available for this author.

  1. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  2. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  3. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

  4. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

  5. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

  6. "Flipkart Big Billion Days : రూ.9 వేలలోపు ఫోన్లు.. 5Gపై అదిరే డీల్స్"

  7. "Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు అగ్నిపరీక్ష.. ఆ రెండు సినిమాలే ఆమె భవితవ్యాన్ని తేలుస్తాయా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp