Panchathantram Movie Review : పంచతంత్రం అనే పేరును మన చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఈటీవీలో పంచతంత్ర కథలు అనే సీరియల్ వచ్చేది. అది బొమ్మలతో వేయించే నాటకం లాంటిది. దాన్ని చిన్నప్పుడు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. పంచతంత్ర కథలు అంటేనే కొన్ని డిఫరెంట్ కథలను ఒకేచోట కలపడం. తాజాగా రకరకాల కథలతో ఒకే సినిమాగా రూపొందిన పంచతంత్రం అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా కథ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. ఈ సినిమాలో బ్రహ్మానందం పేరు వేద వ్యాస్ మూర్తి. ఈయన కూతురు పేరు రోషిణి(స్వాతి).
చాలామంది తమ 20 లలో కెరీర్ ను బిల్డ్ చేసుకుంటారు. కానీ.. 60 ఏళ్ల వయసు వచ్చినా కూడా కెరీర్ ను బిల్డ్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉంటాడు వేద వ్యాస్ మూర్తి. అందుకే తను రిటైర్ అయినా కూడా స్టాండప్ స్టోరీ టెల్లింగ్ అనే కాంపిటిషన్ లో పాల్గొంటాడు. అయితే.. ముందు బ్రహ్మానందం కథ ప్రారంభం అయినా ఈ సినిమాలో మొత్తం ఐదు కథలు ఉంటాయి. అందులో ఒకటి నరేష్ అగస్త్యది. ఆయన సాఫ్ట్ వేర్ ఉద్యోగి. రెండో కథ రాహుల్ విజయ్ కి సంబంధించింది. తనకు ఏ అమ్మాయి కూడా నచ్చదు. తనలాంటి అభిరుచి ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. మూడో కథ సముద్రఖనికి సంబంధించింది. ఆయన రిటైర్ అయ్యాక ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏం చేయాలి.. అనేదానిపై ఆ కథ ముడిపడి ఉంటుంది. నాలుగో కథ దివ్య శ్రీపాదకు సంబంధించినది. ఐదో కథ కలర్స్ స్వాతికి సంబంధించింది.
నటీనటులు : బ్రహ్మానందం, స్వాతిరెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద, నరేష్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్, ప్రొడ్యూసర్స్ : సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్, డైరెక్టర్ : హర్ష పులిపాక, రిలీజ్ డేట్ : 9 డిసెంబర్ 2022
ఇది ఒక ఆంథాలజీ మూవీ. ఇందులో ఒక కథ మాత్రమే ఉండదు కాబట్టి.. రకరకాల కథలకు మనం కనెక్ట్ అయిపోవాలి. అంటే పంచేద్రియాలను కనెక్ట్ చేసుకోవాలి. మన చుట్టు జరిగే విషయాలు, సంఘటనలే ఇతివృత్తంగా తీసుకొని డైరెక్టర్ ఈ కథలు రాసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అన్ని కథలకు లింక్ పెట్టి ఆ కథలను ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ హర్ష సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఇక.. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ బ్రహ్మానందంది. ఆయన సాధారణంగా కామెడీ పాత్రలు చేయడంలో దిట్ట. కానీ.. ఇందులో ఆయనది కామెడీ తరహా పాత్ర కాదు. సీరియస్ రోల్. ఆయన సినిమాకు ప్రాణం పోశారనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ క్యారెక్టర్ కు న్యాయం చేశారు.
చివరగా చెప్పొచేద్దంటంటే.. ఈ వీకెండ్ కు సరదాగా ఫీల్ గుడ్ మూవీకి వెళ్లాలనుకుంటే పంచతంత్రం సినిమాకు కళ్లు మూసుకొని వెళ్లొచ్చు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.5/5
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.