
Peddanna Movie Review
Peddanna Movie Review : తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఆయన నటించిన ‘పెద్దన్న’ చిత్రం దీపావళి సందర్భంగా గురువారం విడుదలైంది. కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్‌తో ‘వీరం, వేదాళం, విశ్వాసం’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్ శివ.. అంతకు ముందు టాలీవుడ్‌లో ‘శౌర్యం, దరువు’ సినిమాలు తీశారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘పెద్దన్న’ చిత్రం తీశారు డైరెక్టర్ శివ. ఈ సినిమా తమిళ్‌లో ‘అన్నాత్తె’గా, తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలైంది.
Peddanna Movie Review
Peddanna Movie Review : ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్..
‘పెద్దన్న’ సినిమా స్టోరి విషయానికొస్తే..చెల్లెల్ని అమితంగా ఇష్టపడే అన్నయ్య పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపించాడు. చెల్లెలు క్షేమం కోసం ఎప్పుడూ పరితపిస్తుంటాడు. ఆమెకు ఎటువంటి హాని కలగకూడదని రజనీకాంత్ భావిస్తుంటాడు. అంతలా తనను ప్రేమించే పెద్దన్న రజనీకాంత్ చూసి పెళ్లి సంబంధం కాదని కీర్తి సురేశ్ పారిపోతుంది. కాగా, కీర్తి సురేశ్ ఎందుకు అన్న దగ్గరి నుంచి పారిపోతుంది? తిరిగి తన అన్నయ్యను ఎప్పుడు కలుస్తుంది? తిరిగి ఇంటికొస్తుందా? అనేది తెలియాలంటే వెండితెరపై చిత్రం చూడాల్సిందే.
సినిమా : పెద్దన్న
నటీ నటులు : రజనీకాంత్, కీర్తి సురేశ్, నయనతార, ఖుష్బూ, మీనా
డైరెక్టర్ : శివ
మ్యూజిక్ : డి.ఇమ్మాన్
ప్రొడ్యూసర్ : కళానిధి మారన్
విడుదల తేదీ : నవంబర్ 4, 2021
సినిమా చూస్తున్నంత సేపు డైరెక్టర్ శివ ఫైట్స్ మేకింగ్‌లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్లు మనకు అర్థమవుతుంది. స్టైల్‌కు స్టైల్ నేర్పే రజనీకాంత్ ఈ ఫిల్మ్ ఇంకా స్టైలిష్‌గా కనిపించాడు. మాస్ యాక్షన్ సీన్స్‌లో రజనీ ఎలివేషన్ ఆయన అశేష అభిమానులకు బాగా నచ్చుతుంది. ఇక రజనీ పంచ్ డైలాగ్స్, ఫైట్స్‌లో పర్ఫార్మెన్స్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. అన్నా చెల్లెల్లుగా రజనీకాంత్ – కీర్తిసురేశ్ చాలా బాగా నటించారు.
Peddanna Movie Review
చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ చాలా బాగా నటించింది. ఈ మూవీలో కీ రోల్ కీర్తి సురేశ్ దే కాగా, ఆమె చుట్టూనే కథ తిరుగుతుంటుంది. హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార తన పాత్ర మేరకు నటించింది. ఇకపోతే సీనియర్ హీరోయిన్స్ మీనా, ఖుష్బూ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వీరిద్దరూ రజనీని టీజ్ చేస్తూ ఫన్నీగా కనబడుతుంటారు. విలన్‌గా జగపతిబాబు అత్యద్భుతంగా నటించారు. రజనీకాంత్ గత చిత్రం ‘దర్బార్’లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించగా, ఈ చిత్రంలో ఫ్యామిలీ మ్యాన్‌గా చక్కటి పాత్ర పోషించాడు. ‘పెద్దన్న’గా ప్రేక్షకులను అలరిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్ : సూపర్ స్టార్ రజనీకాంత్- కీర్తి సురేశ్ అన్నా చెల్లెళ్లుగా బాగా నటించారు. విలన్‌గా జగపతిబాబు నటన అత్యద్భుతం.
మైనస్ పాయింట్స్ : సేమ్ ఓల్డీ రొటీన్ స్టోరి అన్న భావన సినిమా చూస్తుంటే కలుగుతుంటుంది. యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నప్పటికీ సందర్భానుసారం లేవు.
ట్యాగ్ లైన్ : చక్కటి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది. దీపావళి హిట్‌గా నిలిచిపోతుంది..!
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
Anasuya Bharadwaj : దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు…
The Raja Saab Movie 8th Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్…
Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి,…
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…
Central Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ముఖ్యంగా పీఎం కిసాన్…
Mana Shankara Vara Prasad Garu Movie : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేటను…
This website uses cookies.