
vadinamma 4 november 2021 full episode
Vadinamma 4 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 నవంబర్ 2021, గురువారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రఘురామ్ డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వస్తాడు. 24 గంటలు రిషితోనే రఘురామ్ ఆడుకుంటూ ఉంటాడు. అదే సమయంలో సీత తల్లి, అన్నయ్య వదిన వస్తారు. అమ్మా సీత.. అని వచ్చి హత్తుకుంటుంది తన తల్లి. ఇంతలో వాళ్లు లోపలికి వస్తారు. దుర్గకు మాత్రం కాస్త అనుమానం కలుగుతుంది. ఎలా ఉన్నారు బాబు. ఎంత కష్టం వచ్చినా నా అల్లుడు గారు ఎప్పుడూ కుంగిపోరు.. అంటుంది రాజేశ్వరి.
vadinamma 4 november 2021 full episode
మాకు ధైర్యం చెప్పిన అల్లుడు గారు ప్రాణం మీదికి తెచ్చుకుంటే మాకు బాధగా ఉండదా? చూడు బాబు నీ మీద దిగులు పెట్టుకొని సీత ఎంత కంగారు పడుతుందో చూడు. పిల్లల విషయంలో సీత నిబ్బరంగా ఉంది. ప్రాప్తం లేదు అని సర్దుకుపోండి. నువ్వు దిగులు పెట్టుకోకు బాబు అంటుంది. కానీ.. మీ కూతురుకు ఉన్నంత ధైర్యం నాకు లేవు అత్తయ్య గారు అంటాడు రఘురామ్.
పెద్దమ్మ.. నాకు తెలియక అడుగుతాను. అన్నయ్య నీరసంగా ఉంటే ఆ బాబుతో ఆటలేంటి. రిషిని అస్సలు ఇవ్వట్లేదు అంటుంది దుర్గ. తనకు మాత్రం ఏదో అనుమానం వస్తుంది. ఇంతలో భాస్కర్.. రఘురామ్ దగ్గరికి వెళ్లి నా మేనల్లుడిని ఒక్కసారి ఇవ్వరా.. అంటాడు. ఏరా.. నీ కన్న బిడ్డను వదలాలనిపించడం లేదా? నేను అంతా విన్నాను. నాకు అంతా తెలుసు. వాడిని గుండెల మీద పడుకోబెట్టుకొని నీ దిగులు అంతా తీర్చుకుంటున్నావా? చాలా తప్పు చేశావమ్మా. నేనేం మాట్లాడాలి అమ్మా.. అంటాడు. ఆసుపత్రిలో నేను ఆ నిజం విన్నాను అని అంటాడు భాస్కర్.
మరోవైపు రిషిని.. రఘురామ్ అస్సలు వదలడు. దీంతో శైలూకు అస్సలు నచ్చదు. రిషీని తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నించినా కుదరదు. తను చాలా ఇబ్బందులు పడుతుంటుంది. రఘురామ్, రిషీ.. ఇద్దరు హాయిగా నిద్రపోతారు. బాబును ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తుంటుంది శైలూ. బాబును తీసుకోవడానికి సీత రాగానే.. రఘురామ్ లేస్తాడు. బావా.. రిషీ కోసం శైలూ వచ్చింది అని రిషిని శైలూకు ఇచ్చేస్తుంది సీత.
vadinamma 4 november 2021 full episode
కట్ చేస్తే తెల్లారుతుంది. టిఫిన్ పెట్టడానికి సీత వస్తే.. రఘురామ్ సీరియస్ అవుతాడు. నేను షాప్ కు వెళ్లాలి.. నాకు టిఫిన్ పెట్టు అని సిరిపై అరుస్తాడు. రాను రాను ఈ ఇంట్లో నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. అని అరిచి షాపునకు వెళ్లిపోతాడు రఘురామ్. సీతక్కతో మాట్లాడమని నువ్వైనా చెప్పు అత్తయ్య అని సిరి.. రాజేశ్వరితో అంటుంది. కానీ.. అస్సలు రఘురామ్ మాత్రం సీతతో మాట్లాడడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
Anasuya Bharadwaj : దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు…
The Raja Saab Movie 8th Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్…
Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి,…
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…
This website uses cookies.