Pushpa 2 The Rule Live Updates : పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ ,లైవ్ అప్డేట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 2 The Rule Live Updates : పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ ,లైవ్ అప్డేట్స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 December 2024,10:33 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 2 The Rule Live Updates : పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ ,లైవ్ అప్డేట్స్..!

Pushpa 2 The Rule Live Updates : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా గురువారం అనగా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంటే.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా సూపర్ బజ్ ఏర్పడింది. పుష్ప 2 సినిమా యూఎస్ లో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మొదటి ప్రీమియర్స్ వేశారు. టికెట్ రేట్లు కాస్త ఎక్కువనిపించినా సరే ప్రీమియర్స్ కు మంచి క్రేజ్ వచ్చింది.

నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, శ్రీలీల, సునీల్, అనసూయ, రావు రమేష్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : మిరోస్లో కుబా బ్రొజెక్

దర్శకత్వం : సుకుమార్

నిర్మాతలు : నవీన్ యెర్నెని, వై. రవి శంకర్.

Pushpa 2 The Rule Live Updates పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ లైవ్ అప్డేట్స్

Pushpa 2 The Rule Live Updates : పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ ,లైవ్ అప్డేట్స్..!

Pushpa 2 Twitter Review – Live Updates పుష్ప 2 సినిమా లైవ్ ట్విట్టర్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి..

– సినిమా ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ తో ముగుస్తుంది.

-ఒక అద్భుతమైన ఫైట్ సీన్ వస్తుంది. అసలు ఏమాత్రం ఊహించని విధంగా.. పుష్ప రాజ్ డెవిల్ మోడ్ లో పూనకాలు తెప్పించేస్తాడు.. ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.

-పుష్ప రాజ్ కు అనుకోని ఇబ్బందులు వస్తాయి. అతని పర్సనల్ క్రైసిస్ వల్ల ఇబ్బందుల్లో పడతాడు. ఐతే సినిమా ఇప్పుడే గ్రిప్పింగ్ గా నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది.

-మరో అదిరిపోయే ఇంటెన్స్ సీన్.. ఆ తర్వాత పుష్ప రాజ్ తో రావు రమేష్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.

– జాతర ఫైట్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రతి షాట్ కూడా విజిల్స్ వేసేలా ఉంది. బన్నీ ఫ్యాన్స్ కి ఈ సీన్ పండగ అన్నట్టే. టికెట్ పైసలకు పర్ఫెక్ట్ అనిపించే సీన్ ఇది. రష్మిక నాన్ స్టాప్ డైలాగ్ డెలివరీ కూడా సినిమాపై మంచి ఇంటెన్సిటీ కలగ చేస్తుంది. సినిమా అవుట్ స్టాండింగ్ దిశగా వెళ్తుంది.

-ఇంట్రెస్ట్ గా సాగే డ్రామా సీకెన్స్ తర్వాత జాతర సీన్ వస్తుంది. శారీలో అల్లు అర్జున్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం సూసేకి సాంగ్ వస్తుంది.

– సెకండ్ హాఫ్ ఒక ఛేజ్ సీన్ తో మొదలవుతుంది. పుష్ప రాజ్, భన్వర్ సింగ్ ల ఇన్ డైరెక్ట్ ఫైట్ నడుస్తూనే ఉంటుంది. ఈ సీన్స్ సినిమా వేగాన్ని పెంచుతున్నాయి.

Pushpa 2 Twitter Review – Live Updates 1st Half Report : ఫస్ట్ హాఫ్ రిపోర్ట్

– పుష్ప రాజ్ క్యారెక్టరైజేషన్ లో అల్లు అర్జున్ మరోసారి అదరగొట్టాడు. ఫస్ట్ హాఫ్ ఎక్కడ తగ్గకుండా ఉంది. ఫాహద్ కూడా ఢీ అంటే ఢీ అనేలా ఉన్నాడు. సెకండ్ హాఫ్ కోసం మంచి ఎగ్జైట్ మెంట్ కలగ చేశాడు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే బ్లాక్ బస్టర్ రిపోర్ట్.

– ఫాహద్ తో ఢీ కొట్టిన పుష్ప రాజ్.. అతనికి తో ఛాలెంజ్ చేస్తాడు. ఒక భారీ హై ఇంటెన్స్ సీన్ తో ఇంటర్మిషన్ వచ్చింది .

-ఫాహద్ తో ఢీ కొట్టిన పుష్ప రాజ్.. అతనికి తో ఛాలెంజ్ చేస్తాడు. ఒక భారీ హై ఇంటెన్స్ సీన్ తో ఇంటర్మిషన్ వచ్చింది .

– పుష్ప రాజ్, భన్వర్ సింగ్ ఫేస్ టు ఫేస్ క్రూషియల్ మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఊహించని ట్విస్ట్.. ఊపిరి బిగబట్టి చూసేలా ఇంటెన్స్ క్రియేట్ చేసిన సుకుమార్..

– శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఫహద్ ఫాజిల్ సహాయం చేస్తుండటం వల్ల పుష్ప రాజ్ ప్లాన్ ని పాడు చేసేందుకు మంగళం శీను, దాక్షాయణి అదే సునీల్, అనసూయలు వస్తారు.

– సిండికేట్ మీటింగ్ పూర్తి కాగానే రష్మిక అల్లు అర్జున్ పీలింగ్స్ సాంగ్ వస్తుంది. అల్లు అర్జున్, రష్మిక డ్యాన్స్ కుమ్మేశారు. సూపర్ హిట్ సాంగ్ సిల్వర్ స్క్రీన్ మీద అసలేమాత్రం కనిపించలేదు అనేంతగా విజిల్స్ పేపర్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. సాంగ్ సూపర్ సూపర్ సూపర్ హిట్.

– సీఎం క్యాంప్ ఆఫీస్ లో పుష్ప రాజ్ తో ముఖ్యమంత్రి, రావు రమేష్ ల మధ్య సీన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ నిర్ణయం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. కథ ఇప్పుడు ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. జగపతి బాబు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.

-ఇప్పుడే టైటిల్ సాంగ్ వస్తుంది.. పుష్ప పుష్ప సాంగ్ తో థియేటర్ దద్దరిల్లిపోయింది. అల్లు అర్జున్ రష్మిక మందన్న మధ్య కొన్ని సీన్స్ వస్తున్నాయి.. ఆ సీన్స్ చాలా కామెడీగా ఉన్నాయి.

– కథలో పాత్రల ఎంట్రీతో పాటు కథలో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది.. పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ తో పాటు ఆఫీసర్స్ మధ్య కొన్ని అదిరిపోయే సీన్స్ వస్తున్నాయి.. ఇప్పటివరకు అయితే సినిమా ఫ్యాన్స్ కి ఫీస్ట్ అన్నట్టుగా ఉంది..

-జపాన్ లో యోకొహమా పోర్ట్ లో సినిమా మొదలవుతుంది. ఇప్పుడే పుష్ప రాజ్ మాస్ ఎంట్రీకి ఎలివేషన్ జరుగుతుంది.. ఆ పోర్ట్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో పుష్ప రాజ్ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఎంట్రీ ఇచ్చాడు.. అంతేకాదు ఆయనతో పాటు భన్వర్ సింగ్ షెఖావత్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.

-సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివితో సెన్సార్ సర్టిఫికెట్ వేశారు..

–  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా థియేటర్ అంతా ఒక రేంజ్ హంగామా నడుస్తుంది.

 

Allu Arjun, Pushpa 2 Review, Pushpa 2 Twitter Review, Sukumar, Rashmika Mandanna, Pushpa 2 Review & Rating

ఇది కూడా చ‌దండి ==>  Pushpa 2 The Rule Live Updates : పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ ,లైవ్ అప్డేట్స్..!

ఇది కూడా చ‌దండి ==> Pushpa 2 The Rule Movie Review : పుష్ప 2 మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

No liveblog updates yet.

LIVE UPDATES

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది