Double Ismart Movie Review : డబుల్ ఇస్మార్ట్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Double Ismart Movie Review : రాం పూరీ జగన్నాథ్ కాంబోలో 2019 లో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా తో అటు రాం, ఇటు పూరీ ఇద్దరు తిరిగి ఫాం లోకి వచ్చారు. పూరీ మార్క్ టేకింగ్, యాక్షన్ ఇంకా హీరోయిన్స్ అందాలు ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పూరీ తిరిగి ట్రాక్ లోకి వచ్చాడని అనుకున్నారు. ఐతే ఆ తర్వాత లైగర్ మళ్లీ […]
ప్రధానాంశాలు:
Double Ismart Movie Review : డబుల్ ఇస్మార్ట్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Double Ismart Movie Review : రాం పూరీ జగన్నాథ్ కాంబోలో 2019 లో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా తో అటు రాం, ఇటు పూరీ ఇద్దరు తిరిగి ఫాం లోకి వచ్చారు. పూరీ మార్క్ టేకింగ్, యాక్షన్ ఇంకా హీరోయిన్స్ అందాలు ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పూరీ తిరిగి ట్రాక్ లోకి వచ్చాడని అనుకున్నారు. ఐతే ఆ తర్వాత లైగర్ మళ్లీ పెద్ద షాక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా లెవెల్ లో తీసిన లైగర్ ఫ్లాప్ అయ్యింది. ఐతే ఆ షాక్ నుంచి తేరుకుని మళ్లీ రాం తో డబుల్ ఇస్మార్ట్ చేశాడు పూరీ.ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో పూరీ మీద నమ్మకంతో రాం డబుల్ ఇస్మార్ట్ కి ఓకే చెప్పాడు. ఇస్మార్ట్ శంకర్ కథకు డబుల్ ఇస్మార్ట్ కు సంబంధం లేదు కానీ బ్రెయిన్ ట్రాన్స్ ఫర్ మూల కథ మాత్రం ఇందులో కూడా ఉంటుంది. ఐతే డబుల్ ఇస్మార్ట్ ని ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు పూరీ. సినిమాలో ఎవరికి కావాల్సిన అంశాలు వారికి ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్ కథ ఈసారి విలన్ మైండ్ ని ట్రాన్స్ ఫర్ చేస్తారన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటించడం బాలీవుడ్ లో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ తెచ్చేలా చేసింది. హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ కూడా హైలెట్ గా నిలిచేలా ఉంది. ఇస్మార్ట్ శంకర్ కి ఇచ్చినట్టుగానే మణిశర్మ డబుల్ ఇస్మార్ట్ కి కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారని తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ సినిమాగా అనిపిస్తుంది.ఐతే ఇస్మార్ట్ శంకర్ పంథాలోనే పూరీ డబుల్ ఇస్మార్ట్ కూడా ఫుల్ మాస్ మసాలా సినిమాగా తెరకెక్కించారు. ఐతే చివర్లో పోకిరి టైప్ ట్విస్ట్ కూడా ఉంటుందని చెబుతున్నారు. అదే జరిగితే పూరీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓ పక్క రాం కూడా ది వారియర్, స్కంద సినిమాల ఫ్లాపుల్లో ఉన్నాడు. రాం ఎనర్జీ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందనిపిస్తుంది. మరోసారి శంకర్ పాత్రలో రాం అదరగొట్టేశాడు. ట్రైలర్ లో మాత్రం రాం ఫుల్ లెంగ్త్ మాస్ అప్పీల్ తో మాస్ ప్రియులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉన్నాడని అనిపిస్తుంది.
మళ్లీ పూరీకి, రాం కి డబుల్ ఇస్మార్ట్ హిట్ కంపల్సరీ అయ్యింది. మరి ఇస్మార్ట్ శంకర్ నిలబెట్టినట్టుగా డబుల్ ఇస్మార్ట్ కూడా వీరిద్దరి కాంబో సూపర్ హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పోటీగా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా వస్తుంది. ఆ సినిమా డబుల్ ఇస్మార్ట్ కన్నా బజ్ లో ముందుంది. మరి ఈ రెండు సినిమాల ఫైట్ లో ఏది గెలుస్తుందో చూడాలి.
రామ్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా ఆ సినిమా సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కించారు. పూరీ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ డబుల్ ఇస్మార్ట్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూడాలి.
Double Ismart Movie Review కథ
శంకర్ (రామ్) కి ఆల్రెడీ మెమొరీ ట్రాన్స్ ఫర్మేషన్ సక్సెస్ అయిందని తెలుసుకున్న బిగ్ బుల్ (సంజయ్ దత్) తనకు వచ్చిన బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో తను చిరకాలం బ్రతకాలంటే ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్ ని అతని బ్రెయిన్ లోకి మార్చుకోవాలని అనుకుంటాడు. ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్ ని పంపించి ఇస్మార్ట్ శంకర్ ని పట్టుకు రమ్మంటాడు. మరోపక్క శంకర్ కూడా బిగ్ బుల్ తన టార్గెట్ గా చేసుకుని ఉంటాడు. ఇంతకీ శంకర్ కు బిగ్ బుల్ బ్రెయిన్ ట్రాన్స్ ఫర్ అయ్యిందా.. ఆ తర్వాత ఏం జరిగింది. జన్నత్ (కావ్య) ఎందుకు శంకర్ కి సాయం చేసింది. పోచమ్మ (ఝాని) కథ ఏంటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Double Ismart Movie Review విశ్లేషణ
రామ్ పూరీ జగన్నాథ్ కాంబోలో 2019 లో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా తో అటు రామ్, ఇటు పూరీ ఇద్దరు తిరిగి ఫాం లోకి వచ్చారు. పూరీ మార్క్ టేకింగ్, యాక్షన్ ఇంకా హీరోయిన్స్ అందాలు ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పూరీ తిరిగి ట్రాక్ లోకి వచ్చాడని అనుకున్నారు. ఐతే ఆ తర్వాత లైగర్ మళ్లీ పెద్ద షాక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా లెవెల్ లో తీసిన లైగర్ ఫ్లాప్ అయ్యింది. ఐతే ఆ షాక్ నుంచి తేరుకుని మళ్లీ రామ్ తో డబుల్ ఇస్మార్ట్ చేశాడు పూరీ.
ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో పూరీ మీద నమ్మకంతో రామ్ డబుల్ ఇస్మార్ట్ కి ఓకే చెప్పాడు. ఇస్మార్ట్ శంకర్ కథకు డబుల్ ఇస్మార్ట్ కు సంబంధం లేదు కానీ బ్రెయిన్ ట్రాన్స్ ఫర్ మూల కథ మాత్రం ఇందులో కూడా ఉంది. ఐతే డబుల్ ఇస్మార్ట్ ని ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు పూరీ. సినిమాలో ఎవరికి కావాల్సిన అంశాలు వారికి ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్ కథ ఈసారి బిగ్ బుల్ అనే విలన్ మైండ్ ని రామ్ కి ట్రాన్స్ ఫర్ చేస్తారు.
సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రామ్ ఎనర్జీ, అలి కామెడీ మీద నడిపించాలనుకున్న పూరీ కాస్త పర్వాలేదు అనిపించాడు. ఇంటర్వల్ టైం కి బ్రెయిన్ ట్రాన్స్ ఫర్ ఎపిసోడ్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయినా సినిమాను నిలబెడుతుంది అనుకుంటే అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. సినిమా సెకండ్ హాఫ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించాల్సింది కానీ అది జరగలేదు.
సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటించడం మంచి బజ్ ఏర్పర్చినా సరే ఆశించిన స్థాయిలో ఆయన్ను వాడుకోలేదనిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ కి ఇచ్చినట్టుగానే మణిశర్మ డబుల్ ఇస్మార్ట్ కి కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వలేదనిపిస్తుంది. డబుల్ ఇస్మార్ట్ మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ ఇస్తాడనుకుంటే హాఫ్ మీల్స్ తోనే సరిపెట్టాడు పూరీ.
నటీనటులు :
శంకర్ పాత్రలో మరోసారి రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ మెప్పించింది. ఐతే రామ్ ఎనర్జీని పూరీ సరిగా వాడుకోలేదని అర్ధమవుతుంది. సంజయ్ దత్ విలనిజం కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. కావ్య థాపర్ కేవలం గ్లామర్ షో కోసమే తప్ప ఆమెకు తగిన ప్రధాన్యత లేదు. అలి ట్రాక్ పూర్తిగా మిస్ ఫైర్ అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోలేదు సరికదా సినిమాకు అదో మైనస్ గా మారింది. మిగతా పాత్రలన్నీ కూడా సోసోగానే అనిపించాయి.
సాంకేఇక వర్గం :
ఇస్మార్ట్ శంకర్ కి వర్క్ అవుట్ అయిన మణిశర్మ మ్యూజిక్ డబుల్ ఇస్మార్ట్ కి వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఆయన ఇచ్చిన రెండు సాంగ్స్ ఓకే అనిపిస్తాయి. కెమెరా మెన్ పనితీరు ఓకే అనిపిస్తుంది. ఇక పూరీ మళ్లీ రొటీ రొట్ట కథతోనే ఈ సినిమా తీశాడనిపిస్తుంది. మళ్లీ పూరీ ఫ్యాన్స్ కి ఈ సినిమా నిరాశే అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
రామ్ ఎనర్జీ
కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే
వర్క్ అవుట్ కాని కామెడీ
బాటం లైన్ :
రామ్ ఎనర్జీని వేస్ట్ చేసిన పూరీ..!
రేటింగ్ : 2/5