RRR Movie Review : ఆర్ఆర్ఆర్ రివ్యూ RRR Movie Review నందమూరి, మెగా హీరోల కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. రాజమౌళి, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ షో ద్వారా చాలా ప్రాంతాల్లో విడుదలైంది. పైగా ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లను వెంటేసుకొని దేశం మొత్తాన్ని చుట్టేసారు. విడుదల తర్వాత మరోసారి ఈ సినిమాను ప్రమోట్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేస్తున్నారు. అయితే చిత్ర కథ ఏంటని చూస్తే..
ఆర్.ఆర్.ఆర్ కథ 1920లలో ఢిల్లీ పరిసర ప్రాంతాలలో నివసించే వారి నేపథ్యంలో సాగుతుంది. రామరాజు, భీమ్ ఇద్దరికీ చిన్న తనం నుంచీ పోరాడే తత్వం ఉంటుంది. భీమ్ తన జాతి గౌరవం కోసం శ్వాసనైనా విడిచే రకం. భీమ్ గోండు జాతికి చెందిన ఓ పచ్చబొట్లు పొడిచే పాపను బ్రిటిష్ ఆఫీసర్ భార్య తమతోనే ఉంచుకుందామని తీసుకువెళ్తుంది. ఆ సమయంలో భీమ్ ఎలాగైనా తమ గోండు పాపను రక్షించాలనుకుంటాడు. ఇదిలా ఉంటే ఓ సందర్భంలో ఇన్ స్పెక్టర్ రామ్, కొమరం భీమ్ కలుసుకుంటారు. వారిద్దరి మధ్య స్నేహం బలపడుతుంది. ముస్లిమ్ లాగా కనిపించే భీమ్, చలాకీగా ఉండే రామ్ ఇద్దరూ తమ అసలు లక్ష్యాలను చెప్పుకోరు. కానీ, వారి స్నేహబంధం మాత్రం చెరిగిపోనిది.
బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న గోండు నాయకుడు భీమ్ ను పట్టుకోవాలని గవర్నమెంట్ భావిస్తుంది. అందుకు సరైన పోలీస్ ఇన్ స్పెక్టర్ రామ్ అని భావించి, అతణ్ణి నియమిస్తుంది. భీమ్ ను బంధించి తెస్తే, మరింత ఉన్నత స్థానానికి వెళతావనీ ప్రభుత్వం హామీ ఇస్తుంది. దాంతో రామ్ ఉత్సాహంగా భీమ్ ను పట్టుకొనే ప్రయత్నం మొదలు పెడతాడు. అలా రామ్ కు తన మిత్రుడే భీమ్ అన్న విషయం తెలుస్తుంది. అయితే తనను రామ్ మోసం చేశాడని భీమ్, తన వద్ద భీమ్ రహస్యం దాచాడని రామ్ భావిస్తారు. ఇద్దరు మిత్రుల నడుమ పోరు చూస్తే మనసులు ద్రవిస్తాయి.
చిన్నతనం నుంచీ తన బావ రామ్ పై పంచ ప్రాణాలు పెట్టుకున్న సీత అతను పెద్ద ఆఫీసర్ అయ్యాడన్న ఆనందంతో వస్తుంది. అయితే భీమ్ తప్పించుకోవడానికి కారణం రామ్ అని, అతణ్ని చిత్రహింసల పాలు చేస్తుంటారు బ్రిటిష్ సైనికులు. మిత్రుడు భీమ్ ని రామ్ తప్పించాడనే తెల్లవాళ్ళు రామ్ ను చంపబోతున్నారని చెప్పి విలపిస్తుంది. అప్పటి వరకూ రామ్ తనకు మిత్రద్రోహం చేశాడని భావించిన భీమ్ అసలు విషయం తెలుసుకోగానే స్నేహితుణ్ణి విడిపించేందుకు పరుగు తీస్తాడు. ఎప్పటికప్పుడు తమ వ్యూహాలతో తెల్లవారిని చిత్తు చేస్తూ పోతారు. చివరకు బ్రిటీష్ వారిని వారు ఎలా ఎదిరిస్తారు అనేది చిత్ర కథ.
ఎన్నడూ కలుసుకోని రామరాజు, భీమ్ ఎలా ఈ కథలో కలుసుకున్నారో జనం ఎంతగానో ఊహించుకున్నారు. జక్కన్న మాత్రం తాను చెప్పినట్టుగానే ఈ చిత్రకథకు అల్లూరికి, కొమరం కు ఏ సంబంధమూ లేదనే చూపించారు. ఇటు రామ్, ఇటు భీమ్ ఇద్దరి బాల్యాన్నీ చూపిస్తూ కథ మొదలవుతుంది. తాను అనుకున్నది అద్భుతంగా చూపించి మరోసారి ప్రేక్షకులని అలరించాడు రాజమౌళి. ఇక రామ్ చరణ్ ఎంట్రీ సీన్ తప్పకుండా ఆయన అభిమానులకే కాదు, ఇతర ప్రేక్షకులకు సైతం కనువిందు చేసేలా తెరకెక్కింది. కొమరం భీముడో… పాట సమయంలో యన్టీఆర్ అభినయం ఎవరినైనా కట్టిపడేస్తుంది. ఇక ఇద్దరు హీరోలు ఎవరికీ ఎవరు ఏ మాత్రం తగ్గమని పాటల్లోనూ పస చూపించారు.
అలియా భట్ , శ్రియ, అజయ్ దేవగన్ నటన కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. ఇందులోని ఆరు పాటలనూ సందర్భోచితంగానే తెరపై ప్రదర్శించారనిపిస్తుంది. సుద్దాల అశోక్ తేజ్ పలికించిన ”కొమరం భీముడో… ” పాట చూపు తిప్పుకోకుండా చేస్తుంది. దేశమాతపై అభిమానం పెంచేలా ఫ్లాష్ బ్యాక్ లో చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి రాసిన ”జననీ… ” గీతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ముగింపులో ”ఎత్తర జెండా…” అంటూ సాగే రామజోగయ్య శాస్త్రి రచన కనిపిస్తుంది. మగధీరలో లాగే ఈ పాటలో నటీనటులు, సాంకేతిక నిపుణులు కనిపిస్తారు.
ఎన్టీఆర్, చరణ్ నటన,
యాక్షన్ సన్నివేశాలు,
ఇంటర్వెల్ ముందు సన్నివేశం,
రాజమౌళి మార్క్ మేకింగ్.
నెగటివ్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ కాస్త స్లో గా ఉంది.
బలమైన కథ లేకపోవడం
విశ్లేషణ:
నిజానికి ఇద్దరు స్టార్ హీరోస్ తో రూపొందిన అసలు సిసలు మల్టీస్టారర్ ఎన్నో ఏళ్ళ తరువాత ‘ఆర్.ఆర్.ఆర్.’ రూపంలో వచ్చిందని చెప్పవచ్చు. ఇందులో యన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఏమాత్రం నిరాశ చెందకుండా వారి పాత్రలను మలచిన తీరు అభినందనీయం. ‘ట్రిపుల్ ఆర్’ను జనం తప్పకుండా ఒక్కసారైనా చూస్తారు. ఎంత అనుకున్నా ఈ సినిమా నిడివి మాత్రం ప్రేక్షకులకు పరీక్ష అనే చెప్పాలి. ఆ నిడివి వల్ల, రిపీట్ ఆడియన్స్ తగ్గే అవకాశం ఉండవచ్చు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.