Squid Game 2 Review : నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ లలో ‘స్క్విడ్ గేమ్’ ఒకటి కాగా, దీనికి హవాంగ్ డోంగ్ రచించి, దర్శకత్వం వహించారు. దక్షిణ కొరియాలో డబ్బున్న వారికి , పేద వారికి చాలా సామాజిక అంతరం ఉంటుంది. ఈ కారణంగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల ఆధారంగా హవాంగ్ ఈ కథను రాసుకున్నారు. 456 ఆటగాళ్లను ఓ దీవిలో బంధిస్తారు. అందరూ పేదవాళ్లు. అప్పుల్లో కూరుకుపోయిన వాళ్లు. అలాంటి వాళ్లను ఎంపిక చేసుకొని, ఆటలో ఓడిపోయిన వారి చంపుతూ ఉంటారు ముసుగు వ్యక్తులు. సియాంగ్ గి హున్ … ప్లేయర్ నెం 456. పేరు సియాంగ్. ఈ ప్రమాదకరమైన ఈ ఆట నుంచి బయట పడతాడు. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ ఇక్కడితో ముగుస్తుంది.
ఓటీటీలో స్క్విడ్ గేమ్ సీజన్-1 ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించడంతో సీజన్-2 పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. డిసెంబర్ 26వ తేదీన ‘స్క్విడ్ గేమ్ 2’ సిరీస్ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అవుతుంది. రెండో సీజన్ లో లీ జంగ్ జే, పార్క్ హే సూ, హోయాన్ జంగ్ కీలక పాత్రల్లో నటించారని తెలిపారు. మొదటి సీజన్ తరహాలోనే ఈ సీజన్ లోనూ స్క్విడ్ గేమ్ లో 456 మంది పాల్గొంటారని, ఒక్కో టాస్క్ పూర్తిచేస్తూ ముందుకు వెళతారని వివరించారు. సీజన్-2లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయని, ఈసారి స్క్విడ్ గేమ్ రూల్స్ డిఫరెంట్‌గా ఉంటాయని, ఫస్ట్ సీజన్ కు మించి ట్విస్టులతో సాగుతుందని అంటున్నారు.
ఓ గేమ్ లో ఓడిపోయిన 392 జెర్సీ క్యాండిడేట్ ను గేమ్ నిర్వాహకులు చంపేయడం ఇటీవల విడుదల చేసిన పోస్టర్ లో కనిపిస్తోంది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదల కాగా, ట్రైలర్ చూస్తుంటే.. సీజన్ 1 లో గేమ్ ని గెలిచి బయటకు వచ్చిన ఒక్కడు మళ్ళీ ఈ గేమ్ లోకి వస్తాడు. ఎలాగైనా ఈ ప్రమాదకరమైన గేమ్ ని ఆపాలని అక్కడికి వచ్చినవాళ్లతో ప్రయత్నం చేస్తాడు. మరి కొత్తగా డబ్బుల కోసం ఆశపడి అక్కడికి వచ్చిన వ్యక్తులు ఇతనితో కలిసి గేమ్ ఆపడానికి ప్రయత్నిస్తారా? ఈ గేమ్ నిర్వహించేవాళ్ళు ఏం చేసారు తెలియాలంటే సిరీస్ వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే.
షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకొనుటకు, ఈ నీరు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ నీరు వల్ల ఎన్ని ఆరోగ్య…
Allu Arjun : పుష్ప 2 హిట్ ఏమో కానీ అల్లు అర్జున్ ని పూర్తిగా కార్నర్ చేసేలా పరిస్థితులు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనమే వారి వారి జీవితాలను నిర్దేశిస్తుంది. ప్రస్తుతం నీచ స్థానంలో…
Fenugreek Water : మనం రోజు తినే ఆహార పదార్థంలో మెంతికూరను కూడా ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాం. ఏంటి కూరను…
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు స్థానమును మార్చుకునే సమయంలో ఆలయ ఒక సంచారం చేత ఈనెల 28వ…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ఓ పక్క సినిమాలే కాదు మరోపక్క ఫోటో షూట్స్ తో కూడా…
Dil Raju : పుష్ప 2 ప్రీమియర్ షో వివాదంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి అందరికీ…
Cyber Crime : 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ కు బలి అయ్యాడు. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు.…
This website uses cookies.