Squid Game 2 Review : స్క్విడ్ గేమ్ 2 సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Squid Game 2 Review : స్క్విడ్ గేమ్ 2 సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 December 2024,7:00 pm

Squid Game 2 Review : నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ లలో ‘స్క్విడ్ గేమ్’ ఒకటి కాగా, దీనికి హవాంగ్ డోంగ్ రచించి, దర్శకత్వం వహించారు. దక్షిణ కొరియాలో డబ్బున్న వారికి , పేద వారికి చాలా సామాజిక అంతరం ఉంటుంది. ఈ కారణంగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల ఆధారంగా హవాంగ్ ఈ కథను రాసుకున్నారు. 456 ఆటగాళ్లను ఓ దీవిలో బంధిస్తారు. అందరూ పేదవాళ్లు. అప్పుల్లో కూరుకుపోయిన వాళ్లు. అలాంటి వాళ్లను ఎంపిక చేసుకొని, ఆటలో ఓడిపోయిన వారి చంపుతూ ఉంటారు ముసుగు వ్యక్తులు. సియాంగ్ గి హున్ … ప్లేయర్ నెం 456. పేరు సియాంగ్. ఈ ప్రమాదకరమైన ఈ ఆట నుంచి బయట పడతాడు. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ ఇక్కడితో ముగుస్తుంది.

Squid Game 2 Review స్క్విడ్ గేమ్ 2 సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్‌

Squid Game 2 Review : స్క్విడ్ గేమ్ 2 సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Squid Game 2 Review ఈ చంప‌డం ఏంటి..

ఓటీటీలో స్క్విడ్ గేమ్ సీజన్-1 ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించడంతో సీజన్-2 పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధ‌మైంది. డిసెంబర్ 26వ తేదీన ‘స్క్విడ్ గేమ్ 2’ సిరీస్ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అవుతుంది. రెండో సీజన్ లో లీ జంగ్ జే, పార్క్ హే సూ, హోయాన్ జంగ్ కీల‌క పాత్రల్లో న‌టించారని తెలిపారు. మొదటి సీజన్ తరహాలోనే ఈ సీజన్ లోనూ స్క్విడ్ గేమ్ లో 456 మంది పాల్గొంటారని, ఒక్కో టాస్క్ పూర్తిచేస్తూ ముందుకు వెళతారని వివరించారు. సీజన్‌-2లో మొత్తం 9 ఎపిసోడ్స్‌ ఉన్నాయని, ఈసారి స్క్విడ్ గేమ్ రూల్స్ డిఫ‌రెంట్‌గా ఉంటాయని, ఫస్ట్ సీజన్ కు మించి ట్విస్టులతో సాగుతుందని అంటున్నారు.

ఓ గేమ్ లో ఓడిపోయిన 392 జెర్సీ క్యాండిడేట్ ను గేమ్ నిర్వాహకులు చంపేయడం ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ పోస్టర్ లో కనిపిస్తోంది. ఇటీవ‌ల ట్రైల‌ర్ కూడా విడుద‌ల కాగా, ట్రైలర్ చూస్తుంటే.. సీజన్ 1 లో గేమ్ ని గెలిచి బయటకు వచ్చిన ఒక్కడు మళ్ళీ ఈ గేమ్ లోకి వస్తాడు. ఎలాగైనా ఈ ప్రమాదకరమైన గేమ్ ని ఆపాలని అక్కడికి వచ్చినవాళ్లతో ప్రయత్నం చేస్తాడు. మరి కొత్తగా డబ్బుల కోసం ఆశపడి అక్కడికి వచ్చిన వ్యక్తులు ఇతనితో కలిసి గేమ్ ఆపడానికి ప్రయత్నిస్తారా? ఈ గేమ్ నిర్వహించేవాళ్ళు ఏం చేసారు తెలియాలంటే సిరీస్ వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది