10th Class Diaries Review : 10th క్లాస్ డైరీస్ రివ్యూ.. నాటి రోజుల్లోకి తీసుకెళ్తుంది

10th Class Diaries Review  లవర్ బాయ్ ఇమేజ్ చార్మింగ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో శ్రీరామ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకరికి ఒకరు వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తరువాత చాలా రోజులకు మళ్లీ ఓ ప్రేమ కథ చేశాడు. 10th క్లాస్ డైరీస్ అంటూ శ్రీరామ్, అవికా గోర్‌లు, నేడు (జూలై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అజయ్‌ మైసూర్‌ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రానికి గరుడవేగ అంజి దర్వకత్వం వహించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

Sri Ram Avika Gor And Garudavega Anji 10th Class Diaries Review And Rating

కథ
సోమయాజి అలియాస్ సోము (శ్రీ రామ్) 1997లో టెన్త్ పాస్ అవుతాడు. సోముది రాజమండ్రిలోని భార్గవ్ విద్యానికేతన్. సోముకి హాఫ్ బాయిల్ రంజిత్ (శ్రీనివాస రెడ్డి), గౌరవ్(వెన్నెల రామారావు) అనే ఫ్రెండ్స్ ఉంటారు. ఇక సోముకి టెన్త్ క్లాస్‌లోనే చాందినీ అనే అమ్మాయితో ప్రేమ చిగురిస్తుంది. అయితే కొన్ని కారణాల విడిపోవాల్సి వస్తుంది. ఆ తరువాత సోము విదేశాలకు వెళ్లి బాగా స్థిరపడిపోతాడు. పెళ్లి చేసుకుంటాడు. అన్ని సుఖాలు అనుభవిస్తుంటాడు. కానీ వాటిలో తనకు సంతృప్తి దొరకదు. దీనికి కారణం చిన్నతనంలో తాను ప్రేమించిన చాందినీ అని తెలుసుకుంటాడు. చాందినినీ కలుసుకునేందుకు మళ్లీ ఇండియాకు వస్తాడు సోము.. ఆ తరువాత చాందినీ కోసం చేసిన ప్రయత్నాలేంటి? చివరకు చాందినీ దొరికింది? దొరికితే ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? చివరకు చాందినీ సోములు ఏమయ్యారు? అనేదే కథ.
నటీనటులు
సోము పాత్రలో శ్రీరామ్ మెప్పించాడు.లవర్ బాయ్ తనకు అలవాటైన పాత్రను ఈజీగా చేసేశాడు. కానీ మునుపటిలా మాత్రం స్క్రీన్‌పై కనిపించలేదు. ఇక అవికా గోర్ పాత్ర పరిమితం అనిపిస్తుంది. ఆమె ఎప్పుడో ద్వితీయార్థంలో ఎంట్రీ ఇస్తుంది.క కానీ కనిపించినంత సేపు పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో నటించిన వారందిలోనూ ఓ నటుడు గురించి చెప్పుకోవాల్సిందే. సోము స్నేహితుడిగా గౌరవ్ పాత్రలో కనిపించిన వెన్నెల రామారావు అందిరినీ ఔరా అనిపిస్తాడు. తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ఈ సినిమాతో ఆయన తనలోని నటుడుని బయటకు తీశాడు. అందరితో శభాష్ అనిపించుకునేలా ఉన్నాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి, హిమజ, భాను శ్రీ, నాజర్, శివ బాలాజీ అందరూ కూడా తమ పరిధి మేరకు నటించారు.

చిన్నతనం, స్కూల్‌లో పుట్టే ప్రేమలు ఎంత స్వచ్చంగా ఉంటాయో మరోసారి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇది నిర్మాత నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమని అందరికీ తెలిసిందే.అయితే సినిమా లిబర్టీల్లో భాగంగా చాలానే మార్పులు చేర్పులు చేసినట్టున్నా.. అవన్నీ కూడా ప్రేక్షకుడి కోణంలోంచి బాగానే సెట్ అయినట్టు కనిపిస్తుంది. కామెడీ ట్రాక్ అద్భుతంగా వర్కవుట్ అయింది. శ్రీనివాస్ రెడ్డి, శ్రీరామ్, వెన్నెల రామారావు సినిమా ఆద్యంతం నవ్వించేశారు.

అయితే ఈ ప్రేమ కథలో శ్రీరామ్, అవికా గోర్ మధ్య ఉన్న ఘాడత ప్రేక్షకుడికి ఎక్కకపోవడం మాత్రమే కాస్త మైనస్. మిగతాదంతా ఓకే అనిపిస్తుంది. సోము, చాందినీల మధ్య ఇంకాస్త ఎమోషన్ పెట్టి ఉండాల్సింది. అయితే చిన్నతనంలో పుట్టే ప్రేమకు అంత కారణాలు కూడా అవసరం లేదేమోననిపిస్తుంది. మొత్తానికి ఆ వయసులో పుట్టిన ప్రేమ ఎలా ఉంటుంది.. ఎంతటి వరకు తీసుకెళ్తుంది.. చివరకు ఏం చేసిందనేది మాత్రం క్లైమాక్స్‌లో చూపించి అందరి గుండెను బరువెక్కేలా చేసేశాడు దర్శకుడు. ఈ విషయంలో మాత్రమే టీం అంతా సక్సెస్ అయినట్టే.

తెరపై విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. అంజి తన కెమెరా పనితనం చూపెట్టాడు. సురేష్ బొబ్బలి పాటలు అలా ఫ్లోలో వచ్చి వెళ్తుంటాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. సెకండాఫ్‌లోని సీన్లు, ప్రకృతిని బంధించిన తీరు అందరినీ ఆకట్టుకుంటాయి. తెరపై ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కనిపిస్తుంది.

బాటమ్ లైన్ : 10th క్లాస్ డైరీస్.. కొన్ని అందమైన క్షణాలు

రేటింగ్ : 2.75

Recent Posts

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

2 hours ago

Bakasura Restaurant Movie : యమలీల, ఘటోత్కచుడులా తరహాలొ మా మూవీ బకాసుర రెస్టారెంట్ ఉంటుంది : ఎస్‌జే శివ

Bakasura Restaurant Movie  : ''బకాసుర రెస్టారెంట్‌' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. ఇంతకు ముందు వచ్చిన…

3 hours ago

V Prakash : జగదీష్ రెడ్డి కేసీఆర్ గారితో ఉద్యమంలో ఉన్న‌ప్పుడు క‌విత నువ్వు ఎక్క‌డ ఉన్నావ్‌.. వి ప్రకాష్

V Prakash  : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…

4 hours ago

Tribanadhari Barbarik Movie : చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ విడుద‌ల‌

Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…

4 hours ago

Ys Jagan : చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం : వైఎస్‌ జగన్

Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…

5 hours ago

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ మూవీ నుంచి రెండవ గీతం ‘ఓలే ఓలే’ విడుదల

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…

6 hours ago

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…

7 hours ago

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

8 hours ago