Swathi Muthyam Movie Review : బెల్లంకొండ.. ‘స్వాతిముత్యం’ మూవీ రివ్యూ & రేటింగ్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Swathi Muthyam Movie Review : బెల్లంకొండ.. ‘స్వాతిముత్యం’ మూవీ రివ్యూ & రేటింగ్…!

 Authored By gatla | The Telugu News | Updated on :5 October 2022,10:10 am

Swathi Muthyam Movie Review : బెల్లంకొండ ఫ్యామిలీ గురించి తెలుసు కదా. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తన ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేసి చాలా ఏళ్లు అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనకంటూ ఒక శైలిని, ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. కమర్షియల్ హీరోగా యాక్షన్, మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బెల్లంకొండ సురేశ్ రెండో కొడుకు గణేష్ కూడా తాజాగా హీరోగా తెరంగేట్రం చేశాడు.

అదే స్వాతిముత్యం మూవీ. ఈ సినిమా దసరా కానుకగా తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సరోగసీ కోసం స్పెర్మ్ డొనేషన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. అయినప్పటికీ ఈ సినిమాను పూర్తిస్థాయి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. తెలుగు ఇండస్ట్రీకి కొత్త హీరో అయినప్పటికీ.. సినిమాలో కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయం సినిమా ట్రైలర్, టీజర్లు చూసినప్పుడే ప్రేక్షకులకు అర్థం అవుతుంది. అప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. మరి.. బెల్లంకొండ గణేష్ ప్రేక్షకులను తన తొలి సినిమాతో ఆకట్టుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే సినిమా కథ ఏంటో తెలుసుకోవాలి.

Swathi Muthyam Movie Review and rating in Telugu

Swathi Muthyam Movie Review and rating in Telugu

సినిమా పేరు : స్వాతిముత్యం

నటీనటులు : బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, రావు రమేశ్, నరేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ

డైరెక్టర్ : లక్ష్మణ్ కే కృష్ణ

జానర్ : కామెడీ, ఫ్యామిలీ డ్రామా

రన్ టైమ్ : 2 గంటల 4 నిమిషాలు

విడుదల తేదీ : 5 అక్టోబర్ 2022

SwathiMuthyam Movie Review : సినిమా కథ ఇదే

ఈ సినిమా కథ ఏపీలోని కాకినాడ, పిఠాపురంలో మొదలవుతుంది. బాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో జూనియర్ ఇంజనీర్. ఇంతకీ ఈ బాలు ఎవరంటారా? మన హీరో బెల్లంకొండ గణేష్. తను ఎవ్వరినీ పల్లెత్తు మాట అనడు. తన పని ఏంటో తాను చేసుకొని వెళ్తాడు. చాలా అమాయకుడు. అతడికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఓ పెళ్లి చూపుల్లో భాగ్యలక్ష్మి(వర్ష బొల్లమ్మ)ను చూస్తాడు. అప్పుడు తనకు ఆమె బాగా నచ్చుతుంది. తను ఇంజనీరింగ్ చదివి బెంగళూరులో జాబ్ కు ఆఫర్ వచ్చినా తన ఫ్యామిలీ పంపించరు. దీంతో అదే గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. కనీసం పెళ్లి అయ్యాక అయినా ఉద్యోగం చేయాలని అనుకుంటుంది భాగ్యలక్ష్మి. కానీ.. బాలు ఫ్యామిలీ తను పెళ్లి తర్వాత ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు. దీంతో బాలును పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పేస్తుంది భాగ్యలక్ష్మి. అయినప్పటికీ బాలు.. తనతో పెళ్లికి ఒప్పిస్తాడు. కానీ.. ఇంతలో శైలజ అనే ఓ యువతి బాలుకు పెళ్లికి ముందు ఫోన్ చేయడంతో కథ అంతా అడ్డం తిరుగుతుంది. అసలు శైలజ ఎవరు? శైలజకు, బాలుకు ఉన్న సంబందం ఏంటి? చివరకు భాగ్యలక్ష్మిని బాలు పెళ్లి చేసుకుంటాడా? అనేది తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ ; ఇది స్పెర్మ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా. నిజానికి.. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా డైరెక్టర్ కృష్ణ కూడా స్పెర్మ్ డొనేషన్ కథనే రాసుకున్నాడు. ఇక.. తొలి సినిమా అయినప్పటికీ బెల్లంకొండ గణేష్ బాగా నటించాడు. తన నటనకు ఎలాంటి వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. అమాయకుడిలాంటి పాత్ర తనది. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం తన కుటుంబ సభ్యులను ఒప్పించే పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. మిగితా పాత్రలు కూడా తమ పాత్రల మేరకు నటించారు. మొత్తానికి ఈ సినిమాను ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్

సినిమాటోగ్రఫీ

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

సెకండ్ హాఫ్

కామెడీ

మైనస్ పాయింట్స్

సెన్సిటివ్ కాన్సెప్ట్

కన్ క్లూజన్

దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75/5

Also read

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది